అన్వేషించండి

Israel-Hamas War: మొత్తం భూగ్రహమే మా చట్ట పరిధిలోకి వస్తుంది: హమాస్‌ కమాండర్‌ హెచ్చరిక

Israel-Hamas War: మొత్తం భూగ్రహమే మా చట్ట పరిధిలోకి వస్తుంది: హమాస్‌ కమాండర్‌ హెచ్చరిక

ఇజ్రాయెల్‌-గాజాల మధ్య జరుగుతున్న ఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో హమాస్‌ కమాండర్‌ మహమూద్‌ అల్‌-జహర్‌  మరింత ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంపై ఆధిపత్యమే తమ లక్ష్యం అంటూ ఆయన హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ సభ్యులతో మాట్లాడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. ఒక నిమిషం పాటు ఈ వీడియో ఉంది. ఇజ్రాయెల్‌ కేవలం తమ ప్రారంభ లక్ష్యం అని, ప్రపంచం మొత్తం తమ చట్టంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.

 'ఇజ్రాయెల్‌ మొదటి లక్ష్యం మాత్రమే, మొత్తం భూ గ్రహమే మా చట్టం పరిధిలోకి వస్తుంది. పూర్తి గ్రహంలోని 510 మిలియన్‌ చదరపు కిలోమీటర్లు అన్యాయం, అణిచివేత, హత్యలు, నేరాలు లేని సిస్టమ్‌ కిందకు వస్తాయి. పాలస్తీనియన్లకు, అరబ్స్‌, అన్ని అరబ్‌ దేశాలకు, లెబనాన్‌, సిరియా, ఇరాక్‌ ఇతర దేశాలకు వ్యతిరేకంగా నేరాలు జరగని చట్ట పరిధుల్లోకి అందరూ వస్తారు' అంటూ వ్యాఖ్యలు చేశాడు. హమాస్‌ నుంచి ఈ వీడియో విడుదలైన తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందించారు. హమాస్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం కచ్చితంగా కొనసాగుతుందని, అందుకు నిబద్ధులమై ఉన్నామని పునరుద్ఘాటిస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రతి హమాస్‌ సభ్యుడు 'చనిపోయిన వ్యక్తి' అవుతారంటూ హెచ్చరించారు. హమాస్‌ దాయూష్‌ లాంటి సంస్థ అని, ప్రపంచం దాయూష్‌ను నాశనం చేసినట్లు తాము హమాస్‌ను అంతం చేస్తామని టెలివిజన్‌ ప్రకటనలో స్పష్టంచేశారు. 

హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ సైనికులను, పౌరులను చాలా మందిని బందీలుగా పట్టుకున్నారు. ఇజ్రాయెల్‌కు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండానే బందీలను ఇంటికి ఒకరిని ఉరి తీస్తామని హమాస్‌ బెదిరిస్తోంది. కాగా ఇజ్రాయెల్‌ హమాస్‌ ఆధీనంలోని గాజా స్ట్రిప్‌ను పూర్తిగా అష్ట దిగ్భంధం చేసింది. అక్కడికి నీరు, విద్యుత్‌, ఆహారం అందకుండా చేస్తోంది. గాజా మొత్తం ఇప్పుడు పూర్తిగా అధకారం అయ్యింది. దాదాపు 1500  మంది హమాస్‌ మిలిటెంట్ల శవాలు కూడా లభ్యమయ్యాయని ఇజ్రాయెల్‌ చెప్తోంది. హమాస్‌ను ఎదుర్కొంనేందుకు ఇజ్రాయెల్‌లో అత్యవసర ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా నెతన్యాహుతో కలిసి వచ్చాయి. సమైక్యంగా యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా, యూకే, భారత్‌ సహా పలు దేశాలు మద్దతు ఇస్తున్నాయి. 

గత శనివారం పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలెటంట్‌ సంస్థ కేవలం 30 నిమిషాల వ్యవధిలో ఇజ్రాయెల్‌పై 5 వేల రాకెట్లు ప్రయోగించి మెరుపు దాడికి దిగింది. దీంతో ఇజ్రాయెల్‌ ప్రతి దాడులు చేస్తోంది. ఇలా ఇరు వర్గాల మధ్య గత కొన్ని రోజులుగా భీకర ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కాగా ఈ ఘర్షణల కారణంగా ఇరువైపులా ఇప్పటికి 3వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం జరుగుతున్న ఇరు వైపు ప్రాంతాల్లోనూ పరిస్థితులు హృదయ విదారకంగా మారాయి. అయినా ఇజ్రాయెల్, హమాస్ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగిస్తోంది. గాజాపై దాడులను ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. గాజా సరిహద్దులో ఉన్న దక్షిణ ఇజ్రాయెల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇది ఇలా ఉండగా ఇజ్రాయెల్‌పై లెబనాన్‌, సిరియాల నుంచి కూడా రాకెట్‌ దాడులు జరిగాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్‌ దళాలు, ఈ దాడులకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. లెబనాన్‌, సిరియాలతోపాటు ఇరాన్‌, ఖతార్‌, కువైట్‌ హమాస్‌ను సమర్థిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
 Hockey Saffron Jersey: సాంప్రదాయ బ్లూ డ్రెస్‌కు గుడ్ బై.. క‌షాయ‌రంగు జెర్సీ రచ్చపై హాకీ ఇండియా వివరణ, జెర్సీ మార్పు వెనుక అస‌లు ట్విస్ట్ ఇదే!
సాంప్రదాయ బ్లూ డ్రెస్‌కు గుడ్ బై.. క‌షాయ‌రంగు జెర్సీ రచ్చపై హాకీ ఇండియా వివరణ, జెర్సీ మార్పు వెనుక అస‌లు ట్విస్ట్ ఇదే!
Brazil - India Match: ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మ‌రో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం.. కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్, వేదిక‌, మ్యాచ్ ఎప్పుడంటే..!
ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మ‌రో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం.. కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్, వేదిక‌, మ్యాచ్ ఎప్పుడంటే..!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Embed widget