అన్వేషించండి

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
AP Telangana Breaking News Telugu Live Updates 3 December CM KCR CM Jagan kavitha News Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  
ప్రతీకాత్మక చిత్రం

Background

ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ విచారణకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను పిలవడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతోంది. ఎప్పటి నుంచో ఈ కేసులో ఆమె ఉన్నట్టు ప్రచారం జరిగినా... దాన్ని టీఆర్‌ఎస్‌ ఖండిస్తూ వచ్చింది. కానీ మొన్నటికి మొన్న ఈడీ కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో కవిత పేరు ఉండటం ఇప్పుడు సీబీఐ విచారణకు పిలవడం చకచకా జరిగిపోయింది. తర్వాత ఏం జరగబోతోందన్న చర్చ తెలంగాణలో నడుస్తోంది. 

తాను ఎలాంటి తప్పు చేయలేదని... ఇలాంటి రాజకీయ కేసులు చాలా చూశామని కాబట్టి విచారణ ధైర్యంగా ఎదుర్కొంటానని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నెల ఆరు ఆమెను సీబీఐ విచారించనుంది. రాజకీయంగా జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి... దీనికి ప్రతి వ్యూహం ఏంటన్న విషయంపై కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారని టాక్. అందులో భాగంగా ఇవాళ కేసీఆర్‌ను కవిత కలవనున్నారు. కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లబోతున్నారు. 

కవిత తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నాయి. ఏ పార్టీకి చెందిన కార్యకర్తలైనా ఆమె నివాసంవైపునకు రావచ్చన్న అనుమానంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత వివరణ తీసుకునేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో తెలిపింది. దిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరుకావొచ్చని సీబీఐ చెప్పింది. ఈ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.   

"దిల్లీ లిక్కర్ స్కామ్ లో వివరణ కోరుతూ Cr.P.C సెక్షన్ 160 ప్రకారం CBI నోటీసులు జారీచేసింది. వారి అభ్యర్థన మేరకు డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశాను" - ఎమ్మెల్సీ కవిత 

ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు దిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని  అరోరా అంగీకరించారని తెలిపారు. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా..  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ చెబుతోంది. ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు వాడారాని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది.  అమిత్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు.  ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గురుగాంకు చెందిన అమిత్ అరోరా ,దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పనిచేసినట్లు ఈడీ చెబుతోంది. వీరిలో దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్‌గా మారారు.  అమిత్ అరోరా బడ్జీ అనే  ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు.  సీబీఐ, ఈడీ FIRలో అమిత్ అరోరా 9వ నిందితునిగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.   

ముందు నుంచే ఆరోపణలు 

ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడే తెలంగాణకు చెందిన కల్వకుంట్ల పేరును బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే తనపై ఆరోపణలు చేయడాన్ని కవిత ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపిస్తున్నారని.. తనపై విమర్శలు చేయకుండా కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు. ఇటీవల సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి చార్జిషీటును దాఖలు చేసింది. అలాగే.. ఈడీ కూడా సమీర్ మహేంద్రుపై చార్జిషీటు దాఖలు చేసింది. కానీ సెల్ ఫోన్ల ధ్వంసం గురించి ప్రస్తావించారు కానీ.. కవిత పేరు మాత్రం తెరపైకి తీసుకురాలేదు. ఇటీవల ఈడీ ఈ కేసు విషయంలో కవిత పేరును ప్రస్తావించింది.  

19:23 PM (IST)  •  03 Dec 2022

దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

దిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసు ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరారు. ఈ మేరకు కవిత సీబీఐ అధికారి అలోక్ కుమార్ కు లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా కాపీ అందించాలని కోరారు. దిల్లీ మద్యం షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని కేంద్ర హోంశాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది.

12:09 PM (IST)  •  03 Dec 2022

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం- బాలికపై బాబాయ్ హత్యాచారం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై సొంత బాాబాయే అత్యాచారం చేశాడు. తన ఫ్రెండ్‌తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తర్వాత విషయాన్ని ఎవరికైనా చెబుతుందోమే అని బయపడి ఆమెను చంపేశాడు. ఉరి వేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Embed widget