అన్వేషించండి

Jeff Bezos: బెజోస్ రోదసీ యాత్ర సూపర్ హిట్.. ఇవే విశేషాలు!

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రోదసీ యాత్ర సూపర్ హిట్ అయింది. అనుకున్నట్లుగానే బెజోస్ తో పాటు మరో ముగ్గురు 'న్యూ షెపర్డ్' పై అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు.

అంతరిక్షయానంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రికార్డ్ సృష్టించారు. జెఫ్‌ బెజోస్‌తో పాటు మరో ముగ్గురితో కూడిన 'న్యూ షెపర్డ్‌' ప్రయోగం విజయవంతమైంది. నలుగురు ప్రయాణికులతో కూడిన న్యూ షెపర్డ్‌ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకుంది. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్‌ అధినేత స్వీయ సంస్థ 'బ్లూ ఆరిజిన్‌' ఈ యాత్రను చేపట్టింది.

జెఫ్‌ బెజోస్‌, ఆయన సోదరుడితో పాటు మరో ఇద్దరు అంతరిక్ష ప్రయాణం చేశారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర విజయవంతమైన కొద్దిరోజులకే అమెజాన్‌ అధినేత స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్‌ ప్రయోగం కూడా విజయవంతమవడం విశేషం.

ప్రయాణం సాగిందిలా..

  1. పశ్చిమ టెక్సాస్‌ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్‌ సైట్‌ వన్‌ నుంచి మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) న్యూ షెపర్డ్‌ ప్రయోగం ప్రారంభమైంది.
  2. 'న్యూ షెపర్డ్‌' అంతరిక్షంలోకి దూసుకెళ్లే సమయంలో గంటకు 3700 కిలోమీటర్లు వేగాన్ని రాకెట్‌ అందుకుంది. నౌక బయలుదేరిన రెండు నిమిషాలకు వ్యోమగాములు 3 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యారు. అనంతరం వ్యోమగాములు సీటు బెల్టులను తొలగించి భార రహితస్థితిని ఆస్వాదించారు.
  3. వ్యోమనౌక ప్రయాణం ప్రారంభమైన ఆరు నిమిషాలకు క్యాప్స్యూల్‌ నుంచి విడిపోయిన బూస్టర్‌ రాకెట్‌ తిరిగి భూ వాతావరణంలోకి పునః ప్రవేశించింది. ప్రయోగ వేదికకు 3.2కిలోమీటర్ల దూరంలోని ల్యాండింగ్‌ ప్యాడ్‌కు చేరుకుంది.
  4. క్యాప్స్యూల్‌ మాత్రం సముద్రమట్టానికి 100 కిలోమీటర్ల ఎగువన ఉన్న కార్‌మాన్‌ రేఖ వరకూ ప్రయాణించింది. ఆ సమయంలో వ్యోమగాములు కొద్దిసేపు భారరరహిత స్థితిని పొందారు. అనంతరం వ్యోమనౌక పారాచూట్ల సహాయంతో తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో గంటకు 16 కిలోమీటర్ల స్థాయికి వేగాన్ని తగ్గించుకుంటూ కిందకు దిగింది.
  5. దాదాపు 15నిమిషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో పాల్గొన్న నలుగురు వ్యోమగాములు విజయసంకేతం చూపుతూ క్యాప్స్యూల్‌ నుంచి బయటకు వచ్చారు.
  6. ఈ యాత్రలో అమెజాన్‌ అధినేత బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్‌ కూడా ఉన్నారు. వీరితో పాటు మహిళా పైలట్‌ వేలీ ఫంక్‌ (82),  ఆలివర్‌ డేమన్‌ (18) ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా వేలీ ఫంక్‌, అతిచిన్న వ్యోమగామిగా ఆలివర్‌ డేమన్‌ రికార్డు సృష్టించారు.
  7. ఈ యాత్ర కోసం తొలుత వేలంలో 2.8 కోట్ల డాలర్లు పెట్టి టికెట్‌ కొన్న ఓ వ్యక్తి మాత్రం అనివార్య కారణాలతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

ఏమిటీ బ్లూ ఆరిజిన్‌?

రోదసిలో తేలియాడే అంతరిక్ష కాలనీలను నిర్మించే లక్ష్యంతో 2000లో బ్లూ ఆరిజిన్‌ను బెజోస్‌ స్థాపించారు. అక్కడ కృత్రిమ గురుత్వాకర్షణ స్థితిని కల్పించి, లక్షల మంది పని చేసుకుంటూ, జీవించగలిగేందుకు అనువైన పరిస్థితులను సృష్టించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్లూ ఆరిజిన్‌ ప్రస్తుతం 'న్యూ గ్లెన్‌' అనే భారీ రాకెట్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. చంద్రుడిపై దిగే ల్యాండర్‌నూ తయారుచేసి, అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' చేపట్టే ఆర్టెమిస్‌ కార్యక్రమంలో భాగస్వామి కావాలని భావిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Womens Asia Cup 2026: వరుస ఓటములకు చెక్ పెట్టేందుకు హర్మన్‌ప్రీత్ సేన సిద్ధం.. థాయిలాండ్‌తో పోరుతో ఆసియా కప్‌లో ఇండియా జ‌ర్నీ షురూ..
వరుస ఓటములకు చెక్ పెట్టేందుకు హర్మన్‌ప్రీత్ సేన సిద్ధం.. థాయిలాండ్‌తో పోరుతో ఆసియా కప్‌లో ఇండియా జ‌ర్నీ షురూ..
Uttam Kumar Reddy: ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్ట్ పునరుజ్జీవనానికి తెలంగాణ కీలక అడుగు.. 152 మీటర్లకు ప్రతిపాదన
ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్ట్ పునరుజ్జీవనానికి తెలంగాణ కీలక అడుగు.. 152 మీటర్లకు ప్రతిపాదన
Vijayawada Crime News: విజయవాడ వాంబే కాలనీలో ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం, కేసు నమోదు
విజయవాడ వాంబే కాలనీలో ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం, కేసు నమోదు
MLC Rahmat Baig Suspension: ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు.. దమ్ముంటే కారణం చెప్పాలి: అసదుద్దీన్‌కు రాజా సింగ్ ఛాలెంజ్
ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌పై MIM వేటు.. అసదుద్దీన్‌కు దమ్ముంటే కారణం చెప్పాలని రాజా సింగ్ ఛాలెంజ్

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galwan Operation: జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ?
జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ?
Vijaya Sai Reddy Letter: ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ!
ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ!
Tamil Nadu Governor Kiran Kumar: మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారా? 
మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారా? 
Kittu Pavan: హీరోగా ఫోక్ సాంగ్స్ స్టార్ కిట్టు పవన్... చంద్రబోస్ క్లాప్‌తో సినిమా షురూ
హీరోగా ఫోక్ సాంగ్స్ స్టార్ కిట్టు పవన్... చంద్రబోస్ క్లాప్‌తో సినిమా షురూ
Adilabad Congress Group War: ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
Eesha Rebba: కొత్త ఇంటికి తల్లి పేరు... ఈషా రెబ్బా ఎమోషనల్ మూమెంట్... గృహ ప్రవేశం ఫోటోలు
కొత్త ఇంటికి తల్లి పేరు... ఈషా రెబ్బా ఎమోషనల్ మూమెంట్... గృహ ప్రవేశం ఫోటోలు
TGSRTC Night Bus Routes: హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
Revanth Reddy Letter To EC: SIR తో 92 లక్షల మంది ఓట్లకు ముప్పు, గడువు పొడిగించండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
SIR తో 92 లక్షల మంది ఓట్లకు ముప్పు, గడువు పొడిగించండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Embed widget