Brazil Election 2022: బ్రెజిల్ అధ్యక్షుడిగా లులా డా సిల్వా- ఎన్నికల్లో బోల్సోనారో ఓటమి!
Brazil Election 2022: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లులా డా సిల్వా గెలుపొందారు.
Brazil Election 2022: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో తన ప్రత్యర్థి వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా (77) చేతిలో బోల్సోనారో ఓటమిపాలయ్యారు. దీంతో లులా బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా గెలుపొందారు.
స్వల్ప తేడాతో
స్వల్ప తేడాతోనే బోల్సోనారో పరాజయం పొందారు. ఇరువురి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బోల్సోనారోపై లులా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో లులాకు 50.9 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి.
తాజా ఎన్నికతో లులా డా సిల్వా బ్రెజిల్ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2003 నుంచి 2010 వరకు ఆయన ప్రెసిడెంట్‌గా చేశారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట తొలిసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డా సిల్వా అధికారం కోల్పోయి తర్వాత అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లారు. మళ్లీ బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిచారు. ఆయన 2023 జనవరి 1న బ్రెజిల్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మోదీ శుభాకాంక్షలు
బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డా సిల్వాకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Congratulations to @LulaOficial on winning the Presidential elections in Brazil. I look forward to working closely together to further deepen and widen our bilateral relations, as also our cooperation on global issues: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 31, 2022