అన్వేషించండి

మహిళని డార్లింగ్ అని పిలిచినా లైంగికంగా వేధించినట్టే - కోర్టు కీలక వ్యాఖ్యలు

Calcutta High Court: తెలియని మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని కలకత్తా హైకోర్టు తేల్చి చెప్పింది.

Calcutta High Court News: కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. IPC ప్రకారం ఇది నేరమే అని స్పష్టం చేసింది. జస్టిస్ జై సేన్‌గుప్త ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి మహిళా కానిస్టేబుల్‌ని డార్లింగ్ అని పిలిచాడు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తెలియని మహిళలను అలా సంబోధిస్తే లైంగికంగా వేధించినట్టే అవుతుందని అని చెప్పింది. 

"కానిస్టేబుల్ అనే కాదు. తెలియని మహిళను ఎవరు డార్లింగ్ అని పిలిచినా అది కచ్చితంగా నేరమే. అలా పిలిచిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నా లేకపోయినా అది నేరమే అవుతుంది. ఇలాంటి వాళ్లకి శిక్ష పడాల్సిందే. ఇలాంటి పదాలతో సంబోధించడం అంటే లైంగికంగా వేధించడమే"

- కోల్‌కత్తా హైకోర్టు 

ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో జస్టిస్ సేన్‌గుప్తా తీవ్ర అసహనానికి లోనయ్యారు. రోడ్డుపైన వెళ్తూ ఓ యువతినో, మహిళనో చొరవ తీసుకుని మరీ డార్లింగ్ అనే స్థాయికి భారత సంస్కృతి ఇంకా దిగజారిపోలేదని స్పష్టం చేశారు. ఇది ఇండియన్ కల్చర్ కాదని వెల్లడించారు. పైగా...మద్యం మత్తులో ఇలాంటివి చేస్తే అది ఇంకా పెద్ద నేరం అవుతుందని తేల్చి చెప్పారు. ప్రాథమిక వివరాల ప్రకారం...ఓ మహిళా కానిస్టేబుల్ కోల్‌కత్తాలో దుర్గా పూజ జరుగుతుండగా అక్కడ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి గలాటా చేస్తున్నాడని తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్లారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ సమయంలోనే నిందితుడు మహిళా కానిస్టేబుల్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. "డార్లింగ్ నాకు ఫైన్ వేస్తావా" అంటూ పిచ్చిగా మాట్లాడాడు. దీనిపై కోర్టు వరకూ వెళ్లారు మహిళా కానిస్టేబుల్. డార్లింగ్ అని పిలిచినట్టు తన వద్ద అన్ని ఆధారాలున్నాయని వాదించారు. అప్పటికే కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడు తన తప్పుని ఒప్పుకోవడం వల్ల శిక్షను నెల రోజులకు తగ్గించినట్టు వివరించింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget