అన్వేషించండి

Bread Cheese Roll : పిల్లలు ఇష్టంగా తినే బ్రెడ్ చీజ్ రోల్స్.. రెసిపీ చాలా సింపుల్

Simple Recipes : మీ ఉదయాన్ని టేస్టీగా, క్రంచీగా మార్చే ఫుడ్ కోసం చూస్తున్నారా? అయితే మీరు బ్రెడ్ చీజ్ రోల్స్ చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం చాలా సింపుల్. 

Tasty Cheese Roll : బ్రెడ్ చీజ్ రోల్ గురించి ఎక్కువగా వినే ఉంటారు కానీ వాటిని ఇంట్లో ఎక్కువగా తయారు చేసుకోరు. ఎందుకంటే వాటిని తయారు చేయడం కష్టమేమో అనే అపోహలో ఉంటారు. మీకు తెలుసా బ్రెడ్ చీజ్ రోల్ తయారు చేయడం చాలా అంటే చాలా తేలిక అని. ఆడుతూ పాడుతూ మీరు ఈ టేస్టీ చీజ్ రోల్స్ తయారు చేసేయొచ్చు. ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా, స్నాక్స్​గా కూడా మీరు వీటిని తీసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టపడే ఈ బ్రెడ్ చీజ్​ రోల్స్​ని ఏవిధంగా తయారు చేయాలో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

బ్రెడ్ - 1 ప్యాకెట్

చీజ్ - 4 స్లైస్

కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు

బ్రెడ్ క్రంబ్స్ - 1 కప్పు

నూనె - ఫ్రై చేయడానికి సరిపడినంత

మయోనైస్ - 2 స్పూన్స్

తయారీ విధానం

ముందుగా కొన్ని బ్రెడ్స్​ను తీసుకుని ముక్కలుగా చేసి మిక్సీలో వేయండి. అవి పొడిగా అయిన తర్వాత వాటిని ఓ గిన్నెలోకి తీసుకోండి. ఇవే బ్రెడ్ క్రంబ్స్. ఇవి అవసరమా? అనుకుంటున్నారేమో.. వీటిని ఉపయోగించే చేసే ఏ డిష్ రుచినైనా ఇవి పెంచుతాయి. టేస్ట్​తో పాటు క్రంచీనెస్ ఇవ్వడంలో ఇవి సహాయం చేస్తాయి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని దానిలో కార్న్ ఫ్లోర్ వేయండి. దానిలో కాస్త నీరు పోసి.. ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. 

ఓ నాలుగు బ్రెడ్ స్లైస్​లు తీసుకుని.. వాటి అంచులను కట్ చేయండి. బ్రెడ్ రోల్ చేసే సయమంలో అంచులు ఉంటే కాస్త టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. అలా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్​లను ఒక్కొక్కటిగా తీసుకుని.. చపాతీ కర్రతో చపాతీల మాదిరిగా రోల్​ చేస్తూ వత్తాలి. ఇలా నాలుగు బ్రెడ్​ స్లైస్​లను వత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న బ్రెడ్ స్లైస్​ తీసుకుని దానిపై చీజ్​ పెట్టాలి. వాటిని రోల్స్ మాదిరిగా రోల్ చేయాలి. 

ఇలా రోల్ చేసిన బ్రెడ్ చీజ్​ను ముందుగా కార్న ఫ్లోర్​ పేస్ట్​లో ముంచాలి. అనివైపులా కార్న్ అంటుకున్న తర్వాత వాటిని బ్రెడ్ క్రంబ్స్​లో వేయాలి. బ్రెడ్ క్రంబ్స్ రోల్స్​ పట్టుకునేలా.. లేదంటే.. అంటుకోని ప్లేస్​లో మీరే బ్రెడ్ క్రంబ్స్ వేయండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వాటిని రెండు మూడు నిమిషాలు డీప్ ఫ్రిజ్​లో పెట్టండి. ఇలా చేయడం వల్ల రోల్స్​కి అంటుకున్న బ్రెడ్ క్రంబ్స్ ఫ్రై చేసినపప్పుడు వాటిని విడిపోకుండా ఉంటాయి. 

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై పాన్ పెట్టి నూనె వేయండి. అవి కాగే లోపు ఫ్రిజ్​లో పెట్టుకున్న రోల్స్​ను బయటకు తీయండి. నూనె వేగిన తర్వాత బ్రెడ్ రోల్స్​ను నూనెలో వేసి వేయించండి. మంటను మీడియంగా ఉంచి.. దగ్గరే ఉంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. ఒక వైపు వేగింది.. రంగు మారింది అనుకుంటే మరోవైపు తిప్పాలి. ఫ్రై చేస్తున్నప్పుడు కచ్చితంగా స్టౌవ్ దగ్గరే ఉండేలా చూసుకోండి. లేదంటే అవి త్వరగా మాడిపోయే ప్రమాదముంది. ఇలా అన్ని వేగినతర్వాత సర్వింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. 

మయోనీస్​తో వాటిని గార్నిష్ చేసుకోవాలి. కుదిరితే పైన చాట్ మసాలా లేదంటే చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో​ని కూడా చల్లుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఆస్వాదించడానికి బ్రెడ్ చీజ్ రోల్స్ రెడీ. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వారికి వీటిని స్నాక్స్​ బాక్స్​గా, ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా కూడా తయారు చేసుకోవచ్చు. వీటికి తోడు ఆలు చిప్స్​ ఇస్తే అది వారికి పండుగే అవుతుంది. పెద్దలు కూడా ఏదైనా సినిమా చూసే సమయంలో ఇంట్లోనే వీటిని సింపుల్​గా తయారు చేసుకుని హాయిగా ఆస్వాదించవచ్చు. 

Also Read : డైట్​లో ఉన్నప్పుడు బ్రెడ్​తో చేసుకోగలిగే సింపుల్ రెసిపీలు ఇవే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget