అన్వేషించండి

Headaches: తలనొప్పి పురుషులకన్నా మహిళలకే ఎందుకు ఎక్కువగా వస్తుంది? కారణం ఇదే

Headaches: పురుషుల కన్నా మహిళల కే తలనొప్పి ఎక్కువగా వస్తుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. మహిళల్లో ఎక్కువగా హార్మోనల్ సమస్యలతో పాటు ఒత్తిడి కూడా ఈ తలనొప్పికి కారణంగా చెబుతున్నారు.

Headaches: తలనొప్పి అనేది అనేక కారణాలవల్ల వస్తూ ఉంటుంది. దీనికి నిర్దిష్టమైన కారణం అంటూ ఏది ఉండదు. అలాగని తలనొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే కొన్ని తలనొప్పులు ప్రమాదకరమైన జబ్బులకు సంకేతం కావచ్చు. తలనొప్పిపై ఇటీవల అమెరికా వైద్య నిపుణులు జరిపిన ఓ అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

అమెరికాలో దాదాపు 11.2 కోట్ల మంది తలనొప్పి కారణంగా అనారోగ్యం పాలవుతున్నారని గుర్తించారు. దీనికి సంబంధించి ‘జర్నల్ ఆఫ్ హెడేక్ అండ్ పెయిన్’ పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేశారు. తలనొప్పి స్త్రీ, పురుషుల్లో వేర్వరుగా ఉంటుందని అందులో పేర్కొన్నారు. పురుషులకన్నా కూడా మహిళలకు తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా 50 సంవత్సరాలు లోపు మహిళలు తలనొప్పి కారణంగా తీవ్రమైన అనారోగ్యం ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇందుకు కొన్ని కారణాలను కూడా వెల్లడించారు.

హార్మోనల్ సమస్యల వల్ల తలనొప్పి:

సాధారణంగా మహిళల్లో రుతుక్రమం కారణంగా శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు ద్వారా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు,  మెనోపాస్ దశలోనూ  శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని, ఈ కారణంగానే  తలనొప్పి వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ శరీరంలో తగ్గినప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 

చిన్నతనంలో తలనొప్పి బారిన పడే వారిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఈ స్టడీలో పేర్కొన్నారు. అయితే వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుందని తెలిపారు. ఎందుకంటే  పురుషుల శరీరంలో  హార్మోన్లు  యుక్త వయసుకు వచ్చిన అనంతరం స్థిరంగా ఉంటాయి. పెద్దగా హెచ్చుతగ్గులు ఉండవు. ఈ కారణంగానే వారిలో తలనొప్పి వచ్చే అవకాశం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరో అధ్యయనంలో మహిళల్లో రుతుక్రమం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పటినుంచి ఈ మైగ్రేన్ తలనొప్పి ప్రారంభమవుతుంది. మెనోపాజ్ వరకు ఈ పాట్లు తప్పవని ఈ అధ్యయనంలో తేలింది. దీనికి ప్రధాన కారణం ఈస్ట్రోజన్ లెవెల్స్ శరీరంలో తగ్గడమే.

ఒత్తిడి కూడా తలనొప్పికి కారణం:

మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా పని ఒత్తిడి కారణంగా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధ్యయనంలో భాగంగా ఒక లక్ష మంది ఉద్యోగులను అధ్యయనం చేస్తే వారిలో కనీసం 600 వరకు కేసులు తీవ్రమైన తలనొప్పి కారణంగా అనారోగ్యం పాలైనట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. దీనికి ప్రధాన కారణం.. పనిలో ఒత్తిడి అని తేలింది. ఒత్తిడితో పాటు ఆందోళన చెందడం ద్వారా కూడా తలనొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్ర విషయంలో కూడా,  పొరపాట్లు చేసినట్లయితే తలనొప్పి తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పరిష్కారం ఇదే:

తలనొప్పి నుంచి బయటపడేందుకు కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. తరచూ వ్యాయామం చేయడం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా వంటి మానసిక ప్రశాంతత కలిగించే అభ్యాసాలు చేయడం, సరైన పోషకాహారం తీసుకోవడం, ప్రశాంతంగా ఉండటం, నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : కొవిడ్ జెఎన్​ 1 లక్షణాలు ఇవే.. దీనితో ప్రాణహాని తప్పదా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Snake Gourd Dal : పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget