అన్వేషించండి

Chittoor జిల్లాలో నా కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు సాధించగలవా ? చంద్రబాబుకి మంత్రి పెద్దిరెడ్డి సవాల్

చంద్రబాబు వార్డు మెంబర్ లా దిగజారి మాట్లాడుతున్నారని, నన్ను చంద్రబాబు పుడింగి అంటున్నాడని, అసలు పుడింగికి అర్థం ఏంటో తెలుసా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

AP Minister Peddireddy Ramachandra Reddy: చిత్తూరు : టిడిపి‌ అధినేత‌ నారా చంద్రబాబు నాయుడుపై ఏపి అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసారు. సోమలలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసినా మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు వార్డు మెంబర్ లా దిగజారి మాట్లాడుతున్నారని, నన్ను చంద్రబాబు పుడింగి అంటున్నాడని, అసలు పుడింగికి అర్థం ఏంటో తెలుసా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. కుప్పంలో ఘోరంగా ఒడిపోయినా చంద్రబాబు పుంగనూరుకు వచ్చి నన్ను ఏం చేయగలవు అని ఆయన అన్నారు. 
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి మూడు చెరువుల నీళ్లు తాగించాంమని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. పుంగనూరులో నా కథ తేలుస్తాను అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, చంద్రబాబు కాదు, వాళ్ళ తాతలు దిగొచ్చినా వాళ్ళ తరం కూడా కాదన్నారు. చంద్రబాబు అనుకుని‌ ఉంటే‌ నేను జిల్లాలో తిరేగేవాన్ని కాదని చెప్పడం వింటే నవ్వు వస్తొందని చెప్పిన ఆయన, నీ‌ కంటే 14 సంవత్సరాలు ఆయన కంటే ఆధిక్యంలోనే నేను కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇచ్చినట్లు‌ చెప్పారు.‌ 14 సంవత్సరాలు నువ్వు చేసేదేంటి మీ కంటే నేనే ఎక్కువ చేశానన్నారు. 

జిల్లాలో తన కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించగలవా అంటూ‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకి‌ సవాల్ విసిరారు. కాలేజ్ రోజుల నుండి చంద్రబాబుకి జీవిత కాలం పట్టింది నాపై ఆధిక్యత సాధించడానికి అని విమర్శించిన పెద్దిరెడ్డి, ఇందిరమ్మ పేరుతో చంద్రబాబు శాసనసభ్యుడు అయ్యాడన్నారు. దివంగత ఎన్టీ రామారావు కుమార్తెను పెళ్లి చేసుకొని కుప్పంలో ఉన్న అభ్యర్థిని రాజీనామా చేయించి కుప్పంలో గెలిచావన్నారు. రామారావు అల్లుడు కాకపోయింటే నువ్వు శాసన సభ్యడు అయ్యుంటావా అని ప్రశ్నించారు. నీకు రామారావు పేరు అండగా ఉంది కాబట్టి రాజకీయాల్లో రాగలిగావన్నారు. చంద్రబాబుకి నాతో పోల్చుకునేందుకు అర్హత లేదన్నారు. నేను 1993 నుంచి పాల వ్యాపారంలో ఉన్నానని, నీ మాదిరిగా పార్ట్నర్స్ కు మోసం చేసి వేల కోట్లు సంపాదించ లేదన్నారు. 

తాను దౌర్జన్యం చేసి పాలు తీసుకుంటుంటే ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేయగలనా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నీకు సిగ్గు లేదా అబద్దాలు చెప్పడానికి అని‌ ప్రశ్నించారు. జిల్లాలో అందరికి చంద్రబాబు  బతుకు ఏంటో తెలుసునని, నా బట్టలు ఉడదీస్తా అని మాట్లాడుతున్నాడు, సిగ్గు లేదా నీకు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నీ బట్టలు ఎప్పుడో ఊడి పోయాయని తెలుసుకోవాలన్నారు. కుప్పంలో చంద్రబాబు బతుకు తెల్లవారి పోయిందని, 2024లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫైనల్ గా కుప్పంలో నీ బట్టలు ఊడిపోతాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు...

‘రాజధాని అమరావతిలో నా ఇంటి మీద దాడి చేశారు నా ఇంటి గేట్లకు తాడు కట్టారు. ఇప్పుడు నా సొంత నియోజకవర్గ కుప్పంలో పోలీసుల ద్వారా దాడులు చేయించారు. రాష్ట్రంలో సైకో పాలన జరుగుతోంది. కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేసి నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం చేస్తా ‘.. పెద్దిరెడ్డికి చంద్రబాబు సవాల్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heart Risk in Children : పిల్లల్లో పెరుగుతోన్న గుండె సమస్యలు.. స్క్రీన్ సమయమే కారణం అంటోన్న తాజా అధ్యయనం
పిల్లల్లో పెరుగుతోన్న గుండె సమస్యలు.. స్క్రీన్ సమయమే కారణం అంటోన్న తాజా అధ్యయనం
Driving License Rules: తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇక 3 దశల విధానం- LLR ముందు ఎగ్జామ్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇక 3 దశల విధానం- LLR ముందు ఎగ్జామ్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Supreme Court: క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget