అన్వేషించండి

Boon for Blind People : అంధుల కోసం స్మార్ట్ గ్లాసెస్ - ఐఐటీ స్టూడెంట్స్ అద్భుత ఆవిష్కరణ, కళ్ల ముందు ఏం జరుగుతున్నా తెలిసిపోతుందట!

Boon for Blind People : ఇద్దరు ఐఐటీ విద్యార్థులు అంధుల కోసం ప్రత్యేకంగా ఓ కళ్లజోడును సిద్ధం చేశారు. దీని ద్వారా వారు అవతలి వారిని సులభంగా గుర్తించగలుతారు.

Boon for Blind People : శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో కళ్లు ఒకటి. అవే లేకపోతే ఈ ప్రపంచంలో ఏం జరిగినా చూడలేం. కనీసం ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏ పనైనా చేయాలన్నా కళ్లు లేకపోతే చాలా కష్టం. మనం వారి బాధను కేవలం చూసి.. అయ్యో పాపం అంటామే తప్ప ఏం చేయలేం. కానీ ఓ ఇద్దరు విద్యార్థులు మాత్రం అలా చూసి వదిలేయలేదు. వారి కోసం ఏదైనా చేయాలని తపించారు. మొత్తానికి వారనుకున్న లక్ష్యాన్ని సాధించి చూపించారు. అవతలి వారిని గుర్తించేలా అంధుల కోసం ప్రత్యేకంగా కళ్లజోడు తయారు చేసి చరిత్ర సృష్టించారు. వారికో మార్గం చూపించారు.

ఐవోటీ సెన్సార్లతో కళ్లజోడు తయారీ

మొరాదాబాద్‌లోని ఎంఐటీ కళాశాలలో చదువుతోన్న ఇద్దరు విద్యార్థులు ఇప్పుడు అంధుల ఎదుటి వారి ముఖాలను సులభంగా గుర్తించేందుకు ఓ సెన్సార్ గ్లాసెస్‌ను తయారు చేశారు. IoT సెన్సార్లను ఉపయోగించి రూపొంచిన ఈ కళ్లజోడు.. పర్యావరణంలో జరిగే సన్నివేశాలు, సమాచారాన్ని ఆడియో రూపంలో అందిస్తుంది. ఐఐటీ (IIT) ముంబైలో నిర్వహించిన మూడు రోజుల ఆసియాలో అతిపెద్ద టెక్‌ఫెస్ట్ 24లో ఎంఐటీ (MIT) కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్థాపించిన స్టార్టప్ కేడర్ టెక్నాలజీస్ సర్వీసెస్ నుంచి ఇంటర్న్‌షిప్ చేస్తున్న కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఇద్దరు విద్యార్థులు 'ధైర్య సారస్వత్', శాశ్వత్ సింఘాల్ ఉన్నారు.

అంధులకు ఉపయోగకారిగా స్మార్ట్ గ్లాసెస్

క్యాడర్ టెక్ ప్రధానంగా సహాయక సాంకేతికతపై పరిశోధనలు చేస్తోంది. ఇక స్టూడెంట్స్ తయారు చేసిన ఈ కళ్లజోడు.. అంధులు తమ పరిసరాలకు సంబంధించిన సమాచారాన్ని ఫేషియల్ రికగ్నిషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ లాంటి వాటి ద్వారా ఆడియో రూపంలో అందిస్తుంది. ఐఐటీ ముంబైలో వారి ఆవిష్కరణను ప్రదర్శించడానికి, ఈ ఇద్దరు విద్యార్థులను  ప్రదర్శించడానికి కంపెనీ భారతదేశ కార్యాలయం నియమించింది.

విద్యార్థుల ప్రాజెక్టుపై ప్రముఖుల ప్రశంసలు

స్టూడెంట్స్ తయారు చేసిన కళ్లజోడుపై స్పందించిన ఎంఐటీ కళాశాల డైరెక్టర్ రోహిత్ గార్గ్.. తమ కళాశాలకు చెందిన ఇద్దరు పిల్లలు అంధుల కోసం చాలా మంచి ప్రాజెక్టును రూపొందించారన్నారు. ఇందుకు తమ కళాశాల ఉపాధ్యాయులను, ఈ ఇద్దరు విద్యార్థులను అభినందిస్తున్నానని చెప్పారు. దీంతో పాటు, ఈ ప్రాజెక్ట్ అంధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తాను నమ్ముతున్నానన్నారు. ఇదే విషయంపై ఎంఐటీ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తమ విభాగంలోని ఇద్దరు స్టూడెంట్స్ కొత్త పరిశోధన చేశారన్నారు. దీని ద్వారా అంధులు చాలా సహాయాన్ని పొందవచ్చని, దీంతో తమ దృక్పథాన్ని మార్చుకుని ఎక్కడికైనా వెళ్లగలరన్నారు.

Also Read : Elon Musk: యునైటెడ్ స్టేట్స్‌కు పొంచి ఉన్న ప్రమాదం - ఆయన నుంచి అమెరికాను రక్షించండి - మస్క్ ఆరోగ్యంపై రచయిత ఆందోళనలు

 

టాప్ హెడ్ లైన్స్

US Iran Conflict: హర్మూజ్ మూసివేతపై అమెరికా ఆగ్రహం.. ఇరాన్‌పై భీకర దాడులు- మిస్సైల్స్‌తో బదులిస్తున్న టెహ్రాన్
హర్మూజ్ మూసివేతపై అమెరికా ఆగ్రహం.. ఇరాన్‌పై భీకర దాడులు- మిస్సైల్స్‌తో బదులిస్తున్న టెహ్రాన్
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Embed widget