అన్వేషించండి

ఎన్నికలంటే అందాల పోటీలు కాదు, ప్రధాని మోదీపై జైరాం రమేశ్ సెటైర్

Lok Sabha Elections 2024: ఎన్నికలంటే అందాల పోటీలు కాదంటూ జైరాం రమేశ్ బీజేపీపై సెటైర్లు వేశారు.

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ, ప్రతిపక్షాల మధ్య విమర్శల డోస్‌ పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తోంది. అయితే...కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్నను చాలా రోజులుగా ఎదుర్కొంటోంది కాంగ్రెస్. ఈ విషయంలో సీనియర్ నేత జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీకి అయినా ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం ముఖ్యం కాదని, ఎన్నికలంటే వ్యక్తుల మధ్య పోటీ అనుకోవడం సరికాదని తేల్చి చెప్పారు. ఇవేమీ అందాల పోటీలు కాదంటూ సెటైర్ వేశారు. పార్టీలు, పార్టీల సిద్ధాంతాల మధ్యే ఎన్నికల పోటీ ఉంటుందని వెల్లడించారు. 

"మన దేశంలో ఎన్నికలంటే అందాల పోటీలు కాదు. పార్టీలు, పార్టీల సిద్ధాంతాలు, ప్రచారాల మధ్య పోటీ ఉంటుంది తప్ప వ్యక్తుల మధ్య కాదు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం మాత్రమే ఎన్నికలు అనుకోవడం సరికాదు"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత

I.N.D.I.A కూటమి తరపున ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపైనా మీడియా జైరాం రమేశ్‌ని ప్రశ్నించింది. దీనికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టో ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే...అందుకు బదులుగా పంచ్ న్యాయ్‌ పేరిట ఓ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. ఇది కేవలం కాంగ్రెస్‌ది మాత్రమే కాదని, అన్ని ప్రతిపక్ష పార్టీలదని వెల్లడించారు. 

"ఇండియా కూటమి తరపున ఉమ్మడి మేనిఫెస్టో లాంటిది ఏమీ లేదు. మేం కేవలం పంచ్ న్యాయ్ ఎజెండాతోనే పని చేస్తున్నాం. ఇది కేవలం కాంగ్రెస్‌కి మాత్రమే చెందింది కాదు. అన్ని పార్టీలది"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

ప్రధాని మోదీ, అమిత్‌ షా ఇద్దరిపైనా విమర్శలు గుప్పించారు జైరాం రమేశ్. వాళ్లు సొంతగా 370 సీట్లు గెలుచుకునేటట్టైతే మిగతా పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. తాను ఒక్కడే భారత్‌కి చాలు అంటూ గతంలో ప్రధాని మోదీ అన్నారని, కానీ ఇప్పుడు BJD,పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడుతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని మండి పడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

Ravi Shastri Supports Gambhir:  గంభీర్ వ్యాఖ్య‌లకు రవిశాస్త్రి మద్దతు, 2027 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు కీలక హెచ్చరిక
గంభీర్ వ్యాఖ్య‌లకు రవిశాస్త్రి మద్దతు, 2027 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు కీలక హెచ్చరిక
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Sonia Gandhi Memoir Controversy: సోనియా ఆత్మకథ బిలాంగింగ్ చుట్టూ రాజకీయం.. క్విక్ కామర్స్‌లో విక్రయాలతో కాంగ్రెస్‌కు సానుభూతి వస్తుందా?
సోనియా ఆత్మకథ బిలాంగింగ్ చుట్టూ రాజకీయం.. క్విక్ కామర్స్‌లో విక్రయాలతో కాంగ్రెస్‌కు సానుభూతి వస్తుందా?
AP Health Survey: ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు
ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Embed widget