కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా ఉద్యమిస్తోన్న రైతులు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు. ఆందోళనలకు ఏడాది గడిచిన గుర్తుగా పార్లమెంట్ వరకు రైతులు కవాతు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్) పిలుపునిచ్చింది.
500 మంది రైతులు ఈ ఆందోళనలో పాల్గొంటారని ఎస్‌కేఎమ్ తెలిపింది. శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిరోజు పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మార్చ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరపాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీ) సిఫార్సు చేసింది.
సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న నిరసనలకు నవంబర్ 26తో ఏడాది పూర్తవుతుంది. ఆ తరువాతే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనుండటంతో ఈ ట్రాక్టర్ మార్చ్‌కు రైతులు పిలుపునిచ్చారు. వీటితో పాటు రైతులు ఆయా రాష్ట్ర సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేయాలని తెలిపింది.
హెచ్చరిక..
నవంబర్ 26లోపు ఈ మూడు సాగు చట్టాలను రద్దు చేయకపోతే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఇటీవల బీకేయూ నేత రాకేశ్ టికాయత్ హెచ్చరించారు.
ఒక వేళ ఈ డెడ్‌లైన్ లోపు మూడు సాగు చట్టాలను ప్రభుత్వం రద్దు చేయకపోతే నవంబర్ 27 నుంచి దిల్లీ సరిహద్దుల వైపు రైతులు కదం తొక్కుతారని టికాయత్ అన్నారు. దిల్లీ పోలీసులు పీకేసిన టెంట్లను మళ్లీ రైతులు ఏర్పాటు చేస్తారని హెచ్చరించారు.
గత ఏడాది నవంబర్ నుంచి పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల రైతులు కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయం, తమ భూములు కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల భయాలను కేంద్రం తోసిపుచ్చింది. రైతులతో ఇప్పటికే పలు దఫాల చర్చలు సాగినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి.
Also Read: Padma Awards 2021: పండ్ల వ్యాపారికి పద్మశ్రీ.. వాట్ ఏన్ ఐడియా బాబాయ్.. నీకు 'దేశం' సలాం!
Also Read: Online Term Plan: ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!
Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్ మొదలైంది.. వివరాలు ఇవే!
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి