అన్వేషించండి

CM Hemant Soren Disqualification: సీఎంపై అనర్హతా వేటు వేయండి, ఎన్నికల సంఘం సూచన - గవర్నర్‌కు లేఖ

CM Hemant Soren Disqualification: ఝార్ఖండ్ సీఎం సోరెన్‌పై అనర్హతా వేటు వేయాలని ఎన్నికల సంఘం సూచించింది.

CM Hemant Soren Disqualification: 

అక్రమ మైనింగ్ కేసులో..

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హతా వేటు వేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు గవర్నర్‌కు ఈసీ లేఖ రాసింది. అక్రమ మైనింగ్‌ కేసులో సీఎం హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇలా సూచనలు చేసింది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు AK-47 గన్స్‌ని స్వాధీనం చేసుకుంది ఈడీ. అక్రమ మైనింగ్, బెదిరింపుల కేసులో ప్రకాశ్‌కు హస్తం ఉందని అనుమానించిన ఈడీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేశారు. హర్ము హౌజింగ్ కాలనీలోని ఆయన ఇంట్లో అల్మారాలో AK-47 గన్స్ ఉన్నట్టు గుర్తించారు. అక్రమ మైనింగ్ కేసులో రాంచీలో పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన అందరి ఇళ్లనూ టార్గెట్ చేసింది. ఝార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో 17-20 చోట్ల సోదాలు చేసేందుకు సిద్ధమవుతోంది. సీఎం హేమంత్ సోరెన్‌కు రాజకీయ సన్నిహితుడైన పంకజ్ మిశ్రాను ఇప్పటికే ఈ అంశంపై 
విచారణ చేపట్టింది. మిశ్రా అసోసియేట్ బచ్చు యాదవ్‌నూ ప్రశ్నించింది ఈడీ. ఆ తరవాత ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్‌లో అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.100 కోట్లు సంపాదించారన్న అనుమానాల నేపథ్యంలో దూకుడు పెంచింది. 

ఆధారాల సేకరణ..

జులై 8వ తేదీన మిశ్రాతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు ఈడీ అధికారులు. సాహిబ్‌గంజ్, బర్హెట్, రాజ్‌మహల్, మిర్జా చౌకీ, బర్హర్వా సహా 19 ప్రాంతాల్లో రెయిడ్‌లు నిర్వహించింది. మొత్తం 50 బ్యాంక్ ఖాతాల్లోని రూ.13.32 కోట్లను జప్తు చేసింది. మార్చిలోనే మిశ్రాపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (PMLA)కేసు నమోదు చేశారు. అయితే...దీనిపై స్పందించిన పంకజ్ మిశ్రా..తనను అన్యాయంగా ఈ స్కామ్‌లో ఇరికించారని మండి పడ్డారు. అయితే ఈడీ మాత్రం కచ్చితంగా కుంభకోణం జరిగిందని స్పష్టం చేస్తోంది. విచారణలో భాగంగా పలు ఆధారాలు, స్టేట్‌మెంట్‌లు, డిజిటల్ ఎవిడెన్స్‌లు సేకరించినట్టు వెల్లడించింది. సాహిబ్‌గంజ్‌లో అక్రమ మైనింగ్‌తో కోట్ల రూపాయలు సంపాదించా రనటానికి ఆధారాలున్నట్టు తెలిపింది. అటవీ ప్రాంతంలోనూ మైనింగ్ చేశారని స్పష్టం చేసింది. 

వరుస దాడులు..

కొద్ది రోజులుగా భాజపా...తాను అధికారంలో లేని రాష్ట్రాల్లో ఇలా దాడులు చేయిస్తోందన్న వాదన వినిపిస్తోంది. బిహార్‌లో ఓ వైపు సీబీఐ సోదాలు జరుగుతుండగానే...ఇప్పుడు ఝార్ఖండ్‌లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ మధ్య ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో భేటీ అయ్యారు. కేంద్రంలో భాజపాకు ప్రత్యామ్నయ శక్తిగా నిలవాలని భావిస్తున్న కేసీఆర్...సోరెన్‌ను కలవటంపై చర్చ జరిగింది. ఇటీవల హేమంత్ సొరేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తి గత కారణాలతో హైదరాబాద్‌ వచ్చారు. ఆ సమయంలో ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గతంలో ఒకసారి హేమంత్‌ సొరెన్‌ హైదరాబాద్‌ లో  కేసీఆర్‌తో సమావేశమయ్యారు. 
ఇటీవల సీఎం కేసీఆర్‌ కూడా రాంచీ వెళ్లి హేమంత్‌ సొరేన్‌తో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా సమకాలీన అంశాలపై చర్చించారు. ఇరువురు  భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటించిన తర్వాత ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Also Read: Pegasus Row: ఆ ఫోన్లు పెగాసస్‌కు గురైనట్టు ఆధారాల్లేవు, సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget