అన్వేషించండి

Beetroot Brownie : పిల్లలు ఇష్టంగా తినే బీట్​రూట్​ బ్రౌనీలు.. రెసిపీ ఇదే

Tasty Breakfast Ides : మీ పిల్లలు బీట్​రూట్ తినట్లేదా? ఆరోగ్యానికి మంచిదని మీరు ఎలా అయినా వారికి బీట్​రూట్ పెట్టాలనుకుంటే మీరు బీట్​రూట్​ బ్రౌనీలు చేసి పెట్టొచ్చు.

Beetroot Brownie Recipe : పిల్లలు కేక్​లు, బ్రౌనీలు ఇష్టంగా తింటారు. అదే బీట్​రూట్​, క్యారెట్​లు అంటే మొహం చాటేస్తారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు కూడా స్మార్ట్​గా మారాలి. వారు ఎలాంటి ఫుడ్స్​ని ఇష్టపడుతున్నారో తెలుసుకుని.. ఆ ఫుడ్స్​లో మీరు హెల్తీ ఫుడ్​ ఉండేలా చూసుకోవాలి. ఉదాహారణకు మీ పిల్లలు బ్రౌనీలు ఇష్టంగా తింటే.. మీరు వారికి బీట్​రూట్ బ్రౌనీలు చేయొచ్చు. ఇది వారి ఇష్టాలను హెల్తీగా చేస్తుంది. మరి ఈ బీట్​రూట్​ బ్రౌనీలు ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

బీట్​రూట్ - 2 పెద్దవి

వెజిటేబుల్ ఆయిల్ - అవసరానికి తగినంత

గోధుమ పిండి - 2 కప్పులు

కోకా పౌడర్ - 1 కప్పు

బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్

బేకింగ్ సోడా - అర టీస్పూన్

ఉప్పు - తగినంత

పంచదార - రుచికి తగినంత

వెనిలా ఎసెన్స్ - 1 టీస్పూన్

చాక్లెట్ చిప్స్ - 1 కప్పు

డ్రై ఫ్రూట్స్ - గార్నిష్ కోసం 

తయారీ విధానం

ముందుగా బీట్​రూట్ పైన తొక్కను పీల్ చేసి.. బాగా కడిగి తురుముకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. ఓ గిన్నె పెట్టి దానిలో బీట్ రూట్ వేసి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లార్చాలి. అనంతరం వాటిని బ్లెండర్​లో వేసి ప్యూరీ చేసుకోవాలి. కావాలంటే మీరు దానిని వడకట్టి మెత్తటి ప్యూరీని మాత్రమే ఉపయోగించుకుంటే బ్రౌనీలు బాగా వస్తాయి.

ఇప్పుడు ఓవెన్​ను 175 డిగ్రీలు ప్రీ హీట్ చేసుకోవాలి. బ్రౌనీ పాన్ తీసుకుని దానిలో పార్చ్​మెంట్​ పేపర్ సెట్ చేయండి. ఇది లేకుంటే మీరు నూనె లేదా వెన్నను పాన్​కు అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో గోధుమ పిండి, కోకాపౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని దానిలో బీట్​రూట్​ ప్యూరీ, పంచదార, వెనిలా ఎసెన్స్​ వేసి బాగా మిక్స్ చేయాలి. అన్నీ బాగా మిక్స్ చేయాలి. ఒకదానికొకటి కలిసేలా మిక్స్ చేసుకుంటే బ్రౌనీలు బాగా వస్తాయి.

రెండు గిన్నెలు దగ్గర పెట్టుకుని పిండిలో బీట్​రూట్ మిశ్రమం వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా ఉండేలా దీనిని మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు చాక్లెట్ చిప్స్ కూడా వేసి బాగా కలపండి. దీనిని బటర్ పూసి బీటరూట్​ పాన్​లో వేయండి. చిన్నచిన్న కప్పులలో మీరు దానికి కాస్త నిండుగా కాకుండా కొంచెం వెలితిగా ఉండేలా మిశ్రమాన్ని వేయాలి. ఈ బ్రౌనీ పాన్​ని ప్రీహీట్​ చేసిన ఓవెన్​లో జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. 30 నుంచి 35 నిమిషాలు దానిని అలా వదిలేయాలి. 

బ్రౌనీలు ఉడికాయో లేదో తెలుసుకునేందుకు దానిలో టూత్ పిక్ పెట్టాలి. దానికి పిండి అంటుకోకుండా వస్తే బ్రౌనీలు సిద్ధమైనట్లు. ఒకవేళ బ్రౌనీ అంటుకుంటే మరికొంచెం సేపు దానిని బేక్ చేయాలని అర్థం. బ్రౌనీలు ఉడికిన తర్వాత పాన్​ను బయటకు తీసి చల్లారనివ్వండి. అనంతరం ఓ ప్లేట్​లో బ్రౌనీలు తీసి.. వాటిని డ్రై ఫ్రూట్స్​తో గార్నిష్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ బీట్​రూట్ బ్రౌనీలు రెడీ.

Also Read : టేస్టీ టేస్టీ మిల్లెట్స్ పాయసం.. రెసిపీ చాలా సింపుల్

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget