అన్వేషించండి

HCA Elections : అజారుద్దీన్‌పై అనర్హత - హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీకి చాన్స్ లేనట్లే !

హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అజారుద్దీన్ పై అనర్హతా వేటు పడింది. ఇప్పటికే ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది.


HCA Elections :  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను అజారుద్దీన్ కోల్పోయారు. ఆయన పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే  డెక్కర్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా అజారుద్దన్ కొనసాగారు. అందుకే కమిటీ చర్య తీసుకుంది. ఇప్పటికే   హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 20  2023న HCA ఎన్నికలు జరగనున్నాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్ కు ఈ ఎన్నికలు నిర్వహించ‌నున్నారు.                             

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో 173 మందితో కూడిన ఓట‌ర్ల జాబితాను ఇప్పటికే విడుద‌ల చేశారు. ఈ జాబితా నుంచి ఆజారుద్దీన్ పేరును తొలగించారు. అక్టోబ‌ర్ 4 నుంచి 7 వ‌ర‌కు ఎన్నిక‌ల అధికారి వి.సంప‌త్ కుమార్ నామినేష‌న్లను స్వీక‌రిస్తారు.  అక్టోబరు 14న నామినేష‌న్ల స్క్రూటినీ ఉంటుంది. అక్టోబ‌ర్ 16 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గడువు ఇచ్చారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫ‌లితాల‌ను వెల్లడిస్తారు.                        
  
 HCA  ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ పదవీకాలం పూర్తి అయిన త‌రువాత సుప్రీం కోర్టు HCA కార్యక్రమాల నిర్వహణకు మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇప్పటి వరకు HCA బాధ్యతలు చూశారు. అయితే HCAలో 57 క్లబ్‌లపై మూడేళ్ల పాటు జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ నిషేధం విధించింది.  ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌, జాన్‌మనోజ్‌, చార్మినార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, బడ్డింగ్‌ స్టార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లు కోర్టును ఆశ్రయించారు.  దీంతో హెచ్‌సీఏ ఎన్నిక‌లు వాయిదా పడ్డాయి.                         

అయితే  ఈ విష‌యంలో ఆయా కోర్టులు ఇచ్చే ఆదేశాలు చెల్లవని ఇటీవ‌ల సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవ‌ద్దని తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టుల‌ను  సుప్రీం కోర్టు ఆదేశించింది.HCA  ఎన్నికల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే HCA  ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైంది.                                 

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ అంటేనే వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస్‌. అధ్యక్ష పదవీ కాలం ముగిసినప్పటికీ హెచ్‌సీఏను మాత్రం అజారుద్దీన్ వదల్లేదు. దీంతో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీని నేతృత్వంలో హెచ్‌సీఏ కార్యక్రమాలు, ఇతర అంశాలు పర్యవేక్షిస్తూ వచ్చారు. అయినా వివాదాలు ఏమాత్రం సద్దుమణగలేదు. గతంలో జస్టిస్ దీపక్‌వర్మను అంబుడ్స్‌మన్‌గా నియమించడంపై హెస్‌సీఏ పరిధిలోని కొన్ని క్రికెట్  క్లబ్‌లు హైకోర్టును ఆశ్రయించాయి. దాన్ని  హైకోర్టు కొట్టివేయడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో మరికొంతమంది ఈ కేసుల్లో ఇంప్లీడ్ అయ్యారు. వాటన్నింటిని సుప్రీంకోర్టు విచారించింది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Auto Drivers Strike: తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సమ్మె విరమణ
తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సమ్మె విరమణ
ABP Desam Top 10, 23 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 23 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget