అన్వేషించండి
Aakashavaani Review: 'ఆకాశవాణి' రివ్యూ.. సిగ్నల్ కట్ అయిపోయిందే..
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దగ్గర శిష్యుడిగా పని చేసి అశ్విన్ గంగరాజు 'ఆకాశవాణి' సినిమాను తెరకెక్కించాడు.
'ఆకాశవాణి' రివ్యూ
ఆకాశవాణి
ఫారెస్ట్ డ్రామా
Director
అశ్విన్ గంగరాజు
Starring
సముద్రఖని, వినయ్ వర్మ, మిమి మధు, తేజ కాకుమాను, మాస్టర్ ప్రశాంత్ తదితరులు
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దగ్గర శిష్యుడిగా పని చేసి అశ్విన్ గంగరాజు 'ఆకాశవాణి' సినిమాను తెరకెక్కించాడు. కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించడానికి ముందుకొచ్చాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లైవ్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
నాగరిక ప్రపంచానికి దూరంగా, కొండకోనల్లో ఓ గూడెంకు చెందిన జనానికి సంబంధించిన కథ ఇది. ఓ చెట్టు తొర్రలో ఉండే బండరాయిని దైవంగా భావించి పూజలు చేస్తుంటారు గూడెం ప్రజలు. ఆ బండరాయి తరువాత వాళ్లను ఆ ఊరి దొరను(వినయ్ వర్మ) బలంగా నమ్ముతుంటారు. దొర చెప్పినట్లుగానే నడుచుకుంటూ ఉంటారు. గూడెం ప్రజలను భయపెడుతూ.. వాళ్ల శ్రమను దోచుకుంటూ ఉంటాడు దొర. కఠినమైన ఆంక్షల మధ్య అమాయకంగా బతుకుంతుంటారు గూడెం ప్రజలు ఊహించని విధంగా వారు కొలిచే దేవి స్థానంలోకి రేడియో వచ్చి చేరుతుంది. దాన్ని కూడా దేవుడిగానే భావించి కొలుస్తుంటారు. అలాంటి వారి జీవితాల్లోకి చంద్రం మాస్టర్(సముద్రఖని) వచ్చిన తరువాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయనేదే సినిమా కథ.
విశ్లేషణ:
రాజమౌళి దగ్గర శిష్యరికం చేసిన అశ్విన్ మొదటి సినిమాకే ఇలాంటి భిన్నమైన కాన్సెప్ట్ ను ఎన్నుకున్నారు. ఆయన అనుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ.. తెరపై ఆవిష్కరించిన తీరు పెద్దగా ఆకట్టుకోదు. బిక్కుబిక్కుమనుకుంటూ బ్రతికే ప్రజల్లో చైతన్యం నింపడానికి హీరోలు వచ్చే కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో హీరో రేడియో కావడం ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం గూడెం ప్రజల అమాయకత్వాన్ని చూపిస్తూ సరిపెట్టేశారు. మెయిన్ కథలోకి ఎంటర్ అయ్యేసరికి ఓపిక నశిస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో రేడియో వచ్చాక పెద్దగా మార్పులేవీ ఉండవు. రేడియోతో ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో అని ఆశించే ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. సముద్రఖని పాత్ర ఎంటర్ అయ్యాక కాస్త ఆసక్తి వస్తుంది. క్లైమాక్స్ మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. కథ బాగానే ఉన్నప్పటికీ.. సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం, ప్రెజెంటేషన్ లో తప్పులు దొర్లడంతో సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
సినిమాలో నటించిన వారంతా కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దొర పాత్రలో వినయ్ వర్మ, చంద్రం మాస్టారుగా సముద్రఖని తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తేజ కాకమాను తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటాడు. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. కాల భైరవ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే.. ఈ సినిమాలో ప్రేక్షకులను మెప్పించే పాయింట్స్ పెద్దగా లేవనే చెప్పాలి.
Also Read: చీరలో ఎక్స్పోజింగ్.. అనసూయ తరువాతే ఎవరైనా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
View More
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం





















