అన్వేషించండి

Covid-19: షాకింగ్ న్యూస్ - మూడు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్, 21 కేసులు నమోదు

Covid-19 New Variant: దేశవ్యాప్తంగా 21 కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

Covid-19 JN.1 Variant Cases:

కొవిడ్ కొత్త వేరియంట్‌పై ఆందోళన పెరుగుతున్న క్రమంలోనే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 21 JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గోవాలో 19 మహారాష్ట్ర, కేరళలో ఒక్కో కేసు నమోదైంది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందనడానికి ఇదే ఉదాహరణ. అప్పుడే 21 కేసులు నమోదయ్యాయి. కొద్ది వారాలుగా ఈ వైరస్ టెన్షన్ పెడుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్‌సుఖ్ మాండవియ కొవిడ్‌ కేసులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ కొత్త స్ట్రెయిన్‌లపై నిఘా ఉంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. 

ఆరోగ్య శాఖ అప్రమత్తం..

కొవిడ్‌ పని అప్పుడే అయిపోలేదని, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలని స్పష్టం చేశారు. కొవిడ్ లక్షణాలపైనా నిఘా పెట్టాలని, శీతాకాలం కావడం వల్ల కేసులు పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే...ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్యని బట్టి చూస్తే భారత్‌లో పరిస్థితులు అంత ఆందోళనకరంగా ఏమీ లేవని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ...రెండు వారాల్లోనే ఉన్నట్టుండి కేసులు పెరగడంపై తాము దృష్టి పెట్టినట్టు వివరించారు. ఇప్పటి వరకూ కొత్త వేరియంట్ సోకిన వాళ్లలో 92.8% మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వాళ్లలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. హాస్పిటల్స్‌లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంది. అప్పటికే వేరే ఏదో జబ్బుతో బాధపడుతున్న వాళ్లకు కరోనా సోకినప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చేంత ప్రమాదకరంగా మారుతోంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ , కేరళ, కర్ణాటకలో డెయిలీ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. మూడు నెలలకోసారి హాస్పిటల్‌లోని వసతులను రివ్యూ చేసుకోవాలని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని తెలిపింది. ప్రస్తుతానికి JN.1 Variant ని ప్రపంచ దేశాలు పరిశీలిస్తున్నాయని, మరీ ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైతే కాదని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Pope Francis Facts: పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
Balakrishna: కారుకు ఫ్యాన్సీ నెంబర్ - బాలకృష్ణ ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
కారుకు ఫ్యాన్సీ నెంబర్ - బాలకృష్ణ ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Pope Francis Facts: పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
Balakrishna: కారుకు ఫ్యాన్సీ నెంబర్ - బాలకృష్ణ ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
కారుకు ఫ్యాన్సీ నెంబర్ - బాలకృష్ణ ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
Samantha: కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Embed widget