Prakash Raj : ప్రకాష్ రాజ్‌కు ఈడీ నోటీసులు - వంద కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నారా ?
Prakash Raj : ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఓ పోంజీ స్కీమ్‌కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారని ఈడీ భావిస్తోంది.

Prakash Raj : ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చెన్నైలో వచ్చేవారం విచారణకు రావాలని సూచించింది. తిరుచ్చికి చెందిన ఓ ఆభరణాల సంస్థపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు. అందుకే ఆయనను విచారణకు పిలిచింది ఈడీ. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ అనే కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ జువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.
తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు.. ప్రణవ్ జువెలర్స్ సేకరించిందని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధిక రిటర్న్స్ ఇస్తామని ఈ మొత్తం సేకరించారని పేర్కొన్నారు. ఈ సంస్థకు ప్రచారకర్తగా ప్రకాష్ రాజ్ వ్యవహరించి ఫీజు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ సంస్థలో సంబంధాలు ఉన్నందున ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రకాష్ రాజ్ భారతీయ జనతా పార్టీ ని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులు మోదీకి వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే బీజేపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తుల ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. కర్ణాటకలో గతంలో గౌరీ లంకేష్ అనే రచయితను హత్య చేశారు. ఇది పూర్తిగా మత చాందసవాదుల మద్దతుతోనే జరిగిందని..దీనికి బీజేపీనే కారణం అని ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు ప్రారంభించారు. అప్పట్నుంచి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో బెంగళూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ డిపాజిట్ కూడా రాలేదు.
తర్వాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేసినా విజయం సాధించలేదు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం.. బీజేపీ విధాలను విమర్శించడానికి.. ప్రధాని మోదీ తీరును ప్రశ్నించడానికి సోషల్ మీడియాలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయనకు ఈడీ నోటీసులు రావడం ఆసక్తికరంగా మారింది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply
Before You Go
West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
ట్రెండింగ్ వార్తలు






















