అన్వేషించండి

ఐఫోన్ యూజర్స్‌కి యాపిల్ కంపెనీ అలెర్ట్, పెగాసస్ తరహా మాల్‌వేర్‌ దాడి జరగొచ్చని వార్నింగ్

Apple Warns Users: మాల్‌వేర్ అటాక్ జరిగే ప్రమాదముందని ఐఫోన్‌ యూజర్స్‌ని యాపిల్ కంపెనీ హెచ్చరించింది.

Apple Warns iPhone Users: ఐఫోన్ యూజర్స్‌కి యాపిల్ అలెర్ట్ ఇచ్చింది. iPhoneలు పెగాసస్ తరహా స్పైవేర్‌ దాడికి గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. భారత్‌తో పాటు మొత్తం 91 దేశాల వినియోగదారులకు ఈ అలెర్ట్ పంపింది. mercenary spyware దాడి చేసే అవకాశముందని వెల్లడించింది. ఏప్రిల్ 11వ తేదీన అర్ధరాత్రి 12.30 నిముషాలకు నోటిఫికేషన్ ఈమెయిల్స్ పంపింది. భారత్‌లోని యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. అయితే...ఎంత మంది యూజర్స్‌కి యాపిల్ కంపెనీ నుంచి ఈ నోటిఫికేషన్స్‌ వచ్చాయన్నది మాత్రం తెలియలేదు. ఈ మెయిల్‌లో NSO గ్రూప్‌కి చెందిన Pegasus spyware గురించీ ప్రస్తావించింది. ఇలాంటి టూల్స్‌ని వినియోగించి వ్యక్తిగత డేటాని చోరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తేల్చి చెప్పింది. రిమోట్‌గా యాపిల్ ఫోన్‌లను టార్గెట్‌ చేసి వాటిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. 

"ఓ స్పైవేర్ దాడి చేసే ప్రమాదముందని యాపిల్ గుర్తించింది. రిమోట్‌ నెట్‌వర్క్‌తో కొంత మంది టార్గెట్ చేసి మరీ ఈ దాడి చేసే ప్రమాదముంది. మీరెవరో తెలుసుకునేందుకు, మీ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేందుకు ఈ దాడి జరుగుతుండొచ్చు. దయచేసి వినియోగదారులంతా ఈ వార్నింగ్‌కి సీరియస్‌గా తీసుకోండి. మీకు వచ్చే లింక్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి. అలాంటి లింక్స్‌ని ఓపెన్ చేయకండి. ఈ థ్రెట్‌ నోటిఫికేషన్స్‌ని గమనించండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు"

- యాపిల్‌ 

ఇలాంటి స్పైవేర్‌లు చాలా అరుదుగా ఉంటాయని, కానీ వాటి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది యాపిల్ కంపెనీ. ఈ దాడులు మొదలైతే లక్షలాది డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదముందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని వినియోగదారులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది సంస్థ. 2021 నుంచి ఇదే తరహా నోటిఫికేషన్‌లు పంపడం మొదలు పెట్టింది యాపిల్. గతేడాది దాదాపు 20 మంది ఇండియన్ యూజర్స్‌కి ఈ తరహా వార్నింగ్స్ వచ్చాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఉత్తరాంధ్రను అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు: చంద్రబాబు
ఉత్తరాంధ్రను అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు: చంద్రబాబు
Nara Lokesh Speech At Bhogapuram Airport: ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!

వీడియోలు

Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget