అన్వేషించండి

ఢిల్లీలో రిపబ్లిక్‌ డే వేడుకలకు పటిష్ఠ భద్రత - రంగంలోకి వేలాది మంది భద్రతా సిబ్బంది

Republic Day Celebrations: దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్‌ డే వేడుకలను పటిష్ట భద్రత నడుమ నిర్వహించనున్నారు.

Republic Day Celebrations in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్‌ డే వేడుకలను పటిష్ట భద్రత నడుమ నిర్వహించనున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న కవాతు వీక్షించేందుకు సుమారు 77 వేల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు చేస్తున్నారు. దేశ రాజధానిలోని కర్తవ్య పథ్ తోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 14 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఢిల్లీ స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ దీపేంద్ర పాఠక్‌ భద్రతకు సంబంధించిన విషయాలను గురువారం వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. కేంద్ర భద్రతా సంస్థలతో కలిసి పని చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కర్తవ్య మార్గ్‌లోని ప్రధాన ప్రాంతంలో 14 వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

పోలీసు పహారాలో ఢిల్లీ

గణతంత్ర దిన వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు పహారాలో ఉండనుంది. కమాండోలు, క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌లు, పీసీఆర్‌ వ్యాన్‌లు, మోర్పాలు, యాంటీ డెమోలిషన్‌ డిటెక్షన్‌ టీమ్స్‌, స్పాట్‌ టీమ్‌లు విధి నిర్వహణతోపాటు ఢిల్లీలోని సున్నితమైన ప్రదేశాల్లో మోహరించనున్నారు. ఢిల్లీలోన సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసి వేయనున్నారు. భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించనున్నట్టు దీపేంద్ర పాఠక్‌ వెల్లడించారు. 

28 జోన్లుగా విభజన

గణతంత్ర దినోత్సవ వేడుకలు నేపథ్యంలో భద్రతా పరమైన ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీని 28 జోన్లుగా విభజించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ జోన్లలో పోలీసు ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో పర్యవేక్షించనున్నారు. ఇక హెల్ప్‌ డెస్కులు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సమయానికి అతిథులు చేరుకోవాలని, పోలీసులకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. చెక్‌ పాయింట్ల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. రిపబ్లిక్‌ డే వేడుకలను రప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
MI vs KKR: ఐపీఎల్ కెరీర్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. 11 ఏళ్ల రికార్డు బద్దలు
ఐపీఎల్ కెరీర్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. 11 ఏళ్ల రికార్డు బద్దలు
Most Cheapest Diesel SUVs: దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Most Cheapest Diesel SUVs: దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
Embed widget