అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Holi 2023: హోలీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆ రంగుల నుంచి మీ కళ్ళను కాపాడుకోండిలా

హోలీ రంగులు కళ్ళలో పడితే ఎంతో ప్రమాదం. ఆ రోజున మీ కంటిని రక్షించుకునే మార్గాలు ఇవిగో.

జీవితంలో ఉల్లాసం, ఉత్సాహంతో పాటు రంగులు నింపేందుకు వచ్చింది హోలీ పండుగ. ఆనందంలో పడి ఆరోగ్యం గురించి విస్మరించకూడదు. హోలీ రంగులు చర్మం, జుట్టు, కళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే హోలీ ఆడాలి. బయట అమ్మే సింథటిక్ రంగులు కళ్లపై పడితే చాలా ప్రమాదకరం. కాబట్టి హోలీ ఆడేటప్పుడు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక్కడ ఇచ్చాము. 

సేంద్రియ మార్గం 
సింథటిక్ రంగులను రసాయనాల మేళవింపుతో తయారుచేస్తారు. కాబట్టి వాటిని వాడకపోవడమే మంచిది. వీలైనంతవరకు సేంద్రియ పద్ధతిలో తయారుచేసిన హెర్బల్ రంగులనే వాడాలి. వీటిని ప్రకృతిలో సహజంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులతో తయారుచేస్తారు. కాబట్టి పొరపాటున కళ్ళల్లో పడినా కూడా పెద్దగా హాని ఉండదు.

బెలూన్ ఫైట్ వద్దు
నీళ్లలో రంగులు కలిపి, ఆ నీళ్లను బెలూన్లలో నింపి బెలూన్ ఫైట్ ఆడేవాళ్లు ఎంతోమంది. హోలీ రోజునే ఈ బెలూన్ ఫైట్ కనిపిస్తుంది. అయితే బెలూన్లను విసిరినప్పుడు అవి ముఖానికి తగిలి, అందులో ఉన్న రంగు నీళ్లు కళ్ళల్లో పడే అవకాశం చాలా ఎక్కువ. ఇవి ఒక్కొక్కసారి కంటికి శాశ్వతంగా హాని కలిగిస్తాయి. కాబట్టి బెలూన్ ఫైట్‌లాంటివి ఆడక పోవడమే మంచిది. ఒకవేళ బెలూన్ ఫైట్ ఆడాలి అనుకుంటే కచ్చితంగా సేంద్రియ రంగులని వాడాలి.

కళ్లద్దాలు ధరించండి 
కళ్లకు రంగుల నుంచి ఎలాంటి ప్రమాదం ఉండకూడదు అనుకుంటే నల్ల కళ్ళద్దాలనుకొని హోలీ రోజున వాటిని పెట్టుకోండి. వీటిని ధరించడం వల్ల రంగులు ఏవి కళ్ళల్లో పడే అవకాశం ఉండదు. జీరో పవర్ గ్లాసెస్, ప్రొటెక్టివ్ గ్లాసులు కూడా మార్కెట్లో దొరుకుతాయి. వాటిని కొని ధరించుకోవచ్చు.

కళ్ళ చుట్టూ క్రీమ్
 హోలీ ఆడే ముందు కళ్ల చుట్టూ కోల్డ్ క్రీమ్ లేదా కొబ్బరి నూనెను మందంగా పూయాలి. ఇది రంగులు కంటి చుట్టూ అంటుకునే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు కంటి చుట్టూ రంగులు పడినా కూడా వాటిని సులభంగా తొలగిపోయేలా చేస్తాయి.

కొన్ని రంగుల్లో చెమ్కీలు కూడా కలుపుతారు. ఈ చెమ్కీలు చాలా మందంగా ఉంటాయి. ఆ చెమ్కీలతో కూడిన రంగులు చల్లుకోవడం వల్ల అవి కళ్ళల్లో పెడితే తీవ్రమైన నొప్పికి కారణం అవుతాయి. డ్యామేజ్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి అలాంటి చెమ్కీలను రంగుల్లో కలపకూడదు. 

ఇలా చేయండి
అనుకోకుండా రంగులు కళ్ళల్లో పడితే వెంటనే చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. స్టెరైల్ సెలైన్ ద్రావణంతో కళ్ళను మెల్లగా కడిగినా కూడా రంగులు పోతాయి. వెంటనే కంటి వైద్యుల్ని సంప్రదించడం చాలా ముఖ్యం.  కళ్ళలో దురద మొదలైనా కూడా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే మంచిది. కొన్నిసార్లు కళ్ళల్లో రంగు పడిన విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే చివరకు చికాకు, వాపు, అలెర్జీలు ఇలా సమస్య పెరుగుకుంటూ వచ్చి కంటి చూపు కోల్పోయే పరిస్థితి వస్తుంది.

Also read: వేసవి ఆహారంలో ఈ ఐదు ఆకుపచ్చ పండ్లు చేర్చండి, చక్కటి ఆరోగ్యం మీ సొంతం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave Alert : వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
Smoking vs Vaping : స్మోకింగ్, వేపింగ్ రెండూ ఒకటేనా? తేడాలు ఏంటి? వీటిపై ఇండియాలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి?
స్మోకింగ్, వేపింగ్ రెండూ ఒకటేనా? తేడాలు ఏంటి? వీటిపై ఇండియాలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి?
Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? FAST టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ప్రాణం కాపాడొచ్చు.. లేకుంటే అంతే
బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? FAST టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ప్రాణం కాపాడొచ్చు.. లేకుంటే అంతే
Risks of Vaping : వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: కాసేపట్లో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
కాసేపట్లో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
MAVIGUN News: మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!
మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!
Hyderabad Metro:ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?
ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?
AP Local Polls: స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?
స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?
మీ ఇంటి షోకేస్‌లో ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను ఏ దిశలో పెట్టాలో తెలుసా?
మీ ఇంటి షోకేస్‌లో ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను ఏ దిశలో పెట్టాలో తెలుసా?
Heatwave Alert : వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
Bengal Chunav 2026: మమతా బెనర్జీ ప్రభుత్వం తిరిగి వస్తుందా? 2026 బెంగాల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే జాతక విశ్లేషణ!
మమతా బెనర్జీ ప్రభుత్వం తిరిగి వస్తుందా? 2026 బెంగాల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే జాతక విశ్లేషణ!
Bollywood Intimate Scenes:
"ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోతున్నారు, కట్‌ చెప్పినా ఆగడం లేదు" బాలీవుడ్ నటులపై సీనియర్ నటుడి ఆరోపణలు! 
Embed widget