భారత్ గతంలో ఎన్నడూ చేయని పని ఈసారి చేయబోతోంది! ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు పెరగకుండా నియంత్రించేందుకు ముందడుగు వేయబోతోంది. అమెరికా, జపాన్ ఇతర దేశాలతో కలిసి అత్యవసర ముడి చమురు బ్యారెళ్లను విడుదల చేయనుంది. ఫలితంగా కొంతమేరకైనా ధరలు తగ్గుముఖం తగ్గుముఖం పడతాయని భావిస్తున్నట్టు తెలిసింది.
దేశ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం 5.33 మిలియన్ టన్నులు లేదా 38 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను తూర్పు, పశ్చిమ తీరాల్లోని భూగర్భ గుహల్లో భద్రపరిచింది. వీటిని కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తారు. ఇందులోంచి ఇప్పుడు 50 లక్షల బ్యారెళ్లను విడుదల చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. మరో 7-10 రోజుల్లో ఇది మొదలవ్వనుంది.
మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్స్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు వీటిని విక్రయించనుంది. వ్యూహాత్మకంగా భద్రపరిచిన చోటు నుంచి వీటికి పైప్‌లైన్ ఉండటమే ఇందుకు కారణం. ఆ తర్వాత మరిన్ని రిజర్వులను విడుదల చేస్తామని ఆ అధికారి అంటున్నారు. ఓపెక్ దేశాలు ప్రస్తుతం ప్రపంచ అవసరాలకు తగినంత ముడి చమురు ఉత్పత్తి చేయడం లేదు. ఉద్దేశపూర్వకంగానే తగ్గించారు.
కొవిడ్ ముందునాటి స్థాయికి ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడంతో చమురుకు డిమాండ్ పెరిగింది. సరకు కొరత ఉండటంతో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు దేశ అత్యవసర నిల్వల్లోంచి ఒకేసారి తమతో కలిసి విడుదల చేయాలని భారత్, జపాన్, చైనాను కోరింది. భారత్, జపాన్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేయగా చైనా సైతం రెడీ అవుతోందని తెలుస్తోంది.
Also Read: Airtel Revised Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. అన్ని ప్లాన్ల ధరలూ పెంపు.. ఇప్పుడు ఎంతంటే?
Also Read: EPFO New Update: జాబ్ మారారా? పీఎఫ్ బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. మరో మార్పు చేశారు!
Also Read: Cryptocurrency Update: 2 గంటల్లో రూ.1000ని రూ.60 లక్షలుగా మార్చిన కొత్త క్రిప్టో కరెన్సీ
Also Read: Market update: ఒక్కరోజులో రూ.8లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్ పతనానికి కారణాలివే..!
Also Read: Gold-Silver Price: నిలకడగా బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ..