అన్వేషించండి

Breakfast: ఉదయం తినే బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు మానేయకూడదు? మానేస్తే వచ్చే రోగాలివే

ఉదయం తినే అల్పాహారం చాలా ముఖ్యం. అది ఎంత ముఖ్యమో తెలుసుకోవాలంటే ఇది చదవండి.

బ్రేక్‌ఫాస్ట్ తరచూ స్కిప్ చేస్తున్నారా? అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు మీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. చాలా మంది అల్పాహారాన్ని పెద్దగా పట్టించుకోరు. నేరుగా లంచ్ ఎక్కువ తినవచ్చులే అనుకుని అల్పాహారాన్ని తినకుండా మానేస్తారు. మీరు రోజంతా తినే ఆహారాల్లో అతి ముఖ్యమైనది అల్పాహారమే. కానీ ఎంతో మందికి ఈ విషయం తెలియక దాన్నే స్కిప్ చేస్తూ ఉంటారు. రాత్రి భోజనం చేశాక కనీసం 8 గంటలు నిద్రపోయి, మరుసటి రోజును సరిగ్గా ప్రారంభించడానికి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ అవసరం. అంటే దాదాపు పది నుంచి 12 గంటలు ఉపవాసం తరువాత ఉదయం ఆహారాన్ని తినాల్సిన అవసరం ఉంది. కానీ టీ తాగేసి ఆహారం తినకుండా ఉండిపోతారు చాలా మంది. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. 

బరువు పెరిగి...
చాలా మందికి తెలియని విషయం ఇది. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతాం అనుకుంటారు కానీ, తెలియకుండానే బరువు పెరిగిపోతారు. నిద్ర లేచాక ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రోజంతా ఆకలి బాధను అరికడుతుంది. త్వరగా ఆకలి వేయదు. లంచ్ కూడా ఎంత తినాలో అంతే తింటారు. కానీ బ్రేక్ ఫాస్ట్ తినకుండా నేరుగా లంచ్ తినడం వల్ల ఎక్కువ తినేసే అవకాశం ఉంది. అది కొవ్వు రూపంలో ఓ మూల పేరుకుపోతుంది. 

గుండె జబ్బులు
ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించడం దీర్ఘకాలంలో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. అధ్యయనాల ప్రకారం ఎవరైతే  బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారో వారిలో ధమనుల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఎక్కువ. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది స్ట్రోకులు, గుండెపోటు వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. 

మధుమేహం 
అల్పాహారం రోజూ తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనాలు నిరూపించాయి. బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను దూరం చేస్తుంది. అదే అల్పాహారం తినడం మానేస్తే ఇన్సులిన్ నిరోధకత వల్ల ఏర్పడే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అందుకే ఉదయం ఆహారం తినడం మానేస్తే దీర్ఘకాలంలో డయాబెటిస్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. 

మెదుడుకు మేలు
క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.  జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది.  ఏకాగ్రతను కూడా పెంచుతుంది. 

జంక్ ఫుడ్ తినకుండా...
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఆకలితో అలమటిస్తారు. దీని వల్ల జంక్ ఫుడ్ తినాలన్న కోరిక పెరుగుతుంది. ఆ కోరిక తీర్చుకునేందుకు అధికస్థాయిలో జంక్ ఫుడ్ తినేస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. 

పోషకాలు
ఉదయానే అల్పాహారం తినడం వల్ల శరీరానికి అవసమైన శక్తితో పాటూ, పోషకాలు అందుతాయి. రోజంతా చురుగ్గా ఉంటారు. అయితే మంచి బ్రేక్ ఫాస్ట్ ఎంచుకోవడం అవసరం.  మీ అల్పాహారంలో ప్రోటీన్లు, తృణధాన్యాలు, పప్పులు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, తాజా పండ్లు, కూరగాయలను ఉంటే మంచిది. 

Also read: హలోవీన్ రోజు మనుషులు దయ్యాల్లా ఎందుకు తయారవుతారో తెలుసా? దాని వెనుకున్న చరిత్ర ఇదిగో

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

టాప్ హెడ్ లైన్స్

Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget