అన్వేషించండి

Ratana Tata Food And Life Style: `రతన్ టాటాను ఇన్నేళ్లు ఆరోగ్యంగా ఉంచిన ఆహార నియామలు ఇవే

Ratan Tata Food Habits:

Ratan Tata Heal Secrets: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భౌతికంగా మన మధ్య ఆయన లేకపోయినా చేసిన మంచి, దేశం కోసం ఆయన చేపట్టి కార్యక్రమాలు చిరకాలం గుర్తుండే ఉంటాయి. నిన్న మొన్నటి వరకు కళ్ల ముందే తిరిగే మహోన్నత వ్యక్తి ఒక్కసారిగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం అందర్నీ శోకసంద్రంలో మునిగిపోయారు. 
86 ఏళ్ల వయసులో కూడా చాలా చలాకీగా ఉండే వాళ్లు రతన్ టాటా. సోషల్ మీడియాలో అంతకంటే చురుగ్గా పోస్టులు పెట్టేవాళ్లు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఆయన్ని ఎక్కువ కాలం దేశానికి, ప్రజలకు సేవ చేసేలా చేశాయి. సరళమైన, పౌష్టికాహారం తీసుకుంటూ ఉండేవాళ్లు. ఒక పార్సీగా తన సంప్రదాయపద్ధతులను తూచా తప్పకుండా పాటించేవాళ్లు. 

ఎంత ఇష్టమైన ఆహారాన్ని అయినా మితంగా తినడం

రతన్ టాటా ఎక్కువగా ఇంట్లో వండిపెట్టిన ఆహారాన్నే ఇష్టపడేవారు. సోదరి చేసే సాంప్రదాయ వంటకాలను ఇష్టంగా తినేవాళ్లు. విలాసవంతమైన, రెస్టారెంట్-తయారు చేసిన వంటకాల కంటే ఇంటిలో వండిన భోజనాన్ని తృప్తిగా భుజించేవాళ్లు. మితంగా ఇష్టంగా తినడం రతన్ టాటా ఆహారపు అలవాట్లలో ప్రధానమైంది. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా తగినంత మాత్రమే తీసుకునే వాళ్లు. అందుకే 70 ఏళ్ల వయసులో కూడా చాలా చలాకీగా ఉండే వాళ్లు. ప్రముఖ పార్సీ చెఫ్ పర్వేజ్ పటేల్ ఓ ఇంటర్వ్యూలో హోమ్‌స్టైల్ పార్సీ వంటకాలను రతన్ టాటా ఇష్టపడతారని వెల్లడించారు. చాలా కాలం ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్న వ్యక్తుల్లో పటేల్ ఒకరు. ఖట్టా-మీఠా మసూర్ దాల్, మటన్ పులావ్ పప్పు, నట్-రిచ్ బేక్డ్ సీతాఫలం ఇష్టంగా తినేవాళ్లు. గిలకొట్టిన గుడ్లతో చేసిన ఓ వంటకాన్ని కూడా తినే వాళ్లు. 

పోషకాలు ఉన్న ఇంటి ఫుడ్

రతన్ టాటా భోజనంలో తక్కువ ప్రాసెస్డ్‌ ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకునే వాళ్లు. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేవి. ఎక్కువ కేలరీలు తీసుకోకుండా తన బాడీకి ఎంత పోషకాలు కావాలనే ఆ మేరకు తినే వాళ్లు. అన్నం మరియు రోటీతోపాటు తృణధాన్యాలు, పప్పులు ఉండేవి. తాజా పండ్లు, కూరగాయలు రతన్ టాటా ఆహారంలో రెగ్యులర్. సీజనల్‌ ఫ్రూట్స్‌కు ఎక్కువ ప్రయార్టీ ఇచ్చే వాళ్లు. యాపిల్స్, అరటిపండ్లు, సిట్రస్ పండ్లు వంటి పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకునేవాళ్లు.

స్పూర్తినిచ్చే క్రమశిక్షణ

అవే ఆయన రోగనిరోధక శక్తిని బలోపేతం చేశాయి. ప్రతి రోజూ ఒక కప్పు టీ మాత్రం కచ్చితంగా తీసుకునే వాళ్లు. చక్కెర తక్కువ తీసుకోవడం, పుష్కలంగా నీరు తాగడం రతన్ టాటా దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్‌ను పూర్తిగా దూరం పెట్టేవారు. వీటికి బదులు ఇంట్లో తయారుచేసిన భోజనం ఎక్కువ ఇష్టపడే వాళ్లు. ఇష్టమైన ఆహారాన్ని ఇంట్లోనే వండించుకొని తినేవాళ్లు. ఆహారం పట్ల తీసుకున్న ఈ జాగ్రత్తలే ఆయన్ని ఇంత కాలం సమాజానికి సేవ చేసేలా చేశాయి. రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే క్రమశిక్షణ వారసత్వంగా ఇచ్చారు. 

Also Read: టాటా ట్రస్ట్స్‌ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా - ఏకగ్రీవంగా ఎన్నిక

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget