News
News
X

Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!

మార్కెట్లో అస్థిరమైన పరిస్థితుల కారణంగా అదానీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను రద్దు చేసింది. రూ.20 వేల కోట్లను వెనక్కి చెల్లించనుంది.

FOLLOW US: 
Share:

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను రద్దు చేసింది. ప్రస్తుత మార్కెట్ అస్థిరమైన పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం రూ.20 వేల కోట్లను పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి అదానీ ఎంటర్ ప్రైజెస్ సిద్ధంగా ఉంది.

ఈ మేరకు అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ అదానీ  ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ఎఫ్.పి.ఓ పై నమ్మకం ఉంచిన ఇన్వెస్టర్లకు, బోర్డ్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) సబ్ స్క్రిప్షన్ గడువు మంగళవారంతో ముగిసింది. కానీ గత వారం రోజుల నుంచి స్టాక్ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులకు తమ ఇన్వెస్ట్ మెంట్ మొత్తాన్ని తిరిగి ఇచ్చివేయాలనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ముందుకు వెళ్లడం సరికాడని భావించి బోర్డు ఇన్వెస్టర్ల పెట్టుబడిని తిరిగి చెల్లించడానికి మొగ్గు చూపిందన్నారు.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏం చెప్పింది?
ఎఫ్‌పీవోని రద్దు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. దీంతో పాటు పెట్టుబడిదారులకు వారి పెట్టుబడి పెట్టిన నగదును తిరిగి ఇవ్వనున్నారు. రూ.20 వేల కోట్ల విలువైన ఎఫ్‌పీవోలను ఉపసంహరించుకుంటున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన పత్రికా ప్రకటనలో తెలిపింది. త్వరలో పెట్టుబడిదారులకు వారి డబ్బు తిరిగి వస్తుంది.

బోర్డ్ ఆఫ్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AIL) పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను వెనక్కి తీసుకుంది.  అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ టాక్స్ హావెన్స్‌ను ఉపయోగిస్తోందని ఆరోపించడంతో వివాదాలు చెలరేగాయి. దీంతో కంపెనీ తన FPOని రద్దు చేసినట్లు తెలిపింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈరోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా రూ.20,000 కోట్ల వరకు FPOతో ముందుకు వెళ్లకూడదని నిర్ణయించింది.

నిజానికి స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంటు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఇప్పుడు రద్దు చేసిన ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ సూపర్‌ హిట్టైంది. ఇష్యూ మూడో రోజు పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయింది. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి విపరీతంగా మద్దతు లభించింది.

మంగళవారం సాయంత్రం 3:45 గంటలకే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవోకు 5,01,12,652 షేర్లకు బిడ్లు వచ్చాయి. కంపెనీ ఇష్యూ చేస్తున్న 4,55,06,791 షేర్ల కన్నా 11 శాతం అధికంగా బిడ్లు రావడం గమనార్హం. అయితే రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎఫ్‌పీవోపై ఎక్కువ ఆసక్తి కనబరచలేదు.  వారికి కేటాయించిన షేర్లకు కేవలం 11 శాతమే బిడ్లు వచ్చాయి. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 3.26 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయర్స్‌ విభాగం 126 శాతం సబ్‌స్క్రైబ్‌ అయింది.

అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల డబ్బు ఆవిరవుతున్నప్పటికీ అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కంపెనీ (ఐహెచ్‌సీ) ఇందులో పెట్టుబడులు పెడతామంటూ ముందుకు వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Published at : 01 Feb 2023 11:17 PM (IST) Tags: Adani Adani Enterprises Adani FPO Adani Group of Companies

సంబంధిత కథనాలు

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో వాటర్ మీటర్లు ఉండాల్సిందే, కేంద్రం తాజా నోటిఫికేషన్

Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో వాటర్ మీటర్లు ఉండాల్సిందే, కేంద్రం తాజా నోటిఫికేషన్

OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్‌!

OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్‌!

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి