అన్వేషించండి

Lollipops: ఇకపై రోగనిర్ధారణ పరీక్షల్లో లాలీపాప్స్ సహాయం, చెబుతున్న కొత్త అధ్యయనం

లాలీపాప్స్ సాయంతో కూడా శాంపిల్‌ను సేకరించవచ్చని చెబుతోంది కొత్త అధ్యయనం.

Lollipops: పిల్లలకు ఎంతో ఇష్టమైన పదార్థం లాలీపాప్. ఈ స్వీట్ ట్రీట్ అంటే వారికి అంతులేని ఆనందం. అయితే లాలీపాప్‌ను శాంపిల్ సేకరణలో, రోగనిర్ధారణ ప్రక్రియలలో భాగం చేయవచ్చని చెబుతోంది ఒక అధ్యయనం. లాలీపాప్ లాలాజలం‌లోని బ్యాక్టీరియాను సంగ్రహించగలదని, దాని సాయంతో లాలాజల శాంపిల్‌ను సేకరించి పరీక్షలు చేయవచ్చని చెబుతున్నారు. స్ట్రెప్ థ్రోట్ బంటి అనేక అనారోగ్యాల నిర్ధారణ కోసం నమూనాలను సేకరించవలసి వస్తుంది. ఆ నమూనాలను నోట్లోంచి సేకరించాలి. వాటిని లాలిపాప్ సాయంతో సేకరించవచ్చు. కోవిడ్ 19 సమయంలో సలైవాను సేకరించి పరీక్షలు చేశారు. అలా సలైవా సేకరించేందుకు లాలీపాప్ సాయం తీసుకోవచ్చని చెబుతోంది అధ్యయనం.

అవసరమైన మొత్తంలో లాలాజలాన్ని సేకరించడానికి లాలీపాప్స్ ఉపయోగపడతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గతంలో లాలీపాప్ ఆకారంలో ఉండే పరికరాలు ఉండేవి. వాటిని క్యాండీ కలెక్టివ్ అని పిలిచేవారు. వాటితో లాలాజలాన్ని సేకరించేవారు. ఇప్పుడు ఆ క్యాండీ కలెక్టివ్ పద్ధతి కనుమరుగైపోయింది.  లాలీపాప్ తినేటప్పుడు లాలాజలం సులభంగా దానికి అధిక స్థాయిలో అంటుతుంది. అలాగే నోట్లో ఉన్న బ్యాక్టీరియాలు కూడా అంటుతాయి. ఆ లాలీపాప్‌ను ల్యాబ్లో పరీక్షిస్తే ఆ బాక్టీరియా వల్ల కలిగిన అనారోగ్యాలను కనిపెట్టవచ్చు.

ఇరవై మంది పెద్దవారిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారికి క్యాండీ కలెక్టివ్ పద్ధతితో పాటు, సాధారణ పద్ధతుల్లో కూడా నమూనా కిట్లను ఇచ్చి వాడమని చెప్పారు. తర్వాత ఆ కిట్లను ల్యాబ్ కు పంపించి పరిశీలించారు. సాంప్రదాయక పద్ధతుల్లో ఇచ్చిన కిట్లు కేవలం ఒకటి లేదా రెండు బ్యాక్టీరియాలను మాత్రమే గుర్తించాయి. కానీ క్యాండీ కలెక్ట్ పద్ధతిలో అంటే లాలీపాప్స్ తినే పద్ధతిలో అయితే వందశాతం బ్యాక్టీరియాను గుర్తించింది. కాబట్టి ఇకపై లాలీపాప్ కూడా రోగనిర్ధారణ పరీక్షల్లో భాగం అయ్యే అవకాశం ఉంది. 

లాలీపాప్స్‌ను తొలిసారి 1908లో తయారు చేశారు. మిఠాయిల తయారీదారు అయిన జార్జ్ స్మిత్ మొదటిసారిగా లాలిపాప్ ను తయారుచేశారు. దీనికి అతనే ఈ లాలీ పాప్ అనే పేరు పెట్టాడు. అతనికి ఇష్టమైన రేసు గుర్రం పేరు అదే. అందుకే ఆ గుర్రం పేరునే ఈ మిఠాయికి పెట్టాడు. వేల ఏళ్ల క్రితం చిన్న పుల్లకు తేనెను రాసి తినేవారు. అదే మొదటి లాలీపాప్ అని కూడా చెప్పుకుంటారు. తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి తేనెను లాలీపాప్‌లా తయారు చేసి పిల్లలకు తినిపించే వారు.  

Also read: ఈ జబ్బు వచ్చిందంటే శరీరమంతా వణికిపోవడమే

Also read: డయాబెటిస్ ఉన్నవారికి ఔషధం పనస పిండి - బియ్యం, గోధుమలకు బదులు దీన్ని వాడండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Leafy Greens Benefits : రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
Mutton Fry Recipe : ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
Early Signs of Liver Problems : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
30 Minute Daily Walk : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Sunday Puja Vidhi : ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
Embed widget