అన్వేషించండి

నగ్నంగా నిద్రించడం ఆరోగ్యకరమా? షాకింగ్ విషయాలు చెప్పిన స్లీప్ సైకాలజిస్టులు

కొందరికి నిద్రపోతున్నప్పుడు పూర్తిగా దుస్తులు ధరించడం ఇష్టం ఉండదు. కొందరైతే ఏకంగా నగ్నంగా నిద్రపోతారు. మరి ఇలా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందిని రకరకాల అనారోగ్యాలు వేధిస్తూనే ఉంటాయి. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించుకునే ప్రహసనంలో శరీరం కొంచెం ఎక్కువే శ్రమించాల్సి వస్తుంది. అందువల్ల ఇమ్యునిటీ కొద్దిగా తగ్గుతుంది. ఫలితంగా జలుబు, ఫ్లూ వంటివి వేధిస్తుంటాయి. వాతావరణ మార్పుల వల్ల ఇదంతా చాలా సహజమైన విషయమే. రాత్రుళ్లు మరింత వెచ్చగా పడుకోవాలని అనుకుంటాం. అందుకని మరిన్ని ఎక్కువ లేయర్లలో దుస్తులు కూడా ధరిస్తాం. అయతే ఇక్కడ ఒక స్లీప్ ఎక్స్ పర్ట్ ఏమంటున్నారంటే రాత్రుళ్లు ఎక్కువ దుస్తులతో కాదు నగ్నంగా నిద్ర పోవడం మంచిదని. మీరు చదివింది కరెక్టే. ఆ వివరాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

స్లీప్ సైకాలజిస్ట్ డాక్టర్ కేథరీన్ హాల్ నగ్నంగా నిద్ర పోవడం వల్ల కలిగే లాభాలను ఒక మీడియాతో వెలువరించారు. నగ్నంగా నిద్రపోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుందట. నైట్ పైజామాలు, సాక్సుల వంటివి రక్త ప్రసరణకు కొద్ది మొత్తంలో అడ్డంకులు ఏర్పరచవచ్చు. మంచి రక్త ప్రసరణ గుండె, కండరాల ఆరోగ్యానికి చాలా అవసరం. అంతేకాదు రక్త ప్రసరణ సరిగ్గా ఉంటే శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.

అంతేకాదు నగ్నంగా నిద్రించడం బాడీ టెంపరేచర్ ను కూడా రెగ్యులేట్ చేస్తుందట. ఫ్లూ లేదా జలుబు వంటివి ఉన్నపుడు తప్పనిసరిగా బాడీ టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో బాడీ టెంపరేచర్ రేగ్యులేట్ చెయ్యడం అవసరం కూడా. స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఇలా నిద్రించడం ఆరోగ్యకరం అని డాక్టర్ హాల్ అంటున్నారు. నిద్రలేమి సమస్యకు కూడా ఇది మంచి పరిష్కారమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నగ్నంగా నిద్రించడం వల్ల పురుషుల్లో ఫెర్టిలిటి పెరుగుతుందట. స్త్రీలలో అసౌకర్యంగా ఉండే లోదుస్తుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల బెడద ఉండదట.

దుస్తులు లేకపోవడం వల్ల స్కిన్ ఆన్ స్కిన్ కాంటాక్ట్ వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాలను ఎదుర్కొనే శక్తి సహజంగానే శరీరం సంతరించుకుంటుందని డాక్టర్ హాల్ అంటున్నారు. సీసనల్ ఎఫెక్టివ్ డిజార్డర్(SAD) అనే మానసిక స్థితి కూడా ఏర్పడదు అనేది కూడా నిపుణుల అభిప్రాయం. 

సంవత్సరంలో మిగతా అన్ని సీజన్లలో మామూలుగానే ఉండే వ్యక్తులు సాడ్ వల్ల ఒక పర్టిక్యులర్ కాలంలో డిప్రెషన్ కు లోనవుతారు. సాధారణంగా ఇది ప్రతి సంవత్సరం ఒకే కాలంలో వస్తుంది. చలికాలంలో ఇలాంటి సమస్యలు రావచ్చు కొందరిలో. ఈ సమస్యలో నీరసంతో పాటు డిప్రెషన్ తో బాధ పడుతుంటారు. ఈ స్థితి నుంచి బయటపడేందుకు స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ బాగా ఉపకరిస్తుందని డాక్టర్ల అభిప్రాయం.

అయితే నగ్నంగా పడుకున్నపుడు  బెడ్ షీట్స్ మీద మామూలు కంటే  ఎక్కువ బ్యాక్టీరియా చేరుతుంది. అందుకని తరచుగా బెడ్ షీట్స్ మార్చడం అవసరం అవుతుంది. అయితే మీ సొంత బెడ్ మీద పడుకున్నపుడు మాత్రమే ఇలా నగ్నంగా నిద్రించడం వల్ల లాభాలు ఉంటాయి. కానీ హోటల్ రూముల్లో లేక, ఇంకెక్కడైనా పడుకుంటే మాత్రం తప్పనిసరిగా మీ పైజామాలో మీరు పడుకోవడం మంచిది.

ఆరోగ్యంగా ఉండడం అనేది అన్నింటి కంటే ముఖ్యం. అందుకు మీకు నగ్నంగా నిద్రించడం దోహదం చెయ్యవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, తగినంత వ్యాయామం, ఒకవేళ తీసుకున్న ఆహారం నుంచి పోషణ సరిపోవడం లేదని అనిపిస్తే అవసరమైన సప్లిమెంట్లు తీసుకోవడం వంటివన్నీ కూడా ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి.

Also read: టైఫాయిడ్ జ్వరం ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? రక్షణ పొందడం ఎలా?

టాప్ హెడ్ లైన్స్

Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget