ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా ఏది ? 10గ్రాములు కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు !
ప్రపంచంలో దొరికే సుగంధ ద్రవ్యాలలో అత్యధిక ధర ఉన్న ఈ రెడ్ గోల్డ్‌ను కేసర్ లేదా కుంకుమపువ్వు అని కూడా అంటారు. దీని ధర ఒక కిలోగ్రాము రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది.
సుగంధ ద్రవ్యాలు (మసాలా దినుసులు) లేకుండా ఎలాంటి వంటకమైనా అంత రుచిగా ఉండదు. అది చాట్ అయినా, మీ వంటగదిలో చేసే వెజిటేబుల్ బిర్యానీ అయినా.. మరీ ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకాల్లో మసాలాలు వేయకపోతే నోటికి రుచి ఉండదు. అంతేకాదు.. ఆ ఫుడ్ ఐటమ్ కాస్త అసంపూర్ణంగా అనిపిస్తుంది. అదే మంచి ఫుడ్‌లో కాసింత సుగంధ ద్రవ్యాలతో కూడిన మంచి మసాల జోడిస్తే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది.
ఇలాంటి మసాలా దినుసుల గురించి పరిశీలిస్తే, ఈ రోజుల్లో మీకు మార్కెట్లో అన్ని రకాల మసాలాలు దొరుకుతాయి. మన దేశంలో చాలా రకాల సుగంధ ద్రవ్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా ఏది అని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఆ ఖరీదైన మసాలా ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా ? వంటకాలకు ప్రత్యేక రుచిని తీసుకొచ్చేందుకు మొక్కల భాగాల నుంచి తీసిన సుగంధ ద్రవ్యాలు చాలా ముఖ్యం.
ఇక శీతాకాల సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి, మన ఆహారంలో ఈ మసాలా దినుసులు ఉండటం చాలా మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రుచిని కూడా పెంచుతాయి. జలుబు, చలి జ్వరాన్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నించే మార్గాలు అనేకం ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కొన్ని సుగంధద్రవ్యాలు శీతాకాలపు వ్యాధులపై పోరాటంలో మనకు సహాయపడతాయి.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా:
ఇక ప్రపంచంలో దొరికే అత్యంత ఖరీదైన మసాలా దినుసు పేరు రెడ్ గోల్డ్. అవును, ఈ మసాలా దినుసు బంగారం రేటుకు సమానంగా ఉంటుంది. ప్రపంచంలో దొరికే సుగంధ ద్రవ్యాలలో అత్యధిక ధర ఉన్న ఈ రెడ్ గోల్డ్‌ను కేసర్ లేదా కుంకుమపువ్వు అని కూడా అంటారు. దీని ధర ఒక కిలోగ్రాము రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ఈ కుంకుమపువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కగా చెబుతారు.. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. దాని ఒక పువ్వు నుంచి మూడు రేకులు మాత్రమే తీసుకోగలము. ఈ కుంకుమపువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసుగా మారడానికి బలమైన కారణం ఉంది. కుంకుమపువ్వును ఆయుర్వేద వంటకాల్లో, ఆహార పదార్థాల్లో, దేవుళ్ల పూజల్లో ఉపయోగిస్తున్నప్పటికీ, ఇప్పుడు బయట విక్రయించే పాన్ మసాలాలు, గుట్కాల్లో దీనిని ఉపయోగించడం ప్రారంభించారు.
కుంకుమపువ్వు రక్త శుద్ధి, రక్తపోటు, దగ్గును అణిచివేసే సాధనంగా కూడా పరిగణిస్తారు. అంతేకాదు.. కుంకుమపువ్వులో ఉన్న ఎన్నో రకాల ఔషధాల వల్ల దీనికి ఎక్కువగా దీన్ని ఎక్కువగా గర్భిణీ స్త్రీలు ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి రోజు మూడు నుంచి నాలుగు రకాల కుంకుమ పువ్వును పాలలో కలుపుకొని తాగడం వల్ల గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు తగ్గి రిలాక్స్‌గా ఉంటారు. గర్భిణీ స్త్రీ లలో మలబద్ధకం గ్యాస్ మరియు కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యలు ఉంటాయి. కుంకుమపువ్వు రక్తప్రసరణను పెంచి జీర్ణ క్రియ రేటును పెంచుతుంది. కుంకుమ పువ్వు టీ గర్భధారణ సమయంలో వికారం తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భవతులకు రక్తం పెరిగే అవకాశం ఉంది. కుంకుమ పువ్వులో అధిక యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం మరియు క్రోసెటిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించి బిడ్డ గుండె ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది.