అన్వేషించండి

Weight Loss Diet : బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు వీటిని మీ డైట్​లో చేర్చుకోండి

బరువును తగ్గాలనుకునే వారు కొన్ని ఆహారాలను రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల ఈజీగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గుతారు.

Weight Loss Diet : బరువు తగ్గడానికి వ్యాయామాలతో పాటు.. తీసుకునే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మీరు 30వ పడిలోకి అడుగుపెడుతున్నప్పుడు జీవక్రియ సహజంగా మందగించడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీ డైట్​ చార్ట్​లో కాస్త స్మార్ట్​గా ఆలోచించి కొన్ని మార్పులు చేస్తే.. మీరు ఈజీగా బరువు తగ్గుతారు. వయసు పెరిగే కొద్ది మనం కొన్నివిషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామనే విషయంపై క్లారిటీ లేకుంటే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 

వయసు పెరిగే కొద్ది శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో బరువు తగ్గేందుకు మీరు డైట్​ చార్ట్​ సిద్ధం చేసుకోవాలి. ఇది మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేదానిపై క్లారిటీ ఇస్తుంది. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు తగ్గుతారు. ముఖ్యంగా మీ డైట్​లో 5 స్మార్ట్ ఛేంజస్ చేస్తే మీ బరువు మీ అదుపులో ఉంటుంది.

బరువు తగ్గేందుకు మీ డైట్​ ఛార్ట్​లో ఫైబర్, కాల్షియం ఉండాలి. ఈ రెండు పోషకాలు మీరు తినే ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇవి బరువు తగ్గాలనే మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దాని అర్థం ఇతర పోషకాలకు దూరంగా ఉండాలని కాదు. వీటితోపాటు ప్రోటీన్, ఐరన్, పోటాషియం, ఒమేగా-3 వంటి పోషకాలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇదే కాకుండా హైడ్రేటెడ్​గా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్​కి దూరంగా ఉండాలి. బరువు తగ్గడం కోసం డైట్​ చార్ట్​లో చేయాల్సిన మార్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైబర్ తీసుకోవడం పెంచండి..

బరువు తగ్గించడంలో ఫైబర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీ వయసు పెరిగే సమయంలో ఇది మరింత కీలకంగా వ్యవహరిస్తుంది. మందగిస్తున్న జీవక్రియపై ఇది ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీ డైట్​ చార్ట్​లో ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు చేర్చుకోండి. ఇది బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. టైప్ 2 డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

వాటికి దూరంగా ఉండండి..

ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఏ వయసు వారైనా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి మీకు రుచిని అందిస్తాయి కానీ.. ఆరోగ్యానికి మాత్రం హాని చేస్తాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఊబకాయానికి కూడా దారితీస్తాయి. అంతేకాకుండా వీటిని ఎక్కువగా తీసుకునేవారిలో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. కాబట్టి వాటికి దూరంగా ఉంటూ ఇంట్లో వండుకునే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టండి. 

ఫ్యాడ్​ డైట్​ వద్దు

బరువు తగ్గడంలో ఫ్యాడ్ డైట్​ చాలా బాగా పనిచేస్తుంది. కానీ దానివల్ల ఎంత వేగంగా బరువు తగ్గుతారో.. అంతే వేగంగా మళ్లీ బరువు పెరిగిపోతారు. కాబట్టి ఎల్లప్పుడు వేగంగా బరువు తగ్గే డైట్స్ కాకుండా.. సమతుల్యమైన డైట్​ను ఫాలో అవ్వాలి. శరీరానికి అవసరమైన పోషకాలు ఆ డైట్​లో ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గి.. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. 

కాల్షియం పెంచండి..

వయసు పెరిగే కొద్ది కాల్షియం లోపం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే కాల్షియం కేవలం ఎముకల కోసమే కాదు.. బరువు తగ్గడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీలైనంత కాల్షియం మీ డైట్​లో చార్ట్​లో పొందుపరచుకోండి. బరువుతో పాటు.. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

మితంగా తీసుకోండి..

మీకు ఆల్కహాల్​ అలవాటు ఉంటే.. పూర్తిగా మానలేని స్థితిలో ఉంటే.. కనీసం వాటిని మితం చేయండి. అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది దానిని ఎంత తగ్గిస్తే అంతమంచిది. దీనిలోని అధిక కేలరీలు మీ బరువు తగ్గించే లక్ష్యాలను అడ్డుకోవడమే కాకుండా.. అనేక అనారోగ్య పరిస్థితులకు కారణమవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం లేదంటే మితం చేయడం మీ ఆరోగ్యానికి మంచిది. 

వీటిని మీరు కరెక్ట్​గా ఫాలో అయితే వయసు పెరుగుతున్నా ఫిట్​గా, ఆరోగ్యంగా, యవ్వన ఛాయలతో ఉంటారు. పోషకాహారంతో పాటు.. మీ ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి సరైన ఫుడ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. వీలైతే వైద్యుని సంప్రదించి మీ డైట్​ఛార్ట్​ ప్రిపేర్ చేసుకుని ఫాలో అయిపోండి.

Also Read : పండుగ వేళ అన్ని తినేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

టాప్ హెడ్ లైన్స్

Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Monsoon Driving Guide : వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget