అన్వేషించండి

Family Doctor Scheme: ఏప్రిల్ 6న 'ఫ్యామిలీ డాక్టర్'ను ప్రారంభించనున్న సీఎం జగన్

Family Doctor Scheme: ముఖ్యమంత్రి జగన్ రేపు పల్నాడు జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే సభలో ప్రసంగిస్తారు.

Family Doctor Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ విధానాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు.. అందులో భాగంగా మరో విధానాన్ని ఆవిష్కరించనుంది. ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని ఏప్రిల్ 6వ తేదీన గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నూతన విధానాన్ని సీఎం జగన్ పల్నాడు జిల్లాలో ప్రారంభించనున్నారు.

పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగం గుంట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కావూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. వైద్య, ఆరోగ్య సేవలు రాష్ట్రం నలుమూలల విస్తరించాలన్న ఉద్దేశంతో పాటు ప్రతి ఒక్కరికీ స్పెషలిస్టు డాక్టర్ల సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రారంభించనుంది. దానికి ఫ్యామిలీ డాక్టర్ అనే పేరును పెట్టింది. ఈ విధానాన్ని రాష్ట్ర సర్కారు కొన్ని రోజులుగా దశలవారీగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తూ వస్తోంది. అందులో మంచి ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని జగన్ ప్రభుత్వం సంకల్పించింది. గురువారం రోజు (ఏప్రిల్ 6న) పల్నాడు జిల్లాలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ ను ప్రారంభించనున్నారు.

ముఖ్యమంత్రి జగన్ ప్రోగ్రాం షెడ్యూల్

గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుండి సీఎం జగన్ బయలుదేరతారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో పల్నాడు జిల్లా లింగంగుంట్లకు చేరుకుంటారు. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ ఎంటర్ ను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ స్టాల్స్ ను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే సభకు హాజరై బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం జగన్ తిరిగి  తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. 

ఫ్యామిలీ డాక్టర్ విధానం 
ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా సాధారణ వైద్య ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ విధానంతో గ్రామీణ ప్రాంతంలో అనేక రోగాలకు సకాలంలో చికిత్స అందుతుంది. ఫ్యామిలీ డాక్టర్స్ రోగులకు నేరుగా చికిత్స అందిస్తారు. లేదంటే మెరుగైన చికిత్స కోసం స్పెషలిస్టు వైద్యులకు సిఫార్సు చేస్తారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం కింద గ్రామీణ ప్రాంతాల్లో వైద్య అవసరాలను ఆరంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మెరుగైన వైద్యం కోసం నకిలీ డాక్టర్లపై ఆధారపడే అవసరం ఉండదు. శాస్త్రీయంగా, కచ్చితంగా జరిగే రోగ నిర్ధారణ పరీక్షల వల్ల రోగం ఏంటో తెలుసుకోవడంతో పాటు ఆసుపత్రుల్లో ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. వీటితో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం వల్ల జిల్లా ఆసుపత్రులపై ఒత్తిడి, పని భారంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగిస్తారని తెలుస్తోంది. దీని వల్ల నిరుపేదలకు సైతం మంచి మెరుగైన వైద్యం అందుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kumbh Mela Monalisa Marriage : ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా మోనాలిసా - పోలీసులను ఆశ్రయించి మరీ...
ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా మోనాలిసా - పోలీసులను ఆశ్రయించి మరీ...
Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
Viral News:కోమాలోని మహిళకు పునర్జన్మ ప్రసాదించిన రోడ్డు గుంత! ఇది నిజంగానే మెడికల్‌ మిరాకిల్‌!
కోమాలోని మహిళకు పునర్జన్మ ప్రసాదించిన రోడ్డు గుంత! ఇది నిజంగానే మెడికల్‌ మిరాకిల్‌!
LPG Crisis: గ్యాస్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్! భారత్ వస్తున్న రెండు PNG కార్గోలు, ప్రభుత్వం ఏం చెప్పింది?
గ్యాస్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్! భారత్ వస్తున్న రెండు PNG కార్గోలు, ప్రభుత్వం ఏం చెప్పింది?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget