అన్వేషించండి

Dengue Fever: మెదడుపై మొదటి దాడి? భయానకంగా మారుతోన్న డెంగ్యూ - షాకింగ్ విషయాలు చెప్పిన డాక్టర్స్

Dengue fever: డెంగ్యూ వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు. అది మన శరీరానికి చేరే నష్టాన్ని అస్సలు ఊహించలేం. చివరికి మన మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ నీళ్లు నిల్వ ఉంటున్నాయి. అవే ఇప్పుడు.. దోమలకు ఆవాసాలుగా మారనున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ దోమలు గుడ్లు పెట్టేందుకు ఇదే సరైన సమయం. నిలిచిన నీరు, అధిక తేమ ఏడిస్ దోమ వృద్ధికి కారణమవుతాయి. మరి, మనం వాటికి ఆ అవకాశం కల్పించకూడదంటే.. మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిలబడకుండా జాగ్రత్తపడండి. ఇంట్లో కూడా ఎక్కడా నీరు నిలువ ఉంచకూడదు. ఎందుకంటే.. కాలం మారుతోన్న కొద్ది డెంగ్యూ కూడా ముదురుతోంది. మరింత ప్రమాదకరంగా మారుతోంది.డాక్టర్లు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. తాజాగా డాక్టర్లు చెప్పిన కొన్ని విషయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

డెంగ్యూ వస్తే జ్వరం వస్తుంది. అది ముదిరితే.. రక్తంలో క్రమేనా ప్లేట్‌లెట్స్ పడిపోవడం మొదలవుతుంది. వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ కానట్లయితే.. ప్రాణాలకే ముప్పు. అయితే, ఈ వైరల్ ఫీవర్ మనకు తెలియకుండానే మరో నష్టాన్ని కలిగిస్తోంది. నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప ప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, కర్ణాటక, ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంగ్యూ సాధారణ ఫ్లూ లక్షణాలను కలిగి ఉన్నా.. అది నాడీ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఎన్సెఫాలిటిస్, మెనింజైటిస్, మైలిటిస్.. మెదడు, వెన్నుపాము వాపుకు కారణమవుతాయి. ఫలితంగా డెంగ్యూ రోగులు తరచు తలనొప్పితో బాధపడతారు. అలాగే వారి మానసిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి. కొందరు కోమాలోకి జారుకోవచ్చు.

నేరుగా మెదడు, నాడి వ్యవస్థపై దాడి?

వైరస్‌కు చెందిన న్యూరోట్రోపిక్ స్వభావం నేరుగా నాడీ కణాలను తాకడం వల్లే ఇలా జరుగుతుంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గినప్పుడు శరీరంలోని వివిధ భాగాల్లో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. చివరికి మెదడులో కూడా రక్తస్రావం జరిగి.. పరిస్థితి మరింత దిగజారే ముప్పు ఉంది. కాబట్టి, డెంగ్యూను తేలిగ్గా తీసుకోవద్దు. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చులే అనుకోవద్దు. డెంగ్యూ రోగిని హాస్పిటల్‌లో చేర్చి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచడం చాలా మంచిది. 

ప్లేట్‌లెట్స్ సంఖ్య ఎంత తగ్గితే ప్రమాదకరం?

సాధారణంగా శరీరంలో ప్రతి మైక్రో లీటర్ రక్తంలో 150,000 నుంచి 450,000 వరకు ప్లేట్ లెట్స్ ఉండాలి. 150,000 కంటే తక్కువ ప్లేట్‌లెట్స్ ఉంటే.. సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు పరిగణిస్తారు. డెంగ్యూ సోకిన రోగిలో ప్లే‌ట్‌లెట్స్ చాలా వేగంగా తగ్గిపోతుంటాయి. ప్లేట్‌లెట్స్ 50,000 వరకు తగ్గినట్లయితే.. తప్పకుండా హాస్పిటల్‌లో జాయిన్ కావాలి. ప్లేట్‌లెట్స్ సంఖ్య 20,000 తక్కువకు పడిపోతే.. శరీరంలో రక్తస్రావం ఏర్పడుతుంది. కాబట్టి, దోమలతో జర భద్రం. మీకు జ్వరం వచ్చి తగ్గుతున్నట్లయితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ సూచన మేరకు రక్తం, ప్లేట్‌లెట్స్‌ల పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఒక వేళ ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతున్నట్లు రిపోర్టులో తేలితే.. మరింత అప్రమత్తంగా ఉండాలి. పైన సూచించిన సంఖ్యకు ప్లేట్‌లెట్స్ పడిపోతే హాస్పిటల్‌లో చేరడం ఉత్తమం.

Also Read: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!


Dengue Fever: మెదడుపై మొదటి దాడి? భయానకంగా మారుతోన్న డెంగ్యూ - షాకింగ్ విషయాలు చెప్పిన డాక్టర్స్

టాప్ హెడ్ లైన్స్

Japan Population Crisis : జపాన్​లో పెరుగుతోన్న వృద్ధులు, తగ్గుతోన్న యువత.. జాబ్ స్ట్రెస్​తో పెళ్లి, పిల్లలకు దూరం!
జపాన్​లో పెరుగుతోన్న వృద్ధులు, తగ్గుతోన్న యువత.. జాబ్ స్ట్రెస్​తో పెళ్లి, పిల్లలకు దూరం!
Alzheimers Patient Care : అల్జీమర్స్‌ పేషెంట్లను చూసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. డాక్టర్‌ సూచనలు ఇవే
అల్జీమర్స్‌ పేషెంట్లను చూసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. డాక్టర్‌ సూచనలు ఇవే
Korrapongali Recipe : కొర్ర పొంగల్ రెసిపీ.. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. తప్పక ట్రై చేయండి
కొర్ర పొంగల్ రెసిపీ.. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. తప్పక ట్రై చేయండి
Anemia Symptoms : మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇది రక్తహీనత (Iron Deficiency) కావచ్చు, లైట్ తీసుకోకండి
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇది రక్తహీనత (Iron Deficiency) కావచ్చు, లైట్ తీసుకోకండి

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
Virat Kohli Mastery Beyond Numbers: సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
YS Jagan double stand: వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
Embed widget