By: Ram Manohar | Updated at : 18 Mar 2023 11:32 AM (IST)
డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, యూట్యూబ్ అకౌంట్‌లు రీస్టోర్ అయ్యాయి. (Image Credits: AFP)
Donald Trump Social Media Accounts:
రెండేళ్లుగా బ్యాన్..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. చాన్నాళ్ల పాటు ఆయన ఫేస్‌బుక్, యూట్యూబ్ అకౌంట్‌లను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆయన అకౌంట్‌లు యాక్టివ్‌గా లేవు. రెండేళ్ల తరవాత ఈ రెండు అకౌంట్‌లు రీస్టోర్ అయ్యాయి. ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు ట్రంప్. ఆయనకు ఫేస్‌బుక్‌లో 3 కోట్ల మంది, యూట్యూబ్‌లో 26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్ అకౌంట్ రీయాక్టివ్ అయినట్టు ట్రంప్ పోస్ట్ చేశారు. ""I'M BACK" అంటూ ఓ వీడియో షేర్ చేశారు. 2016లో అధ్యక్ష ఎన్నికల తరవాత కీలక ప్రసంగం చేశారు. ఆ వీడియోలో మొదటి 12 సెకన్లు ఎడిట్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు ట్రంప్. 2021 జనవరి 6 వ తేదీ నుంచి ఆయన అకౌంట్‌లు బ్లాక్ అయ్యాయి. ఇన్నాళ్లకు అవి రీస్టోర్ అయ్యాయి. దీనిపై YouTube కీలక ప్రకటన చేసింది. ట్రంప్ అకౌంట్‌పై బ్యాన్‌ను ఎత్తివేస్తున్నామని వెల్లడించింది.
"ఇవాళ్టి నుంచి డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నాం. ఇప్పటి నుంచి ట్రంప్ కొంత కంటెంట్‌ను అప్‌లోడ్ చేసుకోవచ్చు"
- యూట్యూబ్
#BREAKING 'I'M BACK': Trump writes first Facebook post after ban lifted pic.twitter.com/CS7PzZXfoy
— AFP News Agency (@AFP) March 17, 2023
#UPDATE Former president Donald Trump wrote his first posts on his reinstated Facebook and YouTube accounts, more than two years after he was banned over the US Capitol insurrection https://t.co/oc64AbAQAz pic.twitter.com/oSrr8agfT2
— AFP News Agency (@AFP) March 17, 2023
ఇటీవలే ట్విటర్ పునరుద్ధరణ..
అంతకు ముందు ట్విటర్ అకౌంట్‌ను కూడా రీస్టోర్ చేసింది అమెరికా. గతేడాది నవంబర్‌లో ఈ నిషేధం ఎత్తి వేశారు. దాదాపు 22 నెలల తర్వాత ట్విట్టర్ లో మళ్లీ ట్రంప్ ఖాతా శనివారం కనిపించింది. 2021లో జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్ వద్ద హింసను ప్రేరేపించింనందుకు ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేశారు. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించేందుకు ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. 15 మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ట్రంప్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి అనుకూలంగా 51.8 శాతం ఓట్లు వచ్చాయి. అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేసి, అకౌంట్ పునరుద్ధరించారు. ట్విట్టర్ కి తిరిగి రావడానికి తనకు ఆసక్తి లేదని ట్రంప్ భిన్నంగా స్పందించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అభివృద్ధి చేసిన తన కొత్త ఫ్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇది ట్విట్టర్ కంటే మెరుగ్గా ఉందని ట్రంప్ అన్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. రిపబ్లికన్ యూదుల సంకీర్ణ వార్షిక నాయకత్వ సమావేశంలో ప్యానెల్ ద్వారా ట్విట్టర్‌కు తిరిగి రావాలని అలోచిస్తున్నారా అన్న ప్రశ్నకు " తిరిగి రావడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు," అని అమెరికా మాజీ అధ్యక్షుడు చెప్పారు.
UP News: భార్య, బిడ్డను దోమలు కరుస్తున్నాయని ఓ వ్యక్తి ట్వీట్- రియాక్ట్ అయిన పోలీసులు
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్
Chaitra Navratri 2023: 100 మందిని సన్యాసులుగా మార్చేయనున్న రామ్‌దేవ్ బాబా, ముహూర్తం కూడా పెట్టేశారు
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు