అన్వేషించండి

Tesla's Human-Sized Robot-టెస్లా చిట్టి రోబోట్ వచ్చేది అప్పుడే-మస్క్ ట్వీట్

టెస్లా సంస్థ రూపొందిస్తున్న ఆప్టిమస్ హ్యూమనాయిడ్ ప్రోటోటైప్ విడుదలను వాయిదా పడింది. సెప్టెంబర్ 30న అందుబాటులోకి తీసుకొస్తామని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.

టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ట్వీట్ చేసినా ప్రపంచమంతా గమనిస్తుంది. అతని స్థాయి అలాంటిది మరి. రాకెట్ సైన్స్ చదువుకుని ఏకంగా స్పేసెక్స్‌ సంస్థనే స్థాపించిన మస్క్‌కి  ప్రయోగాలంటే ఎంతో సరదా. ఎప్పుడూ ఏదో ఓ ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేయాలని తపిస్తుంటాడు. అందుకోసం శ్రమిస్తూనే ఉంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ పైనా నిత్యం పరిశోధనలు చేస్తోంది టెస్లా. ఈ టెక్నాలజీతోనే హ్యూమనాయిడ్ రోబోట్‌ని తయారు చేయాలనేది ఎలన్ మస్క్ కల. ఇందుకోసం చాలానే సమయం కేటాయిస్తున్నారాయన. ఆప్టిమస్ అని పిలిచే హ్యూమనాయిడ్ రోబోట్‌ని ఈ ఏడాది ఆగస్టు 19న వెలుగులోకి తీసుకొస్తామని గతంలోనే చెప్పారు మస్క్. 2021 ఆగస్టులో ఏఐ డే సందర్భంగా ఆప్టిమస్ గురించి ప్రస్తావించారు మస్క్. వచ్చే ఏఐ డే నాటికి ప్రోటోటైప్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని అప్పట్లోనే ప్రకటించారు. ఈ ప్రకటన తరవాత ఎప్పుడెప్పుడు ఆప్టిమస్‌ని చూస్తామా అని టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ ఏడాది ఆగస్టు 19వ ఏఐ డే సందర్భంగా ఆప్టిమస్ ప్రోటోటైప్‌ని విడుదల చేయాల్సి ఉంది. కానీ ఏఐ డే ని సెప్టెంబర్ 30వ తేదీకి మార్చుతున్నట్టు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. అప్పటి లోగా ఆప్టిమస్ ప్రోటోటైప్ తయారవుతుందని అందులో పేర్కొన్నారు. 

ఏంటీ ఆప్టిమస్ హ్యూమనాయిడ్..? 
ఆప్టిమస్. అచ్చం మనిషిని పోలి ఉండే రోబోట్‌ ఇది. 5.8 అడుగులు ఎత్తుండే ఆప్టిమస్ 57 కిలోల బరువుంటుంది. 20 కిలోల బరువుని సులువుగా మోయగలదు. విద్యుత్ వాహనాల్లో వినియోగించే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీనే ఆప్టిమస్‌ కోసమూ వాడుతున్నట్టు ప్రకటించారు ఎలన్ మస్క్. టెస్లా బాట్‌గానూ దీన్ని పిలుస్తున్నారు. గ్రాసరీ షాపింగ్ లాంటి పనులను చేయగలదు ఈ రోబో. ప్రస్తుతానికి వేరే ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఆప్టిమస్‌ పైనే దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఇప్పుడే కాదు గతంలోనూ పలు ఆవిష్కరణల ఇలా ప్రోటోటైప్స్ విడుదల చేస్తూ ట్రెండ్ సృష్టించారు మస్క్. ఇప్పుడు ఆప్టిమస్ హ్యూమనాయిడ్ ప్రోటోటైప్ రిలీజ్ పోస్ట్‌పోన్ అవటం వల్ల అంచనాలు ఇంకా పెరిగాయి. మిష్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న మస్క్ ఆప్టిమస్‌లో ఏ చిన్న లోపమూ ఉండకూడదని చాలా కచ్చితంగా చెప్పారట. అందుకే కాస్త ఆలస్యంగా విడుదల చేసినా అన్నీ పక్కాగా ఉండేలా చూస్తున్నారు సైంటిస్ట్‌లు. ఇక భవిష్యత్‌ అంతా రోబోలదేనని, ఫిజికల్‌ వర్క్ అనేది ఇకపై ఆప్షన్ మాత్రమే అని గతంలో మస్క్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. అందుకు అనుగుణంగానే ఆప్టిమస్‌ని తయారు చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Shubman Gill, Rishabh Pant Record: ఒకే ఇన్నింగ్స్‌లో చరిత్ర సృష్టించిన గిల్, పంత్.. డబ్ల్యూటీసీలో 3000 పరుగులు దాటిన తొలి భారత ఆటగాళ్లుగా రికార్డు, సెంచరీ చేజారడంతో నిరాశలో కెప్టెన్
ఒకే ఇన్నింగ్స్‌లో చరిత్ర సృష్టించిన గిల్, పంత్.. డబ్ల్యూటీసీలో 3000 పరుగులు దాటిన తొలి భారత ఆటగాళ్లుగా రికార్డు, సెంచరీ చేజారడంతో నిరాశలో కెప్టెన్
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget