World’s biggest drinkers: ప్రపంచంలో అత్యధిక తాగుబోతులు కలిగిన టాప్ 10 దేశాలివే - ఇండియా ఏ స్థానంలో ఉందంటే?
ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 9.8 లీటర్లకు మించకుండా స్వచ్ఛమైన ఆల్కహాల్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇది 100 గ్లాసుల వైన్ కి సమానం.
తాగుబోతుల జాబితా తీస్తే మనోళ్లు ముందుంటారని అంతా అనుకుంటారు. కానీ, అసత్యమని తాజా లెక్కలతో తేలిపోయింది. మనకు మంచి మందుబాబు ప్రపంచంలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. చిత్రం ఏమిటంటే.. తాగుబోతులు లేదా అత్యధికంగా మధ్యం తాగే మందుబాబులు కలిగిన దేశాల జాబితాలో ఇండియా దరిదాపుల్లో లేదు. ముఖ్యంగా టాప్-10లో అస్సలు లేదు. ఇంతకీ ఇండియా ఏ స్థానంలో ఉందనేగా మీ సందేహం? ఇదిగో చూసేయండి.
అత్యధిక తాగుబోతులు కలిగిన దేశంగా కుక్ ఐలాండ్స్ మొదటి స్థానంలో ఉంది. అయితే, ఇండియా మాత్రం 111వ స్థానంలో ఉంది. కుక్ దీవుల్లో ప్రజలు ఏడాదికి సగటున 12.97 లీటర్ల ఆల్కహాలన్‌ను హంఫట్ చేసేస్తున్నారట. ఇది సూచించిన మొతాదుకు దాదాపు 28 శాతం ఎక్కువని అమెరికాలోని CIA విడుదల చేసిన నివేదిక వెల్లడించారు. ఇక మన ఇండియన్ మందుబాబులైతే ఏడాదికి సగటునా కేవలం 3.09 లీటర్ చొప్పున ఆల్కహాల్ తాగుతున్నారట. వరల్డ్ ఫ్యాక్ట్ బుక్‌లో పొందుపరిచేందకు గాను CIA ఈ సమాచారాన్ని 2019లో 266 దేశాల నుంచి సేకరించింది.
- 12.9 లీటర్లతో లాత్వియా రెండో తాగుబోతు దేశంగా నిలవగా.. 12.73తో చెక్ రిపబ్లిక్ మూడోస్థానాన్ని కైవసం చేసుకుంది.
- మొదటి ఐదు స్థానాల్లో లిథువేనియా 11.93, ఆస్ట్రీయా 11.9 స్థానం సంపాదించాయి.
- జర్మనీ 19 స్థానానికి పరిమితమైంది. వీరు కేవలం 10.56 లీటర్ల ఆల్కహాల్ మాత్రమే వినియోగిస్తున్నారట.
- అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో బాగా వెనుకబడిందనే చెప్పాలి. అమెరికన్లు తాగుబోతులుగా 35వ స్థానంలో నిలిచారు. వీరు ఏడాదికి సగటున కేవలం 8.9 లీటర్ల ఆల్కహాల్ మాత్రమే వినియోగిస్తున్నారట.
- ఆల్కహాల్ వినియోగంలో బాగా వెనుకగా ఉన్న దేశాల్లో ఆసియా దేశాలనే చెప్పుకోవచ్చు.
- ఆసియా దేశాల్లో బంగ్లాదేశ్, కువైట్, మౌరిటానియా, సౌది అరేబియా చిట్టచివర ఉన్నాయి.
- ఇక సోమాలియన్లు అయితే అసలు మద్యమే తాగడం లేదట.
- ఆధ్యాత్మిక ప్రదేశం నేపాల్ కూడా 0.36 లీటర్లతో 167వ స్థానంలో ఉంది.
- మనం పాకీస్థానీల కంటే ఎక్కువే తాగుతున్నాం. ఎందుకంటే వారు 0.04 లీటర్లతో 180వ స్థానంలో ఉన్నారు.
- శ్రీలంకన్లు మన కంటే తక్కువే తాగున్నారు. 2.58 లీటర్లతో వారు 122 స్థానంలో ఉన్నారు.
- చైనీయులు 4.48 లీటర్ల ఆల్కహాల్ వినియోగంతో 89 వస్థానంలో నిలిచారు.
సాధారణంగా వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొత్తం ఆల్కహాల్ కూడా మూడు లేదా అంత కంటే ఎక్కువ రోజుల్లో తాగవచ్చు. అంతా ఒకేసారి కూడా తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం ఆరు మీడియం సైజు గ్లాసుల వైన్ లేదా ఆరు పింట్ల బీర్‌కు సమానం. ఈ లీటర్ల లెక్కలన్నీ స్వచ్ఛమైన ఆల్కహాల్ కు సంబంధించినవి. అంటే దాదాపు 300 లీటర్లన్న మాట. ఇది ఏ దేశానికైనా సరే సగటు మోతాదు కంటే చాలా ఎక్కువనే చెప్పవచ్చు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యప్తంగా 2.3 బిలియన్ల జనాభా ప్రస్తుతం తాగుబోతులుగా పరిగణించబడుతున్నారు. అంటే వీరంతా రోజూ తాగుతారన్న మాట. ప్రపంచ వ్యప్తాంగా మొత్తం మరణాల్లో ఐదు శాతానికి పైగా ఆల్కహాల్ హానికరంగా వినియోగించడం వల్లనే సంభవిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also read : తులసి ఆకుల్లో ఎన్నో ఔషద గుణాలు - ఇలా వాడితే, ఆరోగ్యం మీ సొంతం
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.