అన్వేషించండి

Adulterated Food Items : పుచ్చకాయ, పాలు, తేనె నకిలీవో కాదో ఇలా తేల్చేయండి.. కూరగాయలనైతే అలా టెస్ట్ చేయండి

Food Adulteration : మార్కెట్లో దొరికే వాటిలో అసలు ఏవో.. నకిలివే ఏవో గుర్తించడం చాలా కష్టమవుతుంది. అయితే కొన్ని టిప్స్​తో వాటిలో ఏది మంచిదో.. ఏది నకిలీదో గుర్తించవచ్చు. అదేలా అంటే.. 

Food Adulteration and its Detection  : మనం తినే ఆహారం అసలైనదో నకిలీదో గుర్తించడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అసలు కంటే నకిలీనే మంచిదేమో అనే రేంజ్​లో వాటిని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​లో ఈ కల్తీ ఆహారం గురించి ఎన్నో వార్తలు రోజూ చూస్తూనే ఉన్నాము. కేవలం హైదరాబాద్​లోనే కాక.. చుట్టుపక్కల కూడా ఈ కల్తీ ఆహారం దందా నడుస్తుంది. తాజాగా పారాచూట్ కొబ్బరి నూనె నుంచి.. రెడ్ లేబుల్ టీ వరకు వివిధ గృహోపకరణాలను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి సమయంలో మార్కెట్లో మనం కొనే వాటిలో కల్తీ ఆహారాలను ఎలా గుర్తించాలో కొన్ని టిప్స్​తో తెలుసుకోవచ్చు. ఈ టిప్స్​తో మీరు అసలైనవి, నకిలీవి ఈజీగా గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు.

పుచ్చకాయలు

సమ్మర్​లో పుచ్చకాయలకుండే డిమాండ్ వేరు. దాదాపు అందరూ దీనిని వేసవిలో తీసుకుంటారు. ఇదే క్యాష్ చేసుకునేందుకు కొందరు వాటిని కూడా కల్తీ చేస్తున్నారు. అయితే దీనిని ఓ సింపుల్​ టిప్​తో అసలుదో.. నకిలీదో తెలుసుకోవచ్చు. అదేలా అంటే.. మీరు పుచ్చకాయను మధ్యలో కోసి.. పుచ్చకాయ ముక్కకి మధ్యభాగంలో కాటన్​ను పెట్టండి. అది రంగు మారితే నకిలీ అని గుర్తించండి. ఎందుకంటే పుచ్చకాయ నీరు రంగు కాటన్​ రంగను మార్చదు. నకిలీ అయితేనే రంగు మారుతుంది. 

బెండకాయలు.. 

బెండకాయలనే కాదు.. ఇతర గ్రీన్ కలర్ వెజిటేబుల్స్​ను కాటన్​బాల్స్​తో టెస్ట్ చేయవచ్చు. కాటన్ బాల్స్​పై నీటిని చల్లీ.. వాటిని బెండకాయలపై ఒత్తితే.. గ్రీన్ కలర్ రంగు కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది అంటే.. అవి నకిలీవని అర్థం. కల్తీ చేయనివి రంగు మారవు.

టీపొడిని గుర్తించడం ఎలా?

ఓ పేపర్ తీసుకుని దానిపై టీపొడిని వేయండి. అది రంగును విడుదలచేస్తే.. అబ్బా మంచి రంగు వస్తుందనుకోకండి. ఎందుకంటే రంగు రానిదే మంచి టీపొడి. మీకు తెలుసా మార్కెట్లో వాడేసిన టీపొడిని ఆరబోసి మార్కెట్లో అమ్మేవారు కూడా ఉన్నారు. కాబట్టి టీ పొడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆల్రేడి వాడేసిన టీపొడి రంగును త్వరగా విడుదల చేస్తుంది. 

నెయ్యిని ఎలా గుర్తించాలంటే..

నెయ్యిని చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం తీసుకుంటారు. అయితే.. దానిని క్యాష్ చేసుకునేందుంకు కొందరు కల్తీ నెయ్యిని తయారు చేసి మార్కెట్లలోకి వదిలేస్తున్నారు. మరి కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. ఓ గ్లాస్​లో నెయ్యి తీసుకోండి.. దానిలో అయోడిన్ సొల్యూషన్ వేయాలి. అది కలర్ ఛేంజ్ అయి బ్లూ కలర్​లో మారితే కల్తీ నెయ్యి అని అర్థం. అంతేకాకుండా నెయ్యిని అయోడిన్ అబ్జార్వ్ చేసుకోదు. 

కారం రంగు ఓకే కానీ.. రుచి లేదా

ఓ గ్లాస్​లో నీళ్లు తీసుకోండి. దానిలో ఓ చెంచా కారం వేయండి. అసలైన కారం ముందు నీటిలో పైన ఉంటూ.. మొత్తంగా గ్లాస్ అడుగు భాగానికి చేరుకుంటుంది. ఎలాంటి రంగును ఇవ్వదు. అదే నకిలీ అయితే వాటర్ కలర్​ను మార్చుతుంది.

తేనె, పాలను ఎలా గుర్తించాలి?

తేనెను ఎలా గుర్తించాలంటే.. గ్లాస్​లో వాటర్ తీసుకోండి. దానిలో తేనెను వేయండి. తేనె నీటిలో మిక్స్​ కాకుండా కిందకి చేరుకుంటే అది మంచిదని అర్థం. కొబ్బరి నూనెను ఓ గ్లాస్​లోకి తీసుకోండి. దానిని ఫ్రిజ్​లో ఉంచండి. మంచి కొబ్బరి నూనె అయితే మొత్తం గడ్డకడుతుంది. పాలను ఓ గ్లాస్​లో తీసుకుని వాటిని కలిపితే ఎలాంటి బుడగలు రాకపోతే అవి మంచివని అర్థం. 

మరిన్నీ..

చిలగడ దుంపలపై రుద్దితే రంగు మారితే అవి నకిలీవని గుర్తించాలి. మిరియాలను టేబుల్​పై వేసి ఒత్తితే అవి త్వరగా బ్రేక్ కావు.. నకిలీవి అయితే దానిపై ఉన్న లేయర్ పోతుంది. బఠాణీలు కూడా రంగును విడుదల చేస్తే అవి నకిలీవని గుర్తించాలి. పసుపును ఓ గ్లాస్ నీళ్లలో తీసుకోవాలి. దానిలో కాస్త పసుపు వేయండి. నిజమైన పసుపు రంగును తక్కువగా ఇస్తుంది. మొత్తం కిందకి దిగిపోతుంది. నకిలీ అయితే ఎక్కువ రంగును ఇస్తుంది. ఈ సింపుల్ టిప్స్ మీరు వాడే పదార్థాలు నకిలివో కాదో చెప్తాయి అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లో ఏమి నకిలివీ ఉన్నాయో ఈ టెస్ట్​లతో గుర్తించేయండి.

Also Read : దాల్చిన చెక్క టీని ఇలా తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉంటుంది.. మరెన్నో బెనిఫిట్స్ కూడా

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget