అన్వేషించండి

ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం- శకపురుషుడి పేరుతో రూ.100 నాణెం విడుదల

ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉన్న వంద రూపాయల నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా మరో అదురై దృశ్యం సాక్షాత్కారమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉన్న వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు నందమూరి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నందున జూనియర్ ఎన్టీఆర్, పాదయాత్రలో ఉన్నందున లోకేష్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ ఎన్‌టీఆర్ విశేష సేవలందించారని అన్నారు. పీలోని రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలపైనా ఆయన ప్రభావం చూపించారని వెల్లడించారు.

"సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ ఎన్‌టీఆర్ విశేష సేవలందించారు. ఏపీలోని రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలపైనా ఆయన ప్రభావం చూపించారు. రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్యోధనుడు..ఇలా అన్ని పాత్రల్లోనూ నటించి వైవిధ్యాన్ని చూపించారు. సినిమా సమాజాన్ని ఎలా ప్రభావితం చూపుతుందో నిరూపించారు" 

- పురంధేశ్వరి, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్, ఎన్‌టీఆర్ కూతురు 

రాముడిగానే కాకుండా రావణుడిగా, దుర్యోధనుడిగానూ ఎన్‌టీఆర్ అందరినీ మెప్పించారని కొనియాడారు పురంధేశ్వరి. ఆయన తరతరాలకూ హీరో అని అన్నారు. 

"ఎన్‌టీఆర్‌ కేవలం కొంత మందికే హీరో కాదని, తరతరాలకు హీరో. శతజయంతి సందర్భంగా ఆయనను ఇలా స్మరించుకోడం గొప్ప విషయం. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన స్మారకంగా రూ.100 నాణెం విడుదల చేయడం చాలా ఉద్వేగమైన క్షణం"

- పురంధేశ్వరి, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్, ఎన్‌టీఆర్ కూతురు 

రూ.100 నాణెం విడుదల చేసిన తరవాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్‌టీఆర్ సేవల్ని ప్రశంసించారు. ఆయన పేరిట ఇలా ఓ నాణెం విడుదల చేయాలన్న ఆలోచన చాలా గొప్పదని అన్నారు. 

"ఎన్‌టీఆర్ పేరిట రూ.100 నాణెం విడుదల చేయాలన్న కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించడం గొప్ప విషయం. పురంధేశ్వరి ఈ ప్రక్రియలో ముందు నుంచి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తెలుగు సినిమా ద్వారా దేశ సంస్కృతిని చాటి చెప్పారు. రామాయణ, మహాభారతాలకు ఆయన నటనతో జీవం పోశారు. రాముడు, కృష్ణుడి చరిత్రని అందరికీ చాటి చెప్పారు. ఆయననే రాముడు అనుకునే స్థాయిలో నటించారు"

ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి 

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది.                    

టాప్ హెడ్ లైన్స్

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget