News
News
వీడియోలు ఆటలు
X

Chittoor News: కుప్పంలో రెండు మదపుటేనుగులను బంధించిన అటవీ శాఖ అధికారులు

Chittoor News: చిత్తూరు జిల్లా కుప్పంలో గత వారం రోజులుగా నలుగురిని తొక్కి చంపిన మదపుటేనుగులను అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. 

FOLLOW US: 
Share:

Chittoor News: తమిళనాడులోని కృష్ణగిరిలో రెండు వారాల క్రితం, కుప్పంలో గత వారంగా బీభత్సం సృష్టించి నలుగురిని తొక్కి చంపిన రెండు మదపుటేనుగులను ఎట్టకేలకు బంధించి హోసూరు అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ రెండు ఏనుగులు తిరుపత్తూరు సమీపంలోని పొలాల్లో భీకరంగా పోరాడాయి. వాటి పోరాట దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలతో కలసి మత్తు మందు ఇవ్వగా ఒకటి మత్తులోకి జారుకోగా.. మరొకటి తప్పించుకుంది. తప్పించుకున్న ఏనుగు జాడ పసిగట్టిన అధికారులు ఆ ఏనుగుకు కూడా మత్తు మందు ఇచ్చి బంధించారు. వారం రోజుల పాటు కుప్పం వాసులకు కంటి‌ మీద నిద్ర లేకుండా చేసిన రెండు ఏనుగులను బంధించడంతో కుప్పం వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవలే మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌కు తాకి ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు.

అసలేం జరిగిందంటే?

ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు తప్పించుకుని సమీపంలోని తువ్వ కొండవైపు వెళ్లిపోయాయని తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. వెళ్లిపోయిన రెండు ఏనుగులు తిరిగి వచ్చి ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది, పోలీసులు కొండ వైపునకు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరిస్తున్నారు.

ఏనుగుల బీభత్సం, పట్టించుకోని అధికారులు

మార్చి నెలలో చిత్తూరులో ఏనుగుల బీభత్సం..
 
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బైరెడ్డిపల్లె మండలం, తార్లచేను  గ్రామం శివారులో దాదాపు 12 ఏనుగుల గుంపు పంట పొలాలను తొక్కి నాశనం చేశాయి. అంతేకాకుండా పొలం వద్ద ఉన్న లేగదూడను ఏనుగులు తొక్కి చంపాయి. రాగి, టమోట, వేరుశనగ వంటి పంటలను తొక్కి పూర్తిగా నాశనం చేశాయి. డ్రిప్ పైపులు, బోర్ మోటర్ పరికరాలను కూడా తొక్కడంతో అవన్నీ ధ్వంసం అయ్యాయి. అయితే విషయం గుర్తించిన రైతులు.. తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పంటను మొత్తం నాశనం చేయడంతో తాము ఎలా బతకాలంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏనుగుల బీభత్సం వల్ల సుమారు లక్ష రూపాయలకుపైగా పంట నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published at : 19 May 2023 10:10 AM (IST) Tags: AP News Chittoor News Elephants Elephants in Chittoor Officials Catches Elephants

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

టాప్ స్టోరీస్

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్

Odisha Train Accident:  ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?