Coronavirus India Live Updates: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు... కొత్తగా 30948 కరోనా కేసులు, 403 మరణాలు
దేశంలో శనివారం కరోనా కేసులు సల్పంగా తగ్గాయి. కొత్తగా 30948 మందికి కరోనా సోకగా, 403 మంది మరణించారు.
దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 30948 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 403 మంది మృతి చెందారు. శనివారం 38,487 మంది కరోనాను జయించారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,53,398గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసులు 3,24,24,234గా ఉండగా.. మరణాలు 4,34,367గా ఉన్నాయి. దేశంలో శనివారం 15,85,681 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 50,60,06,588కు చేరింది. శనివారం దేశంలో 52,23,612 వ్యాక్సిన్లు అందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 58,14,89,377 టీకా డోసులు పంపిణీ చేశారు.
తగ్గిన కేసులు
దేశంలో యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. 152 రోజుల్లో ఇది అత్యల్పం. మరోవైపు రికవరీ రేటు 97.57 శాతంగా ఉంది. గతేడాది మార్చి నుంచి చూస్తే పరిశీలిస్తే రికవరీ రేటు ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. రోజూవారీ పాజిటివిటీ రేటు 1.95 శాతంగా ఉంటే మరణాల రేటు 1.34 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 5,63,284 మందికి కరోనా సోకినట్లు నివేదికలు తెలిపారు. వైరస్ ధాటికి మరో శనివారం ప్రపంచవ్యాప్తంగా 8681 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,21,05,031కి చేరుకున్నాయి. మరణాల సంఖ్య 44,35,534కు చేరింది.
వారికి బ్లాక్ పంగస్ ముప్పు ఎక్కువ
కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వారిలో బ్లాక్‌ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పలువురు బాధితుల్లో డెల్టా వేరియంట్ లక్షణాలు ఉన్నట్లు పరిశోధనలో తెలింది. ఒక డోసు కూడా వ్యాక్సిన్ పొందనివారు, రోగనిరోధక శక్తి తగ్గి చక్కెర వ్యాధి కలిగి రక్తంలో ఇనుము శాతం ఎక్కువగా ఉన్నవారిలో అధికంగా బ్లాక్‌ఫంగస్ బారినపడినట్లు తేలింది. ఈనెల 10 నాటికి ఏపీలో 4,609 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవ్వగా వీరిలో 432 మంది చనిపోయారు. మరణాల రేటు 9.37శాతంగా ఉంది. 2,519 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. 3,514 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. విజయవాడ జీజీహెచ్‌లో చేరిన బ్లాక్‌ఫంగస్ బాధితులపై వైద్య నిపుణుల బృందం అధ్యయనం చేసింది. విజయవాడ జీజీహెచ్‌లో ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు 538 మంది బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స అందించారు.
Also Read: Karimnagar: ఒకే కాన్పులో అక్కకు నలుగురు, చెల్లికి ముగ్గురు.. మరో అవాక్కయ్యే ట్విస్ట్ కూడా..
Also Read: Viral Video: ఛీ.. పాడు.. పానీపూరీలో ఏం కలిపాడో చూడండి.. అసహ్యించుకుంటారు!