Bengaluru : బ్రాహ్మిన్ జీన్స్ వల్లే కండలు - ఓ స్టార్టప్ సీఈవో పోస్ట్ - స్పందన ఎంత వయోలెంట్ గా ఉందంటే ?
Brahmin Genes : బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో తన కండల ప్రదర్శన చేశారు. ఆ ఫోటో తీసి దానికి క్యాప్షన్ బ్రాహ్మిణ్ జీన్స్ అని పెట్టడంతో సోషల్ మీడియాలో మంటలు ప్రారంభమయ్యాయి.
Bengaluru CEO Sparks Controversy Over ‘Brahmin Genes’ Post : సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు అయిన పెట్టవచ్చు. ఒక్క మాటతో మంటలు కూడా రేపవచ్చు. ఈ విషయాన్ని అనురాధ తివారి అనే యువతి మరోసారి నిరూపించారు. బెంగళూరులో నివసించే ఆమె ఉదయమే జాగింగ్‌కో.. వాకింగ్‌కో వెళ్లారు. వచ్చేటప్పుడు ఓ కొబ్బరి బొండాం తాగాలనుకున్నారు. తాగుతూ ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోలో తన చేతి కండరాలు గట్టిగా ఉన్నట్లుగా .. తనకు తాను గొప్పగా అనుకోవడంతో ట్విట్టర్ లో పోస్టు చే్శారు. అంత వరకూ బాగానే ఉంది.. కానీ ఆమె దానికి క్యాప్షన్ గా .. బ్రాహ్మిన్ జీన్స్ అని పెట్టారు. ఇది చాలు కదా సోషల్ మీడియాలో మంటలు రేపడానికి.
Brahmin genes 💪 pic.twitter.com/MCcRnviJcY
— Anuradha Tiwari (@talk2anuradha) August 22, 2024
అనూరాధ తివారి బెంగళూరులో ఓ కంటెంట్ రైటింగ్ స్టార్టప్ కు సీఈవోగా ఉన్నారు. టెడ్ ఎక్స్ స్పీకర్ కూడా. అనూరాధ తివారి ఇలా పోస్టు పెట్టిన వెంటనే వైరల్ అయిపోయింది. పెద్ద ఎత్తున ఆమెది కుల అహంకారమన్న విమర్శలు చేస్తున్నారు.
Here, a so-called oppressed individual might label you as a "manuwadi" and accuse you of being casteist simply for identifying as Brahmin, claiming you're an oppressor due to your background.
— Shashank Dubey (@Shashank_Dubey0) August 22, 2024
They are envious of those who identify as Brahmins, yet they avoid discussing the real caste privileges they receive, such as reservations and other benefits, simply because they belong to a certain caste.#Reservation
— Shashank Dubey (@Shashank_Dubey0) August 22, 2024
అయితే అనూరాధ తివారి మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తన అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకాడరు. తాను అగ్రకులం అన్న కారణంగా అత్యధిక మార్కులు తెచ్చుకున్న తనకు సీటు రాలేదని..కానీ అరవై శాతం మార్కులు తెచ్చుకున్న వారికి సీట్లు వచ్చాయని ఆమె వాదించేవారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో రిజర్వేషన్లకు వ్యతే రికంగా మాట్లాడుతూనే ఉంటారు. తన పోస్టు వైరల్ గా మారిందని తనపై గట్టి విమర్శలు వస్తున్నాయని తెలిసినా ఆమె వెనక్కి తగ్గలేదు.
I am general category student. My ancestors have passed me down 0.00 acres land. I live in a rented house. I couldn’t get admission despite scoring 95% but my classmate who scored 60% & comes from well off family gets admission. And you ask me why I have problem with reservation?
— Anuradha Tiwari (@talk2anuradha) August 18, 2022