Gokarna Trip: గోకర్ణలో పాపులర్ అవుతున్న స్లో లివింగ్ లైఫ్ స్టైల్, అంటే ఏం చేస్తారు?
Gokarna Temple: స్లో లివింగ్ జీవనశైలి ఈ మధ్య ప్రాచుర్యం పొందుతోంది. పని ఒత్తిడి, ట్రాఫిక్ నుండి దూరంగా ప్రకృతిలో ప్రశాంతంగా గడపాలని కోరుకునే వారు గోకర్ణ వంటి కోస్టల్ ప్రదేశాలను సందర్శిస్తున్నారు.
Slow Living Lifestyle: కర్ణాటక లోని గోకర్ణ కేవలం ఒక టెంపుల్ టౌన్ మాత్రమే కాదు, ఇప్పుడు ఇది స్లో లివింగ్ జీవనశైలి అనుభవించాలనుకునే వారి కోసం ఒక టూరిస్ట్ ప్రదేశంగా మారింది. కరోనా మహమ్మారి తరువాత ఉద్యోగులు రిమోట్ లొకేషన్స్ లో పనులు కొనసాగించే అవకాసం దక్కింది. కంపెనీలు కూడా వారి ఉద్యోగులకు Remote Working Flexibility అందుబాటులో తేవడం తో ప్రజలకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విలువ అర్థమవుతోంది.
స్లో లివింగ్ జీవనశైలి ఈ మధ్యకాలంలో భారతదేశంలో ప్రాచుర్యం పొందుతోంది. రోజువారీ పని ఒత్తిడి, ట్రాఫిక్ నుండి దూరంగా ప్రకృతిలో ప్రశాంతంగా గడపాలని కోరుకునే వారు గోకర్ణ వంటి కోస్టల్ ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ జీవనశైలిలో ప్రకృతి తో మమేకమై జీవిస్తూ, ఆన్లైన్ లో తమ రోజువారి ఉద్యోగ పనులు కూడా కొనసాగిస్తున్నారు ప్రజలు. 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉండటం వల్ల వందలాది మంది పర్యాటకులు గోకర్ణ లాంటి కోస్టల్ రీజియన్ లో కొన్ని నెలల తరబడి ఉండి స్లో లివింగ్ లైఫ్‌స్టైల్‌ను ఆస్వాదిస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం వరకూ గోకర్ణ లో ప్రధానంగా విదేశీ పర్యాటకులు మాత్రమే నెలలు పాటు ఇక్కడే బస చేసి ప్రకృతిలో లీనమై, ప్రశాంతమైన జీవితం గడుపుతుండేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా ఈ స్లో లివింగ్ జీవన విధానానికి ఆకర్షితులు అవుతున్నారు. ఇది వారి మానసిక ప్రశాంతతకు కూడా చాలా ఉపయోగపడుతోంది అని చెబుతున్నారు.
హైదరాబాద్ నుండి గోకర్ణకు ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుండి గోకర్ణకు రైలు ప్రయాణం ద్వారా చేరుకోవడం ఉత్తమం. నాంపల్లిలోని హైదరాబాద్ డెక్కన్ స్టేషన్ నుండి మధ్యాహ్నం ప్రతి రోజూ 3:50 నిమిషాలకు హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరుతుంది. హైదరాబాద్ నుండి పలు ప్రైవేటు సంస్థలు గోకర్ణ కు బస్సులు కూడా అందుబాటులోకి తెచ్చాయి. తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఎంజీబీయస్ నుండి హుబ్లీ కు డైరెక్ట్ బస్ అందుబాటు లో ఉంచింది. అదే విధంగా కర్నాటక రోడ్డు రవాణా సంస్థ హుబ్లీ, కార్వార్ ప్రదేశాలకు డైరెక్ట్ బస్సు అందుబాటు లో ఉంచింది. హుబ్లీకి చేరుకున్న తర్వాత, గోకర్ణకు డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో అంకోలా మీదుగా బస్సులు లభిస్తాయి, అందువల్ల ప్రయాణం చాలా సులభం.
గోకర్ణలోని పర్యాటక ప్రదేశాలు:
గోకర్ణ కేవలం పవిత్రమైన టెంపుల్ టౌన్ మాత్రమే కాదు, ఇది స్లో లివింగ్ జీవనశైలిని అనుసరించాలనుకునే వారి కోసం ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం గా మారింది. ఇక్కడ 4 బీచులు చాలా ఫేమస్. వాటిలో ఓం బీచ్, కుడ్లే బీచ్, పారడైజ్ బీచ్, గోకర్ణ మెయిన్ బీచ్ ముఖ్యమైనవి. ప్రతి బీచ్ కు ఒక్కో ప్రత్యేకత అండి. అలాగే, గోకర్ణ నుండి 30-45 km సమీపంలో మురుదేశ్వర్, మిర్జాన్ ఫోర్ట్, హోన్నావర్, కార్వార్ వంటి పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి, వీటిని సులభంగా సందర్శించవచ్చు. ఇక్కడి ప్రకృతి అందాలు, శివ ఆత్మలింగ టెంపుల్ వంటి పవిత్ర క్షేత్రాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ప్రభుత్వ సౌకర్యాలు:
గోకర్ణలో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, కర్ణాటక ప్రభుత్వం కూడా ఇక్కడ సౌకర్యాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటోంది. బీచ్ ప్రదేశాల వద్ద మెడికల్ సౌకర్యాలు, సూపర్ మార్కెట్లు వంటి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.