Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని బాధపడుతున్నారా? అందుకు కారణాలివే!
బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అయితే మీ శరీరం అందుకు సిద్ధంగా ఉందో లేదో ముందు చూసుకోవాలి.
బరువు తగ్గడం అంటే సవాలుతో కూడకున్న పని. అందుకు క్రమశిక్షణ, కఠినమైన ఆహార నియమాలు శారీరక శ్రమ అవసరం. ఆహారంలో మార్పులు చేసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తూ చురుగ్గా ఉంటే బరువు తగ్గడం కష్టం కాదు. కానీ ఇన్ని చేసినా కూడా కొంతమంది బరువు తగ్గడానికి కష్టపడిపోతారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎంత శ్రమించిన కూడా బరువు తగ్గకపోవడానికి ఉన్న కారణాలు ఏమిటంటే..
శరీరంలోని లోపాలు
మీరు శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలపరంగా ఏవైనా లోపాలతో బాధపడుతుంటే బరువు తగ్గేందుకు చేసే ప్రయత్నాలు వృధా అయిపోతాయి. ఈ లోపాల కారణంగా శరీరం కొవ్వు నిల్వలను సేకరిస్తుంది. ఇది భవిష్యత్ లో వచ్చే అనారోగ్యాలకు కారణం అవుతుంది. శరీరంలోని వ్యాధులు, లోపాలు పరిష్కరించకుండా బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే మీరు చేసే వాటికి ప్రతిఫలం పొందలేరని వైద్య నిపుణులు తెలిపారు. ముందుగా వ్యాధులు, లోపాలు నయం చేసుకున్న తర్వాత బరువు తగ్గడంపై దృష్టి సారించాలి.
డైట్ ప్లాన్ సరిగా లేకపోయినా
వ్యాయామం చేస్తూ చెమటలు పట్టేలా కష్టపడుతున్నాం కదా అని ఏది పడితే అది తింటే మీరు పడిన శ్రమకి ఫలితం దక్కడు. ఎందుకంటే బరువు తగ్గే ప్రణాళికలో డైట్ ప్లాన్ చాలా కీలకంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఏడు ప్రత్యేకమైన శరీర రకాలు ఉంటాయి. ఎక్టోమోర్ఫ్ (వాత ప్రకృతి), మెసోమోర్ఫ్ (పిత్త ప్రకృతి), ఎండోమార్ఫ్ (కఫ ప్రకృతి), వాత-పిత్త, వాత-కఫ, పిత్త-కఫా లేదా త్రిదోషక్ వంటి ద్వంద్వ శరీరాలు ఉంటాయి. మీ శరీరం దేని కిందకి వస్తుందో తెలుసుకుని దానికి అనుగుణంగా డైట్ చార్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు.. తీపి, పులుపు, ఉప్పగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం ద్వారా ఎక్టోమోర్ఫ్ బాగా పనిచేస్తుంది. మరింత తీపి, చేదు, ఆస్ట్రింజెంట్ ఆహారాలు తినడం ద్వారా మెసోమోర్ఫ్ బాగా పనిచేస్తుంది. ఎండోమార్ఫ్ చేదు, ఆస్ట్రింజెంట్, ఘాటైన ఆహారాలను తినడం ద్వారా బాగా పనిచేస్తుంది.
పేగుల సంరక్షణ కూడా ముఖ్యమే
పేగులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం లేదంటే జీర్ణక్రియకి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఇలా ఉన్నప్పుడు బరువు తగ్గడానికి ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదు. ప్రతిరోజూ చెమట, మూత్రం, మలం ద్వారా శరీరంలో విషం బయటకి పోతుంది. కానీ పేగుల పనితీరు సక్రమంగా లేకపోతే వీటికి అవరోధం ఏర్పడుతుంది. శ్వేధ రంధ్రాలు మూసుకుపోతే శరీయంలోని మలినాలు బయటకి పోలేవు. ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల పొట్ట లోపల టాక్సిన్స్, పరాన్న జీవులు, అనారోగ్యకరమైన బ్యాక్టీరియా చెరిపోతుంది. దీని వల్ల అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. ఏదైనా ఆరోగ్య లక్ష్యాన్ని సాధించాలంటే తప్పనిసరిగా ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!
Also Read: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు