అన్వేషించండి

కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై స్పందించిన ఉప రాష్ట్రపతి, భారత్‌కి పాఠాలు చెప్పొద్దంటూ ఫైర్

Arvind Kejriwal Arrest: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ స్పందించారు.

Kejriwal Arrest: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమని..చట్టం గురించి వేరే దేశాలు ఉపదేశాలు చెబుతుంటే విని నేర్చుకునే స్థితిలో లేదని ఘాటుగా స్పందించారు. ఇప్పటికే అమెరికా, జర్మనీ, ఐక్యరాజ్య సమితి కేజ్రీవాల్ అరెస్ట్‌ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ధన్‌కర్ కూడా ఆ కామెంట్స్‌పై మండి పడ్డారు. 

"భారత్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పటిష్ఠమైన న్యాయ వ్యవస్థ ఉంది. ఇది ఎవరో ఓ వ్యక్తి కోసమో లేదంటే ఓ సంస్థ కోసమో మారిపోదు. చట్టాల గురించి భారత్ మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పని లేదు. చట్టం ముందు అందరూ సమానమే. ఆ సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉంది. కొంత మంది చట్టాలకు అతీతంగా ఉండాలని అనుకున్నా అది కుదరదు"

- జగ్‌దీప్ ధన్‌కర్, ఉపరాష్ట్రపతి 

కేజ్రీవాల్ అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ I.N.D.I.A కూటమి నేతలు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం వద్ద భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. దీనిపైనా జగ్‌దీప్ ధన్‌కర్ విమర్శలు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఆ నేతలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పడమేంటని ప్రశ్నించారు.

"చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే కొంత మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తామని చెబుతున్నారు. ఇంకొందరు వాదోపవాదాలు చేస్తున్నారు. మానవ హక్కుల్ని ఇలా ఉపయోగించుకుంటారా..? భారత న్యాయవ్యవస్థ చాలా పటిష్ఠమైంది. అది స్వతంత్రంగా పని చేస్తుంది. ఓ చట్టం చెప్పినట్టు అధికారులు చర్యలు తీసుకుంటే ఇలా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడంలో అర్థం ఏముంది.."

- జగ్‌దీప్ ధన్‌కర్, ఉప రాష్ట్రపతి 

Indian Institute of Public Administration 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ధన్‌కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు విక్టిమ్ కార్డ్‌ పట్టుకుని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. అవినీతి ఎప్పటికైనా ఇలా జైలు పాలు చేస్తుందని తేల్చి చెప్పారు. అలాంటి వాళ్లను చట్టం ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. 

టాప్ హెడ్ లైన్స్

రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
Bumrah, Pant Reentry Twist: కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
AIADMK MLAs Case: ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!
ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం రాజకీయ ప్రక్రియే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget