AAP, Goa CM Face: గోవా ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఆప్ పోటీ.. సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్
గోవా ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్‌ను ఎంపిక చేసినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
గోవా రాష్ట్రానికి ఆమ్‌ఆద్మీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అమిత్ పాలేకర్‌ను సీఎం అభ్యర్థిని ఎంపిక చేసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశాారు.
Amit Palekar will be AAP's chief ministerial candidate for the Goa Assembly polls: Delhi CM & Aam Aadmi Party's national convenor Arvind Kejriwal
— ANI (@ANI) January 19, 2022
The party will be contesting all the 40 Assembly seats in Goa.#GoaAssemblypolls2022 pic.twitter.com/mdzSTAfbbf
అమిత్ పాలేకర్ వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పాలేకర్ భండారీ వర్గానికి చెందినవారు.
గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గృహ ఆధార్ ఆదాయాన్ని నెలకు 1,500 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచుతామన్నారు.
గోవాలో ఇటీవల ఇంటింటి ప్రచారం నిర్వహించారు కేజ్రీవాల్. గోవాలో ఆమ్‌ఆద్మీ పార్టీని గెలిపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు.
సింగిల్‌గా కాంగ్రెస్..
మరోవైపు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. సీట్ల పంపకాలపై ఎన్‌సీపీతో చర్చలు చేస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అయితే మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్.. గోవా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనుంది.
Also Read: Goa Election 2022: గోవా ఎన్నికలపై కేజ్రీవాల్ గురి.. ప్రతి మహిళకు నెలకు రూ.1000
Also Read: Goa Elections 2022: గోవా ఎన్నికల బరిలో శివసేన, ఎన్‌సీపీ ఉమ్మడి పోరు.. సింగిల్‌గా కాంగ్రెస్ పోటీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి