అన్వేషించండి

Ghee for Weight Loss : బరువు తగ్గడంలో నెయ్యి నిజంగా హెల్ప్ చేస్తుందా? సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయా? 

Weight Loss Tips : ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి చాలామంది నెయ్యిని ఉపయోగిస్తున్నారు. ఇంతకీ బరువు తగ్గడంలో నెయ్యి హెల్ప్ చేస్తుందా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా?

Ghee benefits and side effects for weight loss : ప్రతి ఇంట్లో దాదాపు నెయ్యిని ఉపయోగిస్తారు. చాలామంది భోజనంలో నెయ్యి ఒక భాగం. ఇది పూర్తిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. అందుకే దీనిని ఇప్పుడు బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు తీసుకుంటారు. అయితే బరువు తగ్గడానికి నెయ్యి నిజంగా పని చేస్తుందా? నెయ్యిని బరువు తగ్గేందుకు ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? వెయిట్ లాస్​ కోసం నెయ్యిని ఎలా తీసుకుంటే మంచిది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మెరుగైన జీర్ణక్రియ

సమర్థవంతమైన పోషక శోషణ, వ్యర్థాలను తొలగించడానికి ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ చాలా అవసరం. ఇలాంటి ఫలితాల కోసం మీరు నెయ్యి తీసుకోవచ్చు. దీనిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మొత్తం జీర్ణక్రియకు చాలా మంచిది. శరీరం పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. తద్వార పరోక్షంగా బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. 

రోగ నిరోధక శక్తికై..

నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫుల్​గా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా దీనిలో విటమిన్ ఎ,ఇ, డి వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు రోగనిరోధక శక్తి పెరగడం, చర్మ ఆరోగ్యం, కాల్షియం శోషణతో సహా వివిధ ప్రయోజనాలు అందించడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యానికి మద్ధతునిస్తాయి. ఇది బరువు తగ్గడానికి చాలా అవసరం. 

కడుపు నిండుగా ఉండేందుకు..

నెయ్యిలో సంతృప్త కొవ్వులు, మోనోశాచురేటెడ్ కొవ్వులు, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వులు మీ కడుపు నిండుగా ఉండడంలో సహాయం చేస్తాయి. మీరు తెలియకుండా ఎక్కువగా తినేస్తున్నారు.. ఎక్కువగా ఆకలి వేస్తుందనుకున్నప్పుడు మీ డైట్​లో నెయ్యిని కలిపి తీసుకోవచ్చు. ఇది మీరు ఎక్కువ సేపు కడుపు నిండేలా చేసి.. అనవసరమైన ఫుడ్ తీసుకోకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మీరు బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. 

థైరాయిడ్ పనితీరుకై.. 

మీరు థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. దానివల్ల మీరు బరువు పెరుగుతుంటే మీరు మీ డైట్​లో నెయ్యి చేర్చుకోవచ్చు. నెయ్యి అయోడిన్​కు మూలం. ఇది థైరాయిడ్ హార్మోన్​ పనితీరును ప్రోత్సాహిస్తుంది. అదనంగా దీనిలో థైరాయిడ్ పనితీరుకు తోడ్పడే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు జీవక్రియ, శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయం చేస్తాయి. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. 

నెయ్యిని తీసుకోవడం కలిగే దుష్ప్రభావాలు

నెయ్యిని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే.. కచ్చితంగా కొన్ని ఉన్నాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు జీవక్రియకు మద్ధతిస్తాయి. బరువు నియంత్రణను ప్రోత్సాహిస్తాయి. కానీ నెయ్యిలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి. దాని వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నప్పటికీ.. నెయ్యి అధిక వినియోగం వల్ల బరువు పెరగడం, ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి నెయ్యిని మితంగా తీసుకుంటే బరువు తగ్గడానికి మంచిదవుతుంది. అలాగే బరువు తగ్గడంలో నెయ్యి అందరికీ హెల్ప్ కాదు. కొలెస్ట్రాల్, కాలేయ సమస్యలు ఉన్నప్పుడు నెయ్యిని తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. 

బరువు తగ్గేందుకు నెయ్యిని ఎలా తీసుకోవచ్చు..

బరువు తగ్గడానికి నెయ్యిని తీసుకునేటప్పుడు మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇతర నూనెలు, వెన్నకు బదులుగా దీనిని వంటల్లో చేర్చుకోవచ్చు. కానీ కంట్రోల్​గా వాడాలి. దీని చపాతీలకోసం, సూప్​లలో, పప్పులలో కలిపి తీసుకోవచ్చు. కిచిడి, పసుపు పాలలో కూడా నెయ్యి తీసుకోవచ్చు. 

Also Read : స్టామినాను పెంచుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget