అన్వేషించండి

Dizzy: వేగంగా నిలబడినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయా? కారణం ఇదే!

కళ్ళు తిరగడం, కంటి చూపు మసకబారడం వంటి సమస్యలు ఎదురువుతున్నాయా? అలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

అప్పటి వరకు కూర్చుని ఒక్కసారిగా లేచి నిలబడినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించిందా? ఇది చాలా మందికి సర్వసాధారణంగా ఎదురయ్యే అనుభవమే. తేలికగా తీసుకుంటారు.. కానీ కొన్ని సార్లు వైద్యపరమైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. దీన్ని హెడ్ రష్ లేదా ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని పిలుస్తారు. శరీరంలో కలిగే వేగవంతమైన మార్పు కారణంగా ఇది సంభవిస్తుంది. ఒక్కసారిగా నిలబడినప్పుడు కళ్ళు తిరగడం వల్ల బ్యాలెన్స్ కోల్పోయేలా చేస్తుంది. దృష్టి తగ్గిపోతుంది. ఇది తాత్కాలికంగా రక్తపోటు తగ్గడం వల్ల మెదడుకి రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గిస్తుంది. రెటీనాకు కూడా రక్త సరఫరా పడిపోతుంది. దీని వల్ల కంటి చూపు చీకటిగా మారుతుంది.

మనం లేచి నిలబడినప్పుడు 300 నుంచి 800 సెం. మీ క్యూబ్ రక్తం కాళ్ళలోకి లాగబడుతుంది. ఇది రక్తపోటులో తగ్గుదలకి దారితీస్తుంది. దీని వల్ల శరీర ప్రతిస్పందిస్తుంది. రక్తనాళాలు సంకోచించబడతాయి. కాళ్ళలో కండరాలు, కడుపు సంకోచిచీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. శరీరం నిర్జలీకరణానికి గురైతే లేదా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే కళ్ళు తిరిగే సమయం ఎక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఇటువంటి సమస్య ఎదురైతే మాత్రం దాన్ని విస్మరించకూడదు. హైపోటెన్షన్ మూడు నిమిషాలకి మించి కొనసాగితే ఆందోళన చెందాల్సిన పరిస్థితి. ఇది అరుదైన సందర్భాలలో నరాలు దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. అటానమిక్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

మయో క్లినిక్ ప్రకారం ఇటువంటి పరిస్థితి తక్కువ హృదయ స్పందన రేటు, షుగర్ లెవల్స్ పడిపోవడం, థైరాయిడ్ పరిస్థితులతో బాధపడుతున్నప్పుడు కూడా కనిపిస్తుంది. ఎన్ హెచ్ ఎస్ ప్రకారం గుండె వైఫల్యం, విటమిన్ బి 12 లోపం, మద్యపానం, పార్కిన్సన్, అల్జీమర్స్, రక్తహీనత, అథెరోస్క్లెరోసిస్ వంటి ఇతర అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా ఇదే విధంగా కళ్ళు తిరగడం జరుగుతుంది. ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఎంత ప్రమాదమో, తగ్గినా కూడా అంతే ప్రమాదం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండడాన్ని ‘తక్కువ బ్లడ్ షుగర్ లేదా హైపోగ్లైసీమియా’ అంటారు. ఇది ప్రధానంగా మధుమేహం ఉన్నవారిలోనే కనిపిస్తుంది. తగినంత నీరు తాగకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి. దీనికి సకాలంలో చికిత్స అందకపోతే రక్తంలో చక్కెర శాతం ఇంకా తగ్గి మరణం సంభవిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గగానే ఒళ్లంతా అకారణంగా చెమటలు పడతాయి. తీవ్ర అలసటగా అనిపిస్తుంది, తల తిరుగుతుంది. వికారంగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో చిన్న బెల్లం ముక్క లేదంటే చాక్లెట్ నోట్లో వేసుకుంటే సరిపోతుంది. కాసేపటికి శరీరం సాధారణ స్థితికి చేరుకుని నీరసం తగ్గిపోతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: హాయిగా నిద్రపోవాలని ఉందా? అయితే, ఈ ఆయుర్వేద పానీయాలు తీసుకోండి

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves Rice Recipe : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
Exercise Without Rest : రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget