By: ABP Desam | Updated at : 23 Feb 2023 07:26 PM (IST)
Edited By: Bhavani
Representational image/ pixels
క్లీనింగ్ అంటే మనలో చాలా మందికి పెద్దగా నచ్చని పని. ఎన్ని రోజులు వాయిదా వేసినా ఏదో ఒకరోజు చెయ్యక తప్పని పని కూడా. గ్లాస్ మీద ఫోంక్లీనర్ ను స్ప్రే చెయ్యడం మంచి ఫీలింగ్ ఇస్తుండొచ్చు . బాత్రూమ్ లో బ్లీచింగ్ కూడా వెయ్యొచ్చు. కానీ అలాంటి పనులు చేస్తున్నపుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. క్లీనింగ్ కు పూనుకున్నపుడు మాస్క్ ధరించడం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుందట.
⦿ క్లీనింగ్ ఏజంట్ల వల్ల ఊపిరితిత్తుల్లో మకిలి చేరుతుందని చెబుతున్నారు. సాధారణంగా క్లీనింగ్ పనుల్లో ఉన్నపుడే ఇలాంటిది జరుగుతుందట.
⦿ మురికి లేదా బూజు వంటి దాన్ని శుభ్రం చేస్తుంటే మాస్క్ తప్పక ధరించాలి. కార్పెట్లను తరచుగా ఎండలో ఆరబెట్టడం అనేది కూడా చాలా అవసరమని ఆమె సలహా ఇస్తున్నారు.
⦿ క్లీనింగ్ ఏజెంట్స్, పేయింట్స్, కొత్త కార్పెట్స్ నుంచి ఒలెటైల్ ఆర్గానిక్ కాంపౌడ్స్ రిలీజ్ అవుతాయి. వీటి వల్ల ఊపిరితిత్తులు, ఎయిర్ వేస్‌లో ఇన్ఫ్లమేషన్ తో పాటు నష్టం కూడా కలిగించవచ్చు.
⦿ గర్భస్థ దశ నుంచే ఊపిరితిత్తులు అభివృద్ది చెందుతాయి. ఇవి పూర్తిగా పరిపక్వత చెంది గరిష్ట సామర్థ్యంలో పనిచేసేందుకు 20 సంవత్సరాల వయసు రావాల్సి ఉంటుంది. 20 సంవత్సరాల వయసు తర్వాత ప్రతి ఒక్కరిలో ఆ వయసు తర్వాత కొద్దికొద్దిగా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
⦿ శ్వాసలో ఇబ్బంది మొదలయ్యే నాటికే ఊపిరితిత్తుల్లో చాలా నష్టం వాటిల్లిందని అర్థం అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చాలా మంది తమ ఊపిరితిత్తులకు జరుగుతున్న నష్టాన్ని గురించి తెలుసుకోలేరు.
⦿ పొగతాగే అలవాటు లేని వారి ఊపిరితిత్తుల్లో కూడా బ్లాక్ స్పాట్స్ కనిపించాయని, ఇందుకు కారణం మనం లోపలికి పీల్చుకునే వాటిలో కొంత భాగం తిరిగి బయటికి రాదని ఆమె చెబుతున్నారు.
⦿ రెగ్యులర్ గా ఇంటిని క్లీన్ చేసుకునే వారిలో 20 సంవత్సరాల వ్యవధిలో లంగ్ కెపాసిటి తగ్గిపోయే ప్రమాదం 14 శాతం ఎక్కువగా ఉంటుందట. ఊపిరితిత్తులకు హాని చేసే పదార్థాలు సాధారణంగా బ్లీచ్ లు, లక్విడ్ ఫ్లోర్ క్లీనర్లు, క్లీనింగ్ ఎజెంట్స్ లోనే ఉంటాయట.
క్లీనింగ్ స్ప్రే వంటి వాటిని ఉపయోగించినపుడు మనం పీల్చే గాలిలోకి చల్లుతున్న రసాయనాల పూర్తిగా తెలుసుకోవడం అవసరం. తరచుగా క్లీనింగ్ ఎజెంట్స్ కి ఎక్స్‌పోజ్ కావడం వల్ల అస్తమా వంటి సమస్యలు రావచ్చు. వీలైనంత వరకు నాన్ టాక్సిక్ క్లీనర్లను ఉపయోగించాలని అమెరికన్ లంగ్ అసోసియేషన్ నిపుణులు సలహా ఇస్తున్నారు. హైజీన్ పేరుతో చాలామంది ఇంట్లో క్లోరిన్ బ్లీచ్ లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ కు కారణం అవుతాయి. నిజానికి అలాంటివి ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇవి ఉపయోగించే వారిలో చాలా మంది ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటించాలో కూడా తెలియదు. క్లీనింగ్ ఏజెంట్స్ ఉపయోగిస్తున్నపుడు పార్టికల్ మాస్క్ లు ధరించడం మంచిది. ఇవి పొగలను పీల్చకుండా అడ్డుకుంటాయి. వీటితో నిరంతరం పనిచేసే కార్మికులు నాణ్యమైన పరికరాలను వాడడం వల్ల కొంత నష్టాన్ని నివారించవచ్చు.
Also Read: మీ మూత్రం రంగును బట్టి రోగాన్ని చెప్పేయొచ్చు - ఈ రంగులోకి మారితే జాగ్రత్త!
Lemon Water: రోజూ నిమ్మరసం తాగుతున్నారా? దాని వల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Brain Health: మీ జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే ఈ ఆహారాన్ని మెనూలో తప్పకుండా చేర్చాల్సిందే
గురక ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ వ్యాయామాలతో పూర్తిగా ఉపశమనం
Ugadi Recipes: ఉగాదికి సింపుల్గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది
World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా