పద్మశ్రీ.. వివిధ రంగాల్లో అత్యున్నత సేవలందించినవారికి దక్కే గౌరవం. ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. అయితే ఓ పండ్ల వ్యాపారికి పద్మశ్రీ అవార్డు దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును.. కర్ణాటక మంగళూరుకు చెందిన హరేకాలా హజబ్బ అనే పండ్ల వ్యాపారి.. రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. మరి ఆయన చేసిన గొప్ప ఏంటో తెలుసా?
ఏం సేవ స్వామి?
66 ఏళ్ల హరేకాలా హజబ్బ.. రోడ్డుపైన కమాలా పండ్లు అమ్ముతుంటారు. అయితే ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం ఆయన జీవితం మొత్తం కృషి చేశారు. గ్రామీణ పిల్లలకు చదువు అందించాలనే ఆశయంతో మంగళూరు హరేకాలా-న్యూపడ్పు గ్రామంలో ఓ పాఠశాలను నిర్మించారు. ఇదంతా ఆయన జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుతో చేయడం విశేషం.
హజబ్బ.. ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. ఆయన చదువుకోలేదు. అందుకే ఆ చదువు విలువ తెలుసుకొని విద్య కోసం విశేష కృషి చేశారు. మంగళూరులోని హమ్‌పన్‌కట్టా మార్కెట్‌లో 1977 నుంచి ఆయన పండ్లు అమ్ముతున్నారు. రోజుకు రూ.150 సంపాదిస్తారు. అందులోనే రోజూ కొంత డబ్బు దాచి ఏకంగా పాఠశాలనే నిర్మించారు.
ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. సమాజసేవా రంగంలో ఆయన పద్మ పురస్కారం దక్కింది. ఆయనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. ఆయన గురించి ఓ ట్వీట్ చేశారు.
అప్పుడే వచ్చింది..
ఆయన గ్రామంలో పిల్లలకు విద్యను అందించాలనే ఆలోచన హజబ్బకు 1978లో వచ్చింది. ఎందుకంటే ఓ విదేశీయుడు.. హజబ్బను ఆరెంజ్ ఎంత? అని ఇంగ్లీషులో అడగ్గా.. దానికి సమాధానం చెప్పలేకపోయారు. కనీసం సమాధానం చెప్పలేకపోయానని.. తనలా ఎవరూ ఇలా ఇబ్బంది పడకూడదనే తలపుతో ఈ స్కూల్ నిర్మించాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తన గ్రామంలో స్కూల్ కట్టాలని నిర్ణయించుకున్నారు హజబ్బ.
విద్యా రంగానికి ఆయన చేసిన సేవను ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇండియన్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ పండ్ల వ్యాపారి గురించి ట్వీట్ చేశారు.
Also Read: Online Term Plan: ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!
Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్ మొదలైంది.. వివరాలు ఇవే!
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి