అన్వేషించండి

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

Key Events
Andhra Pradesh Telangana Telugu Breaking News Live Updates 30 September 2023 Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు
Breaking News Live Telugu Updates

Background

మోతమోగిద్దాం పేరుతో టీడీపీ ఓ కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదని..  అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనని టీడీపీ తెలిపింది. చంద్రబాబుకి మద్దతుగా... ఇవాళ(సెప్టెంబర్ 30) రాత్రి 7 గంటల నుంచి  7.05 వరకు 5 నిమిషాలపాటు ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని టీడీపీ సూచించింది. 

అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోతమోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు.                       

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ప్రచారం చేస్తున్నరు. స్కిల్ కేసులో ఉన్న నిజాలు అంటూ అన్ని డాక్యుమెంట్లతో వెబ్ సైట్ కూడా ప్రారంభించారు. న్యాయస్థానాల్లో సీఐడీ తరపు లాయర్ల వాదనల సారాంశాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కడా అవినీతి జరగకపోయినా నిధుల దుర్వినియోగం అని..  డబ్బు మళ్లింపు అని రకరకాల మాటలు మార్చుతూ.. రాజకీయ కుట్రతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.              

ఇప్పుడు వైసీపీ ఆరోపణలపై నేరుగా ఎదురుదాడికి దిగుతున్నారు. సోషల్ మీడియో వేదికగా మోతమోగిద్దామని పిలుపనివ్వడంతో పార్టీ శ్రేణులన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో వెదర్‌ ఎలా ఉందంటే?

ఈ రోజు అల్పపీడనం ఈశాన్య, పరిసర ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమీ ఎత్తు వరకు వ్యాపించింది. ఈరోజు తూర్పు- పశ్చిమ షియర్ జోన్ (గాలి విచ్ఛిన్నతి) సుమారుగా 15°N అక్షాంశం వెంబడి  సగటు సముద్ర మట్టం నుండి 3.1 & 4.5 కి మి మధ్యన స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast): 
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు  వర్షాలు చాలా చోట్ల  రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు రాష్ట్రంలో హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని  జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో వాతావరణం

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 90 శాతంగా నమోదైంది.

తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా  రెండు  చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా  రెండు  చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ 
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక   చోట్ల  కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా  రెండు  చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా  రెండు  చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని  చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా  రెండు  చోట్ల సంభవించే అవకాశముంది.

‘‘రాత్రి నుంచి కడప జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు నేరుగా నెల్లూరు జిల్లాలోని వివిధ భాగాల్లో విస్తరించనున్నాయి. నెల్లూరు నగరంతో పాటుగా నెల్లూరు జిల్లా కోస్తా భాగాలు, ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు 100 శాతం కనిపిస్తున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

 

19:01 PM (IST)  •  30 Sep 2023

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ టీడీపీ అధినేతకు మద్దతుగా పార్టీ శ్రేణులు మోత మోగించడం కార్యక్రమం చేపట్టాయి. మోత మోగిద్దాం కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. జనసేన శ్రేణులు సైతం శబ్దాలు చేస్తూ చంద్రబాబుకు మద్దతు తెలిపారు.

14:47 PM (IST)  •  30 Sep 2023

ఏపీలో 12 రోజులు దసరా సెలవులు

➡అక్టోబరు 13 నుంచి ఏపీలో దసరా సెలవులు ఖరారు చేసిన ప్రభుత్వం..

➡అక్టోబరు 5 నుంచి 11వ తేదీ వరకు ఎస్ఏ-1 పరీక్షలు..

➡8వ తరగతి విద్యార్థులకు మినహా.. మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలు..

➡అక్టోబరు 25 వరకు సెలవులు కొనసాగగా.. 26వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం..

➡ ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ అధికారులు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget