అన్వేషించండి

Milk And Diabetes: మధుమేహులు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం చెప్తున్నారు

డయాబెటిస్ వచ్చిందంటే దాన్ని పోగొట్టుకోవడం కష్టం. అయితే సరైన ఆహారాలు తీసుకుంటే నియంత్రణలో ఉంచుకోవచ్చు.

ప్రపంచంలోనే డయాబెటిక్ క్యాపిటల్ గా పిలువబడే దేశం ఏదో తెలుసా? మరేదో కాదు భారతదేశమే. దాదాపు 77 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. డయాబెటిస్ అనేది శరీరాన్ని పూర్తిగా లేదంటే పాక్షికంగా గ్లూకోజ్ ని ఉపయోగించడకుండా నిరోధించే ఒక జీవక్రియ రుగ్మత. ఆహారంలో మార్పులు, అధిక కేలరీల ఆహారం, తక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, అధిక బరువు మొదలైనవి భారతీయులు మధుమేహం బారిన పడేలా చేస్తున్న అనేక కారణాలు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండటం, పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

షుగర్ లెవల్స్ అదుపులో ఉంచే ఆహార చిట్కాలు

☀ సాధారణం కంటే తక్కువగా తినడం, భోజనం తీసుకోవడం ఆలస్యం చేయడం వంటి వాటి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతాయి. అందుకే రెగ్యులర్ గా భోజనం తినాలి.

☀ ప్రతి భోజనంలో పిండి పదార్థాలని తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు కార్బోహైడ్రేట్లు తీసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అందుకే రోజువారీ అవసరాలకు అనుగుణంగా పిండి పదార్థాలు తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో పాటు తృణధాన్యాలు, పప్పులు ఉన్న భోజనం చేయడం మంచిది.

☀ గ్లైసెమిక్ ఇండెక్స్(GI) తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని పెరగకుండా చేస్తుంది. 55 అంతకంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్థూలకు సురక్షితంగా పరిగణిస్తారు. 70 కంటే ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి.

మధుమేహులు పాలు తీసుకోవచ్చా?

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 12 వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఎముకల ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాలను క్రమం తప్పకుండా తీసుకునే వారిలో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సాధారణంగా డయాబెటిక్ రోగుల్లో కనిపిస్తుంది. దీని వల్ల రక్తపోటు, కార్డియో వాస్కులర్ వ్యాధులు, పేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.

టైప్ 2 డయాబెటిస్ రొగులు పాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని పలు పరిశోధనలు చెబుతున్నాయి. పాలల్లో ప్రోటీన్ ఎక్కువ. ఇది పోస్ట్‌ప్రాండియల్ ఇన్సులిన్ ప్రతిస్పందనను పెంచుతుంది. డయాబెటిస్ రోగులలో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గేలా చేస్తుంది. అయితే పాలలో లాక్టోజ్ ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్ ను రోజు మొత్తం మీద తీసుకునే పిండి పదార్థాలతో పోల్చి చూసుకోవాలి. పాల రకాన్ని బట్టి GI 31-37 మధ్య ఉంటుంది. ఇటువంటి తక్కువ GI ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు. సువాసన లేదా తియ్యటి పాలు మాత్రం మధుమేహులు తప్పకుండా నివారించాలి. ఎన్ఐఎన్ మార్గదర్శకాల ప్రకారం పెద్దలు ప్రతిరోజూ 300ఎంఎల్ పాలు తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇదే వర్తిస్తుంది. కొవ్వు తక్కువ ఉండే పాలు ఎంచుకోవడం ఉత్తమం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
Embed widget