అన్వేషించండి

Cold: జలుబు వేధిస్తోందా? ఈ ఆహారాన్ని తింటే వెంటనే ఉపశమనం

జలుబుగా ఉన్న సమయంలో ఏది తినాలని అనిపించదు. కానీ ఆరోగ్యం కోసం కొన్నింటిని తీసుకుంటే మనకే మంచిది.

ర్షాకాలంలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది జలుబు, జ్వరమే. జలుబు చేసిందంటే చాలు శరీరంలోని శక్తి అంతా హరించుకుపోయిన భావన కలుగుతుంది. విపరీతమైన నీరసం, ఏది తినాలన్నా.. తాగలన్నా అసలు సహించదు. జలుబు వల్ల వచ్చే గొంతు నొప్పి కారణంగా కనీసం మంచి నీళ్ళు కూడా తాగాలని అసలు అనిపించదు. కానీ అటువంటి టైంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ నుంచి ఉపసమనం లభిస్తుంది. వేడి ద్రవాలు తీసుకోవడం వల్ల నాసికా రంధ్రాల్లో ఉన్న ఇబ్బందిని తొలగించేందుకు సహకరిస్తాయి.

జలుబు చేసినప్పుడు సిట్రస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు. జలుబు నివారించడానికి ఇది అద్భుతమైన మందు. విటమిన్-సి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే విటమిన్ సి లభించే నారింజ, నిమ్మకాయలు వంటి వాటిని మీ డైట్ లో తీసుకుంటే జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

వేడి వేడి చికెన్ సూప్ తాగితే అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఘాటుగా చేసుకుని ఈ చికెన్ సూప్ తీసుకోవాలి. అప్పుడు ముక్కుల్లో ఉన్న అడ్డుపడిన బ్లాక్స్ తొలగిపోతాయి. కాలే, బ్రకోలి, గ్రీన్ టీ, ఎర్ర ఉల్లిపాయలు, బ్లూ బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ జలుబుతో పోరాడేందుకు సహాయపడుతుంది.

అల్లం టీ

జలుబు చేసినప్పుడు వేడి వేడిగా అల్లం టీ తాగితే చాలా మంచి రిలీఫ్ గా అనిపిస్తుంది. మీ గొంతుకు ఉపశమనంగా అనిపిస్తుంది. స్పైసీగా ఉండేవి జలుబు చేసినప్పుడు తీసుకుంటే ముక్కులో ఉండే బ్లాక్స్ క్లియర్ చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి వైరస్ ని నిరోధించడంలో సహాయపడతాయని అంటున్నారు. జలుబు చేసినప్పుడు ఐస్ క్రీమ్, పాలు, చీజ్ వంటివి తినకూడదని అంటారు. కానీ జలుబుని మరింత పెంచుతాయని చెప్తారు. కానీ ఐస్ క్రీమ్ తింటే అటువంటి సమస్య వస్తుందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు.  

వెల్లుల్లి

వెల్లుల్లిలో సాధారణ జలుబుతో పోరాడగలిగే కొన్ని అంశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వెల్లుల్లి జలుబుని నివారిస్తుందనేందుకు సైంటిఫిక్ గా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇదే కాదు జలుబు వల్ల దగ్గు వచ్చిన సమయంలో లవంగం నోట్లో వేసుకుని చప్పరించమని పెద్దలు చెబుతారు. అలా చెయ్యడం వల్ల దగ్గు కంట్రోల్ అవుతుంది.

మిరియాల పాలు

జలుబు నుంచి త్వరిత ఉపశమనం పొందేందుకు మిరియాల పొడి వేసుకుని పాలు తాగడం చాలా మంచి ఎంపిక. అందులో కొద్దిగా పసుపు వేసుకుంటే ఇంకా మంచిది. వీటిలో యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నందున జలుబు తగ్గడానికి గొప్ప ఔషధంగా పని చేస్తాయి.

ఇవి మాత్రం వద్దు

జలుబులో ఉన్నప్పుడు కొన్ని ద్రవ పదార్థాలు తీసుకోకపోవడమే ఉత్తమం. కెఫీన్, ఆల్కాహాల్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని డీ హైడ్రేట్ చేస్తాయి. కొంతమందికి కాఫీ తాగనిదే తలనొప్పి వస్తుంది. అటువంటి వాళ్ళు కొద్దిగా కాఫీ తీసుకోవచ్చు.

Also read: మహిళలూ మీ ఆయుష్సు పెరగాలంటే ‘కెరొటీనాయిడ్స్’ తీసుకోండి, ఈ ఆహారంలో లభ్యం!

Also Read: రోజూ జీడిపప్పు తింటే పురుషుల్లో ఆ సమస్యలన్నీ దూరం, మరెన్నో ప్రయోజనాలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Fatty Liver : ఫ్యాటీ లివర్ మందు(ఆల్కహాల్) వల్ల మాత్రమే కాదు.. మైదా, మటన్ వంటి వల్ల కూడా కాలేయానికి నష్టమే
ఫ్యాటీ లివర్ మందు(ఆల్కహాల్) వల్ల మాత్రమే కాదు.. మైదా, మటన్ వంటి వల్ల కూడా కాలేయానికి నష్టమే
Kailash Mansarovar Yatra : కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్నారా? అవసరమైన డాక్యుమెంట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్నారా? అవసరమైన డాక్యుమెంట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Thyroid Medicine : థైరాయిడ్ మందులు మధ్యలో మానేస్తున్నారా? అయితే ఈ ప్రమాదాల తప్పవంటోన్న వైద్యులు
థైరాయిడ్ మందులు మధ్యలో మానేస్తున్నారా? అయితే ఈ ప్రమాదాల తప్పవంటోన్న వైద్యులు

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Ram Charan : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
Telangana Cabinet Decisions: పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget