అన్వేషించండి

Republic Day 2026 : గతంత్ర దినోత్సవం 2026 స్పెషల్ రంగోలి డిజైన్లు.. ఇంట్లో, ఆఫీస్​లో ఈ ముగ్గులు వేసేయండి

Republic Day Rangoli Designs : గతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా.. త్రివర్ణ రంగులతో రంగోలిని వేస్తున్నారా? అయితే మీ ఇల్లు, ఆఫీస్ దగ్గర ఈ ముగ్గులు వేసి అందంగా ముస్తాబు చేసేయండి.

Republic Day 2026 Decoration Rangoli Designs : గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా త్రివర్ణ పతాకం రంగులైన పచ్చ, తెలుపు, కాషాయం ఉపయోగించి రంగోలి వేయాలనుకుంటున్నారా? అయితే ఇంట్లో, ఆఫీస్​లలో ఈ అందమైన గణతంత్ర దినోత్సవ స్పెషల్ ముగ్గులు వేసేయండి. ఇవి ఇంటికి, ఆఫీస్​కి అందమైన రూపాన్ని ఇస్తాయి. పైగా ఈ డిజైన్లు వేయడం, అలంకరించడం కూడా సులభమే. మరి గణతంత్ర దినోత్సవం 2026 స్పెషల్ రంగోలి డిజైన్లు ఏంటో చూసేద్దామా?

అశోక చక్రంతో..

Republic Day 2026 : గతంత్ర దినోత్సవం 2026 స్పెషల్ రంగోలి డిజైన్లు.. ఇంట్లో, ఆఫీస్​లో ఈ ముగ్గులు వేసేయండి

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మీరు త్రివర్ణ పతాకం రంగుల్లో అశోక చక్రాన్ని హైలెట్ చేస్తూ.. రంగోలిని వేయవచ్చు. ఈ క్లాసిక్ డిజైన్ మధ్యలో ముదురు నీలం రంగు అశోక చక్రాన్ని కలిగి ఉంటుంది. దాని చుట్టూ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో వృత్తాకార నమూనాలు వేయవచ్చు. ఈ డిజైన్ సరళమైనది. అలాగే బాగా ఆకట్టుకుంటుంది.

ఇండియా మ్యాప్

Republic Day 2026 : గతంత్ర దినోత్సవం 2026 స్పెషల్ రంగోలి డిజైన్లు.. ఇంట్లో, ఆఫీస్​లో ఈ ముగ్గులు వేసేయండి

డిజైన్లకు భిన్నంగా మీరు భారతదేశ పటాన్ని రంగోలి డిజైన్​గా కూడా వేయవచ్చు. మీ కార్యాలయ ప్రవేశ ద్వారం లేదా సొసైటీ ద్వారం కోసం భారతదేశ పటం వేయవచ్చు. ముందుగా ఇండియా అవుట్‌లైన్ వేసి.. రంగోలిలా మంచి రంగులతో అలంకరించవచ్చు. తివర్ణ రంగులు వేస్తే.. మొత్తం డిజైన్‌ ప్రత్యేకంగా మారిపోతుంది.

త్రివర్ణ నెమలి

Republic Day 2026 : గతంత్ర దినోత్సవం 2026 స్పెషల్ రంగోలి డిజైన్లు.. ఇంట్లో, ఆఫీస్​లో ఈ ముగ్గులు వేసేయండి

మీరు త్రివర్ణ నెమలి మోటిఫ్ రంగోలిని కూడా వేయవచ్చు. భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలిని త్రివర్ణ రంగులలో వేసే రంగోలి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నెమలి శరీరానికి నీలం రంగును.. దాని ఈకలకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను ఉపయోగించవచ్చు. ఈ డిజైన్ బాల్కనీ లేదా అపార్ట్​మెంట్ ప్రాంతాలకు అనువైనది.

పూల రంగోలి

Republic Day 2026 : గతంత్ర దినోత్సవం 2026 స్పెషల్ రంగోలి డిజైన్లు.. ఇంట్లో, ఆఫీస్​లో ఈ ముగ్గులు వేసేయండి

మీరు పర్యావరణ అనుకూలమైన ముగ్గు వేయాలనుకుంటే.. ఈ పూల రంగోలిని కూడా వేయవచ్చు. ఈ డిజైన్‌లో రసాయన రంగులకు బదులుగా తాజా పువ్వులను ఉపయోగించవచ్చు. కాషాయం కోసం బంతి పువ్వులు, తెల్లని పూలు, ఆకుపచ్చ ఆకులతో ఈ రంగోలి ముస్తాబు చేయవచ్చు. ఈ ముగ్గు సహజమైన, తాజా రూపాన్ని ఇస్తుంది. ఇది ఇండోర్ అలంకరణలకు అనువైనదిగా చేస్తుంది.

కమలంతో అందంగా..

Republic Day 2026 : గతంత్ర దినోత్సవం 2026 స్పెషల్ రంగోలి డిజైన్లు.. ఇంట్లో, ఆఫీస్​లో ఈ ముగ్గులు వేసేయండి

త్రివర్ణ కమలం నేపథ్య రంగోలి కూడా మంచి ఆప్షనే. మన జాతీయ పుష్పం కమలం ఆధారంగా.. ఈ రంగోలి సాంప్రదాయంగా, ఆకర్షణీయంగా పరిగణిస్తారు. మీరు కమల రేకులను కాషాయం, తెలుపు రంగులతో నింపవచ్చు. దిగువ ఆకులను ఆకుపచ్చ రంగుతో అలంకరించవచ్చు. ఈ డిజైన్ ఏదైనా ప్రవేశ ద్వారం వద్ద వేసినా ప్రత్యేకంగా ఉంటుంది.

తక్కువ సమయం ఉంటే..

Republic Day 2026 : గతంత్ర దినోత్సవం 2026 స్పెషల్ రంగోలి డిజైన్లు.. ఇంట్లో, ఆఫీస్​లో ఈ ముగ్గులు వేసేయండి

మీకు స్థలం లేదా సమయం తక్కువగా ఉంటే.. త్రివర్ణ అంచుతో మినిమలిస్ట్ రంగోలిని వేయవచ్చు. మీరు తలుపు లేదా గోడ అంచున ఈ సింపుల్ రంగోలి డిజైన్ వేయవచ్చు. చిన్న చుక్కలు, బేబీ లైన్లు లేదా సాధారణ పూల నమూనాలను ఉపయోగించి అలంకరిస్తే ముగ్గు అందమే మారిపోతుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget